Pages

Thursday 24 May 2012

దీన దీపికలు




దీన  దీపికలు

ఎవరివా నయనాలు? ..... దీన దీపికలై నను వెంటాడుతున్నాయి.

ఎవరిదా చిరుకదలిక? ..... మంద గమనమై నను చేరాలని చూస్తుంది.

ఎక్కడిదా పిలుపు? ..... అంత దీనంగా ఉండి నను నిలిపివేస్తుంది .

ఎందుకా చిట్టి కెరటం అంత వడిగా నను తడపాలని చూస్తుంది?

ఎక్కడిదా చిన్ని రూపం? ..... అంత ఆశగా నను హత్తుకోవాలని చూస్తుంది.

ఎలా పడ్డాయి ఈ వెన్నెల మరకలు నా హృదయాంబరం పై?

ఎందుకు ఈ చుక్కలు దిక్కులేనివై చెల్లాచెదురయ్యాయి?

ఏ దోషానికి ఈ ముత్యపు చిప్పలు ఇలా ఉప్పెనలో మునుగుతున్నాయి?

ఏ శాపానికి ఈ మేఘమాలికలు గగన గర్భం నుండి నేల రాలాయి?

పుట్టిన గడ్దనీ, కట్టిన బట్టనీ ఎరుగని ఈ బాల గంధర్వులను, ఏ అక్షయ పాత్రతో ఆదుకోగలను.

ఆ పాల బుగ్గల పై జారే పసిడి ధారలను ఏ ఆపన్నవస్త్రం తో తుడవ గలను.

ఆ చిన్ని బోజ్జలను నింపటానికి ఏ అక్షయ పాత్రను ఆశ్రయించ గలను.

ఈ వెన్నెల కూనలను, ఈ కాళ రాత్రి కరకు సాక్ష్యాలను ఎలా న్యాయ దేవత కు నివేదించ గలను

32 comments:

  1. "ఆ చిన్ని బోజ్జలను నింపటానికి ఏ అక్షయ పాత్రను ఆశ్రయించ గలను.
    ఈ వెన్నెల కూనలను, ఈ కాళ రాత్రి కరకు సాక్ష్యాలను ఎలా న్యాయ దేవత కు నివేదించ గలను "

    ఆ రెండు వాక్యాలు చాలు మీ ఆలోచన ని చెప్పడానికి ...
    చాలా చాలా బాగా రాసారు .దేవుడి దయ ఉంటే తప్పకుండా మీరు పై ప్రశ్నల్లో కొన్నిటినినన్నా నెరవేర్చగలుగుతారు అనే ఆశ తో కొరుకుంటూ...మరొక్క మారు మనసుని కదిలించేలా రాసినందుకు
    అభినందనలు ఫాతిమా గారు..
    --సీత

    ReplyDelete
    Replies
    1. సీత గారూ , మీ స్పందనకు ధన్యవాదాలు , నేను రాసే ప్రతి అక్షరం వెనుక ఆవేదన నిండి ఉంటుంది అందుకు మీవంటి సున్నిత హ్రిదయాలు ఓదార్పు నిస్తాయి . అనాధలైన ఆ బిడ్డలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది , ఏమి చేయగలం ఎంతమందిని రక్షించ గలం, సమాజం మారాలి అందుకు కొంతైనా మన సిరా ఖర్చు కావలి .

      Delete
  2. Madam .. First of all you..says.. wonderful expression. awesome!!
    but, I feel very sad.. in this situation.
    can..we help possible !???????

    ReplyDelete
  3. వనజ గారూ ,మీ సున్నిత హ్రిదయం అర్ధమైంది కాని మనం ఎంత్ మందిని ఆ దుకోగలం , కొన్ని లక్షల మంది బిడ్డలు అనాదలు ఉన్నారు , మనం చేయగలిగినంత చేయాలి , అందరినీ ఆలోచిప చేయగలగాలి , మీ స్పందనకు ధన్య వాదాలు నేస్తం

    ReplyDelete
  4. madam me alochanna,kavita,me bhavana adbutam.vare kosam okaru alochistunarani vareki taledu.

