Pages

Wednesday 8 August 2012

తోడు


తోడు

మాసిపోయిన  పసితనం ,మరచిపోయిన  హసితం.
రుతువులు మారుతున్న వేళ, మనసున  నాటుకున్న ముళ్ళు.

వదిలించుకున్న సన్నిహితులూ, మన్నించలేని సన్నివేశాలు.
నిస్సారమైన వాస్తవాలు,   నిలువ నీయని  గతాలూ,

నాకు తోడు నిలిచిన  నీవు  ఎవరని చెప్పనూ .......  


చందమామ  చలువ  కన్నులనుండి జారిన  వెన్నెల  తునకవు 
దిక్కుతోచని   నా జీవన నావకు   దారి చూపిన  చుక్కానివి.

ప్రేమకై   తపించిన వేళ   తడబడే  అడుగులకు    గమ్యానివి.
పసిడి ధారలా   ధాత్రిని  తాకిన    వర్షపు  సోయగానివి.

ఎదురు  చూడని ఆమనివి,   ఎద నిండిన పూవనివి. 
కదలి  వచ్చిన  దైవానివి , కాంతులీను కిరణానివి.
భవిత బాటలో   వెలుగు నింపిన  భానుడివి.

హృదయ  ఘోషని   మధురబాష  చేసిన  మహాత్మునివి.
మండుతున్న మదిలోన వాత్సల్యం   నింపిన అమృత మూర్తివి

గగనసీమ  నుండి  దిగివచ్చిన  గంధర్వుడివి.
సేదతీర్చి  చెంత చేరిన    వలపు  చెలికాడివి.

విరుల  వీవనతో  విసిరి   అలక తీర్చిన   జతగాడివి.
తోడుగా నిలిచి  చిటికిన వేలు అందుకున్న  సహచరుడివి.

జీవన దారిలో వెన్నెల పుప్పిడి అద్దిన శశాంకుడివి.
ఏడడుగులు నడచి  ఎల్ల కాలం  నాతో ఉంటానన్న  పతిదేవుడివి .

నీవే   నా సాహసానివీ ......   నీవే    నా సైన్యానివీ.
నీవే   నా   గతివీ.............    నీవే  నా   పతివీ. 

( నా జీవితపుస్తకానికి   ముఖచిత్రమైన   మా  శ్రీ వారికి   పై కవితను  సమర్పించుకుంటున్నాను ) 




  

32 comments:

  1. wonderful ..meraj..

    నీవే నా సాహసానివీ ...... నీవే నా సైన్యానివీ.

    Great words!! I like very much in this words!

    Wish you all the best every where every time.

    ReplyDelete
    Replies
    1. వనజా డియర్, ఇప్పటికి ఓ మంచి స్నేహితురాలిగా స్పందించారు అలా సంబోదించి.
      నా కవితలు చదివి నేను ఇంకా బాగా రాయగలిగే ప్రోత్సాహాన్ని ఇచ్చే మీకు సదా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.

      Delete
  2. superb! nice! Thanx, for a such a pleasant
    poetry!

    ReplyDelete
    Replies
    1. మనువు అయిన ఇన్నాళ్ళకు గుర్తు తెచ్చుకుని
      గంధర్వులతో పోల్చి మరీ పొగిడారు మీ పతి దేవుడిని
      ఏ మను కుని రాసారో ఏమి తిని రాసారో కాని మధురాతి
      మధురంగా సాగింది మీ కవితా ఝరి.
      కలకాలం సౌభాగ్యవతిగా మనాలని కోరుకుంటూ మీకు
      మీ శ్రీవారికి శుభాకాంక్షలు అందిస్తున్నాను.
      పి.ఎస్ : నిన్న యెక్కువ సమయంలేక ఇంగ్లీషులో
      స్వల్పంగా కంపించాము. ఇప్పుడు తెలుగులో సంపూర్ణంగా
      స్పందించాము!! గమనించమని మనవి!!

      Delete
    2. సర్, నా ప్రతి కవిత చదివే మీకు నా వందనాలు.
      నన్ను కలకాలం సౌభాగ్యవతి గా ఉండమని దీవించారు అదే పదివేలు , అంతకంటే ఏమి కోరుకుంటుంది ఏ స్త్రీ అయినా.
      ఇకపోతే మా శ్రీ వారు గంధర్వులే (హ ..హ.:-)) మంచి మనస్సుతో స్పందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

      Delete
    3. sir meeku krisnaastami shubhaakaankshalu.

      Delete
  3. eduru choodani aamanivi edanindina poovanivi' meekavita chaalaa
    baagundammaa!

    ReplyDelete
    Replies
    1. మేడంగారూ, నా బ్లాగ్ దర్శించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
      కవిత నచ్చినందుకు సంతోషం. మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని ఆసిస్తూ..
      మెరాజ్.

      Delete
  4. Last lines are highlight madam.:-)

    ReplyDelete
    Replies
    1. పద్మగారూ, మీ ప్రశంస ఊపిరిపోస్తుంది నా కవితకు.
      మీలా అందమైన బొమ్మలువేసి కవితకు అందం తీసుకురాలేను కదా అందుకే అందాన్ని అక్షరాలకు అద్దుతున్నా.
      ధన్యవాదాలు కవిత చదివిన మీకు.

      Delete
  5. నీవే నాఊపిరివీ....బాగుంది

    ReplyDelete
    Replies
    1. సర్, మీ ప్రశంస కు ధన్యవాదాలు.
      మీరు నా ప్రతి కవిత చదివి వ్యాఖ్య పెట్టటం నా అదృష్టంగా బావిస్తాను.