    ReplyDelete
  5. anonyous garu mee spandanaki thanks , asalu anaadalu undakudadu aa roju raavali aa chinni praanulu gaaliki dooliki perigi cheedarimpulu chavi cusi samaajam meeda kasi penchukune pramadam undi , pedarikam naithika viluvalu inka enno ee biddalu veedina padelaa chestunnaei ,

    ReplyDelete
  6. alochanalake konni yugalaipoyaayemoo :)

    sare mee alochanlu mee ishtam alaane alochinchukondi ( sunnita hrudayam tooo )

    JAIHIND!

    ReplyDelete
  7. కవయిత్రి గారు, దీన దీపికలు బాగుంది. గోపికలకు కౄష్ణుడిలా, ఆ ఆపన్నులకు. మీరు అక్షయపాత్ర కాగలరని ఆశిస్తున్నాను. భగవంతుడు మీకు ఆ శక్తి ఇచ్చాడు అని నా నమ్మకం.

    ReplyDelete
  8. సార్, మీ ప్రశంసకు ధన్యవాదాలు , మీరన్నట్లు నాకు ఆ దీన దీపికలను ఆడుకునే శేక్తి అల్లా ఇస్తే చాలు , ప్రముఖ కవి సమయం వెచ్చించి నా బ్లాగ్ దర్శించినందుకు మరో మారు కృతజ్ఞతలు

    ReplyDelete
  9. పసివాళ్ళ దీనత్వం మీ కవితలో కళ్ళకి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఫాతిమా గారూ!
    చాలా బాగుంది...
    @శ్రీ

    ReplyDelete
  10. శ్రీ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు,

    ReplyDelete
  11. highly emotional. ambharam kaadu, ambaram.

    ReplyDelete
  12. so is muppena. There is no word. I think it is Uppena.

    ReplyDelete
  13. Sir,మీ సూచనకు ధన్యవాదాలు. మీ సూచంప్రకారం బ్లాగులో సవరించాను. మీ స్పందనకు ధన్యవాదాలు. మీ సూచనలు ఎల్లప్పుడూ ఆహ్వానిస్తున్నాను.

    ReplyDelete
  14. ఫాతిమ గారూ,
    ఎన్నో చిన్ని అమాయక రూపాలు, నిత్యం మన చుట్టూ తిరిగుతూ ఏ ఊరిన చూసినా, ఏ బస్సు, రైలెక్కినా కనిపించే చిరు దీపాలు, అన్ని దీపాల్లా వెలిగగలిగే శక్తి ఉన్నా, వెలిగించే తైలం కోసం దీనంగా చేతులు చాచి ప్రార్ధించే లేత మనసులు. దేవుడు విధించిన శిక్ష కాదు అది, మన సమాజం విధించిన శిక్ష. చూస్తూ కూడా ఏమీ చెయ్యలేక అసహాయంగా తోచిన సాయం చేసినా కడుపు నిండని పసి కూనలు. విసుక్కునే మనుషుల మధ్య నిరంతరమూ బ్రతుకుతో పోరాడే పసి ప్రాణులు.

    మీ కవితలో ఆ పసి హృదయాల పిలుపుల్లో దీనం, కదలికలో మంద గమనం, నయనాల్లో వెలుగు కోసం ఆరాటం....ఇవన్నీ పద పదానా ప్రస్ఫుటంగా ధ్వనించాయి. చదివిన ప్రతి హృదయాన్నీ కదిలించేలా ఉంది మీ కవిత. మనసున్న ఏ మనిషినైనా కాసేపు ఆలోచింపజేసే కవితారాజం. ఎక్కడ అలాంటి చిరు దీపం తారసపడ్డా మన వంతు సాయం చేసితీరాలి అని మీ కవిత చదివిన కొంత మంది అనుకున్నా ఆ కవితా భావం అందులోని హృదయాల కోసం మీరు పడే ఆవేదనా ఫలించింట్టే...