      Delete
  6. "నీవే నా సాహసానివీ...నీవే నా సైన్యానివీ
    నీవే నా గతివీ ..నీవే నా పతివీ."
    మీ వారికి అంకితమిచ్చిన కవిత చాలా బాగుంది ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
      నా కవితలు క్రమం తప్పకుండా చదివే మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

      Delete
  7. ఫాతిమా గారూ!
    కరకు కత్తుల లాంటి పదాలు వ్రాసే మీరు
    వెన్నెల సుమాల వంటి పదాలను కూడా అంత సులువుగా వ్రాసేస్తారు.
    అదే కలంతో హాస్యం పండిస్తారు....
    లావా చిమ్మిన చోటే విరిజల్లులు కురిపిస్తారు...
    multiple talent...

    "విరుల వీవనతో విసిరి అలక తీర్చిన జతగాడివి.
    జీవన దారిలో వెన్నెల పుప్పొడివి అద్దిన శశాంకుడివి.
    ఎదురు చూడని ఆమనివి, ఎద నిండిన పూవనివి. "
    ఎంత చక్కని భావాలో....(భావుకులకు...నాకెందుకు తోచలేదా?అనిపించే పదాలు..)

    కవిత సమర్పించిన మీకు,
    మీ సాహిత్యాభిలాషను ప్రోత్సహిస్తూ...
    మీ 'కవితాసుమాంజలి' అందుకున్న మీ శ్రీవారికి
    అభినందనలు....
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ, మీ ప్రశంసకు శతకోటి వందనాలు.
      నా కవితలకు ఎప్పటికప్పుడు మెరుగులు పెట్టుకొనే శేక్తి మీ ప్రశంసలవలనే వస్తుంది.
      నిజమే నా సాహిత్యాబిలాషను ప్రోత్సహించటమే కాదు తప్పొప్పులను సరిదిద్దే గురువు కూడా వారే.
      సర్ కవిత చదివిన మీకు నా కృతజ్ఞతలు.

      Delete
  8. "ప్రేమకై తపించిన వేళ తడబడే అడుగులకు గమ్యానివి".

    నిజంగా జీవిత సహచరుడు అంటే ఇలాగే వుండాలి అన్నట్లుగా వుందండీ మీ కవిత..
    మా లాంటి కవితలు రాని వాళ్ళందరూ మీ కవితను కాపీ కోట్టేసి
    శ్రీవారికి కానుకగా ఇవ్వొచ్చనుకుంటాను.. :)

    ReplyDelete
  9. రాజీ గారూ, ఎంత మాట కవితలు రావా మీకు?
    మరి అంత అందమైన రస హ్రిదయం, సంగీతాన్ని ఆస్వాదించే సున్నిత హృదయం మా రాజీ గారి సొత్తు కదా,
    మరి అది చాలదా శ్రీవారికి కానుక ఇవ్వటానికి.
    కవిత చదివిన మీకు ధన్యవాదాలు..మీ మెరాజ్

    ReplyDelete
  10. ఫాతిమా గారు.... మీ శ్రీవారు అంటే ఎంత ప్రేమో ఇది చదివితే తెలిసిపోతోంది....
    సూపర్.....

    ReplyDelete
    Replies
    1. సాయిగారూ, కవిత చదివిన మీకు ధన్యవాదాలు.
      మీకు తెలియాలంటే మీకు శ్రీమతి గారు రావాలి కదా.:-)
      మీ స్పందనకు మరో మారు థాంక్స్.

      Delete
  11. చక్కని కవిత, ముచ్చటగా రాశారు, అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
      నా ప్రతి కవితా చదివే మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

      Delete
  12. అయ్యబాబోయ్.....ఎంత బాగా రాసారండీ...ప్రేమ ఎంత బాగా కనపడిందో .....:-)
    అమోఘ:

    ReplyDelete
    Replies
    1. సీత గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
      ప్రేమ కనిపించినందుకు మరో మారు థాంక్స్.

      Delete
  13. ఏదో ఒక line చాలా బాగుందని వ్రాద్దామనుకున్నాను.అన్నీ చాలా చాలా బాగున్నాయి.ముఖ్యంగా మంచి పదాలతో కవితను పరిమళభరితం చేసారు.

    ReplyDelete
    Replies
    1. శేకర్ గారూ, నా కవితలో అన్ని పదాలూ నచ్చాయి అన్నారు సంతోషం.
      సర్, నా ప్రతి కవితా చదివి నన్ను ప్రోత్సహించే మీకు నా ధన్యవాదాలు.

      Delete
  14. Inthaki mee sree veaaru ee kavithena??

    ReplyDelete
  15. srivasta gaaroo kavitha chadivinanduku thanks :-))

    ReplyDelete
  16. బావ గారిని చాలా పొగిడేశారు, :))
    అంత మంచి ముఖ చిత్రం వున్న మీ జీవితపుస్తకం లో ఈ పేజీ చాలా చాలా బాగుంది అక్కా!
    మీరు అదృష్టవంతులు!
    ఇంత అద్భుతమైన కవితకు, కామెంట్ రాయడానికి నా పద సంపద సరిపోవట్లేదు.

    ReplyDelete
  17. తమ్ముడూ నేను నిజంగా అదృష్టవంతురాలినే,
    మీ అభిమానాన్ని మించిన పద సంపద ఎక్కడుంది.
    కవిత చదివిన మీకు థాంక్స్.

    ReplyDelete
  18. మేడం ( నా జీవితపుస్తకానికి ముఖచిత్రమైన మా శ్రీ వారికి పై కవితను సమర్పించుకుంటున్నాను ) సర్ ఎంత అదృష్టవంతుడు

    ReplyDelete
  19. అక్షర గారూ, నా బ్లాగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు.
    కవిత చదివిన మీకు థాంక్స్.

    ReplyDelete