    మీ వంతు సాయంగా మీరు చేస్తున్న సాయానికీ, కొన్ని హృదయాలనైనా కదిలిస్తున్న వైనానికీ మీకు అభినందనలు!
    “There is no better way to thank God for your sight than by giving a helping hand to someone in the dark.” - Helen Keller

    ReplyDelete
    Replies
    1. Sir, వీది బాలల ఆకలి గూర్చే ఆలోచిస్తున్నాం మనం , వీది బాలికల పరిస్థితి ఏమిటి ? వారికి చిన్న వయస్సులో ఒక్క ఆకలి సమస్య మాత్రమె, కాని వయసు పెరిగే కొలదీ ఆకలి చూపుల మానవ మృగాల నుండి రక్షించుకోవటం మరో పెద్ద సమస్య . గూడు, గుడ్డ కరువైన ఓ ఆనాద బాలిక తన శరీరాన్ని ఎలా దాచుకోగలదు?
      సార్, నా " అరణ్య రోదన " కవితలో ఈ సమస్యనే నేను వివరించింది , వారికి ఎదిగే వయస్సు కూడా శాపమే . తల్లి , తండ్రీ , చదువూ ఆర్ధిక స్తోమతా ఉన్న ఆడపిల్లలకే రక్షణ లేని రోజులివి . అలాంటిది ఈ దీనులు ఎలా తమను తాము రక్షించుకోగలరు ? తమ దీన స్థితికి కారణం ఎవరో తెలియక , ఎవరి సంరక్షణా లేక వీరు సమాజం మీద కసి పెంచుకుని దొంగలుగా , హంతకులుగా మారుతున్నారు . ఎన్ని స్వచ్చంద సంస్థలు ఆదుకున్నా వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది, కనుక సామాజిక మార్పు రావాలి ఎవరి తప్పుకో వీరు బలి కాకూడదు , ఎక్కడ లోపం ఉందొ తెలుసుకుని సరిదిద్దు కొనే శక్తి ప్రతి వక్కరికీ రావాలి, అందుకు వివిధ రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నం అన్ని కోణాల్లో చేయాలి. కేవలం ధన సహాయంతోనే ఈ సమస్య తీరదు. సమస్య మూలాలలోకి వెళ్ళాలి.అక్షరాలతో మనం ఉద్యమించాలి.

      Delete
  15. .....
    (మాటల్లో.. చెప్పలేను.)

    మీరు చెయ్యాలి అనుకునే పనికి.. ఆ భగవంతుడు.. ఎల్లప్పుడూ.... మీకు తోడుగా వుండాలని మనసారా ఆశిస్తూ...

    ReplyDelete
    Replies
    1. మానస గారూ, ధన్యవాదాలు. మీ ప్రార్థన ఫలించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను.

      Delete
  16. ఫాతిమా గారు, కవిత బాగుందని చెప్పనా, ఆ చిన్నారులను చూసి బాధతో కన్నులు చెమర్చాయని చెప్పనా, అన్నీ తెలిసి ఏ విధంగానూ వారి జీవితాలలో వెలుగు నింపలేకపోతున్నాము అని బాధపడనా? వనజగారు అన్నట్టు మీరు చేసే charity work లో ఏదన్నా ఏ రకంగా నైనా సాయపడగలనా?

    ReplyDelete
  17. వెన్నెల గారూ, మీరూ, వనజగారూ, రాజి గారూ, శ్రీగంగ గారూ, హరిపోదిలి గారూ, "మల్లెపందిరి" సంపాదకులు కలిమిశ్రీ గారూ, "ఆశ" సంపాదకులు వేణు గారూ, "నెలవంక నెమలీక" సంపాదకులు లక్కిరాజు దేవి గారూ, చిన్ని ఆశ గారూ, క్యూబ్ వర్మ గారూ, మానస గారూ, జ్యోతిర్మయి గారూ, ఫోటాన్ తమ్ముడు, శ్రీ గారూ, ప్రిన్స్ గారూ, సీత గారూ, ఫణి గారూ, ఎందుకో ఏమో గారూ, మరియు ఇతర బ్లాగ్ మిత్రులు అందరూ చూపించే ప్రోత్సాహానికి, సహకారానికి సహృదయతకు చాలా కృతఙ్ఞతలు. చాలా మంది మిత్రులు ఈ ఉద్యమంలో పాలుపంచుకోవటానికి ముందుకొస్తున్నారు. ఇంతమంది మిత్రుల సహకారం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భగవంతుడి దయతో నేను మొదలుపెట్టదలచుకున్నఈ ప్రయత్నంలో మీ సహకారం ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  18. Asusual maatalu levu akkaa!!!
    Aavedana ki akshara rupam ivvadam lo meeku meeresaati .

    ReplyDelete
  19. తమ్ముడూ , ప్రశంసకు ధన్యవాదాలు ,పెరిగిపోతున్న ఇలాంటి సమస్యలు ,అరాచికాలూ అరికట్టాలంటే మీ లాంటి చదువుకున్న ,సంస్కారవంతులైన యువత నడుం కట్టాలి . మీ వంతు కర్తవ్యం మీరు నిర్వర్తించగలరని నా ఆశ , అదే తమ్ముడిగా ఈ అక్కకి మీరిచ్చే ఆడపడచు కానుక

    ReplyDelete
    Replies
    1. Thappakunda akka!!
      Nenu cheyagaliginantha chestoo vunnaanu.
      Thank you

      Delete
  20. dheena deepakalaki,
    daridra narayanulaki,
    dari choope varevarandi,
    dayatho akkuna
    cherchukune varevarandi.

    ReplyDelete
  21. the tree gaaru, మీరు , నేను , మనుషులమైన మనందరమూ ప్రయత్నిద్దాం , మనకు చేతనైన సహాయం అందిద్దాం , ముందు తరాలకు మన కలం తో ఈ దీన స్థితి వివరిద్దాం.

    ReplyDelete
  22. ఫాతిమా గారూ మీ కవితలు కదిలించేలా ఉన్నాయి...చెయ్యగలిగే సాయమేమిటో చెప్పండి...
    ఆవేశం ఆలోచన స్థాయి నుండి ముందుకు వెళ్ళలేదు..కలంతో చదివేవాళ్ళను కదిలించగలం.. శాసనాలు చేస్తున్న వాళ్ళను కాదుగా..
    నేటి యువతను తప్పుదోవ పట్టిస్తున్న సినిమాలు, సరదాలను ఆపగలమా..ఇలాంటి విషయాల పట్ల వారికి అవగాహన కలిగించగలమా...విలువలు వలువలు విడిచిన సమాజంలో ఉన్నాం...కర్తవ్యమే బోధపడడం లేదు.

    ReplyDelete
  23. jyothirmayi garoo,ఎంత అర్ధవంతమైన వ్యాఖ్య మీది, నిజమే ఆవేశం ఆచరణ రూపం దాల్చాలి .అదే నా మనస్సులో ఉన్న అసంపూర్ణ ప్రయోగం దానికి అవసరమైన పధకం తయారు చేసుకుంటున్నా అడ్డంకులను ఎదుర్కొనే మనోబలం మీ వంటి మిత్రులు ఇస్తారు . జ్యోతి గారూ నా జీవిత ఆశయం ఆనాద పిల్లలను నేను ఆదుకోగలగాలి , ఇలా ఎన్నో గళాలు గొంతు విప్పితే భదిర పాలకులకు వినిపిస్తుంది .

    ReplyDelete
  24. ఈ వెన్నెల కూనలను, ఈ కాళ రాత్రి కరకు సాక్ష్యాలను ఎలా న్యాయ దేవత కు నివేదించ గలను
    ఓహ్..అద్భుతంగా వుంది ఫాతిమాజీ...హృదయపూర్వక అభినందనలు..

    ReplyDelete
  25. వర్మ గారూ , కవిత నచ్చినందుకు ధన్యవాదాలు ,

    ReplyDelete
  26. వర్మ గారూ , మీ పరిశీలనకు ప్రశంసకు ధన్యవాదాలు

    ReplyDelete
  27. కూడు చాలని కూనలు
    బట్టలెరుగని పేదలు
    భవితా తెలియని బాలలు
    అయిన వారు భావి భారత పౌరులు ఎక్కడో చదివినట్టు గుర్తు
    ఇది చదివి అది గుర్తొచ్చింది.....

    ReplyDelete
  28. అఫ్రోజ్ గారూ, నా blog ఫాలో అయిన మీకు నా ధన్యవాదాలు. కవిత నచ్చినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete