Pages

Friday, 12 October 2012

కంటి దోషమా?


కంటి దోషమా?

ప్రత్యూష  హిమబిందువుల   అందాలు  కనిపించవు  నాకు.
టీ  కొట్టుముందు బెంచీలు తుడిచే  చిరుగు చెడ్డీ బుడ్దోడే  కనిపిస్తాడు.

నిద్రలేస్తూనే    ఏ  ప్రభాతగీతాలూ   వినిపించవు  నాకు, 
ఆరేళ్ళ  చిన్నది  బంగాళామెట్లు  తుడిచే  చీపురు  చప్పుడే వినిపిస్తుంది.

యజమానివెంట  వాకింగ్ చేసే  బొచ్చుకుక్కల  విన్యాసాలు  కనిపించవు నాకు,
పాచిపోయిన అన్నం  కతికి   కక్కుకునే  బక్కకుక్కలే  కనిపిస్తాయి.

స్కూలు బస్సులో వెళ్ళే  పావురాళ్ళలా  ఉన్న పసి పిల్లలు కనిపించరు  నాకు
మెకానిక్ షెడ్డులో స్పానరుదెబ్బలు తినే మరకలంటిన  పసి మొఖాలు కనిపిస్తాయి.

భాగ్యవంతులిచ్చే  విందులో   పళ్ళూ , పలహారాలూ    కనిపించవు  నాకు,
ఎంగిలి  ఇస్తర్లలో కుక్కలతో కలబడి  కతికే   నిర్భాగ్యులే  కనిపిస్తారు.

కారులో తిరిగే కలవారి   ఆడబిడ్డల  సుకుమారం  కనిపించదు  నాకు,
సిమెంటులో  పనిచేసే  ఆడకూలీ అరిగిపోయిన కాళ్ళే కనిపిస్తాయి.

అట్టహాసంగా  సీమంతం  చేసుకొనే  సినీతారలు   కనిపించరు నాకు,
నెత్తిమీద  తట్టనెత్తుకొని  నిచ్చెనెక్కే   నిండు చూలాలే కనిస్పిస్తుంది.

బాబు సంపాదిస్తే  బలాదూర్ గా  తిరిగే  బడుద్దాయిల  డాబు కనిపించదు నాకు 
బతుకు  పుస్తకానికి  భవిత  అట్టలేసుకొనే మధ్యతరగతి  యువతే కనిపిస్తుంది.

వనోత్సవంలో  అరటిఆకులో తెల్లటి మల్లిపూలంటి   వరియన్నం   కనిపించదు  నాకు
పురుగుల మందు తాగిన రైతన్న నోటివెంట వచ్చే తెల్లటి  నురగే  కనిపిస్తుంది 

నా కంటిపాపల నిండా ఒలికిన జీవిత విషాదాలే,
నా చెవుల నిండా  తెగిన కంఠ మూగరోదనలే,

నాకీ ప్రపంచమంతా  వింతగా కనిపిస్తుంది,,అందమైన అద్దంలో వికృత రూపంలా..
  







                                                

39 comments:

  1. చాలా బాగా రాసారు

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ, థాంక్స్.

      Delete
  2. "అందమైన అద్దంలో వికృత రూపంలా"
    ప్రపంచంలోని మరో కోణాన్ని చక్కగా చెప్పారండీ..

    ReplyDelete
    Replies
    1. రాజీ గారూ, నా కవితని నా దృష్టితో చూసిన మీకు ధన్యవాదాలు.

      Delete
  3. నా కంటిపాపల నిండా ఒలికిన జీవిత విషాదాలే,
    నా చెవుల నిండా తెగిన కంఠ మూగరోదనలే,

    నాకీ ప్రపంచమంతా వింతగా కనిపిస్తుంది,,అందమైన అద్దంలో వికృత రూపంలా..
    మీ నిశిత సమాజ పరిశీలనకు అభినందనలు ఫాతిమాజీ...చాలా బాగా రాసారు...అందుకే కవి దృష్టి కోణం వేరంటారు...

    ReplyDelete
    Replies
    1. వర్మగారూ, ధన్యవాదాలు.
      కవి దృష్టి కోణం అర్ధం చేసుకొని విశ్లేషించి , కవిత మెచ్చిన మీకు కృతజ్ఞతలు.

      Delete
  4. నాకు మాత్రం కుడి కంటిలో పైలైన్, ఎడమకంటిలో క్రింది లైన్
    కనిపిస్తుందండి. నాకు రెండుకళ్ళకీ దోషమే:-)
    just kidding....చాలాబాగుంది

    ReplyDelete
    Replies
    1. ఇలా రెండుకళ్ళతో వేరు,వేరుగా చూడటం పద్మాక్షి కే సాద్యం:-) :-)
      కవిత చదివిన మీకు నా ధన్యవాదాలు పద్మగారు.

      Delete
  5. కవిత చదువుతుంటే పేద ప్రజలపట్ల మీకున్న ప్రేమ, అభిమానం ప్రతి పదంలో కనిపించింది.
    చాలా బాగా రాసారు ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారూ, మీ ప్రత్యేక మైన వ్యాఖ్య నన్ను ముందుకు నడిపిస్తుంది.
      ధన్యవాదాలు .

      Delete
  6. హృద్యంగా ఉంది. చాల బాగా వ్రాశారు.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, మెచ్చిన మీకు కృతజ్ఞతలు .

      Delete
  7. మేమందరం చూసే చూపు ఒకటి...
    మెరాజ్ గారు చూసే చూపు ఇంకొకటి...
    చాలా బాగా వ్రాసారు...ప్రతి వాక్యం మదిని హత్తుకునేలా ఉంది...
    ప్రతి భావం గుండెల్లో చొచ్చుకునేలా ఉంది...అభినందనలు...@శ్రీ

    ReplyDelete
    Replies

    1. శ్రీ గారూ, మీరూ సామాజిక సమస్యల మీద స్పందించ గలరని నిరూపించుకున్నారు మీ "పొరలు కరగవెందుకో" కవితలో.
      నా కవితలు మెచ్చే మీకు ధన్యవాదాలు.

      Delete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. స్పందించే హృదయం ఉంటే హృద్రోగమూ కాదు,
    దీనుల బాధలు చూసి కన్నీరొలికే కంటికి దోషమూ లేదు.
    అలా జరగనప్పుడే అవి దోషాలని మీ శైలిలో చక్కగా చెప్పారు.
    మీ కవితలు ఒక పుస్తకంగా వస్తే చదివి
    చాలా మంది ఆనందిస్తారు కదా!
    త్వరలో ఒక ప్రచురణ ఆశించవచ్చా మీ నుంచి?!

    ReplyDelete
    Replies
    1. సర్, అన్నిటికన్నా పెద్ద దోషం స్పందించటం అనిపిస్తుంది అప్పుడప్పుడూ కానీ ఏమిచేయలేము మనస్సు మన మాటవినదు.
      అందుకే ఈ అక్షర స్వాంతన. ఇకపోతే పుస్తకం వేయాలనేది ఆలోచనలోనే ఉంది ,ఆచరణ యోగ్యం ఉందోలేదో, ప్రయత్నిస్తున్నాను.
      మీ స్పందనకు ధన్యవాదాలు, మీ సహకారానికి కృతజ్ఞతలు.

      Delete
  10. దృష్టిది దోషం కాదండి....
    పేద-గొప్ప బేధానిది....

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారూ, మీ అభిమానానికీ,
      మీ పరిశీలన కి ధన్యవాదాలు.

      Delete
  11. moodu rojulai computer morayinchadam valana idi ippude choosenu. mee kanti choopu ala undadam vallane ilanti manchi kavithalu vasthunnayi. kanti dosham emi ledu. continue cheyandi.

    ReplyDelete
    Replies
    1. సర్, కవితను మెచ్చిన మీకు ధన్యవాదాలు.

      Delete
  12. బాగుంది.

    దోషం కంటిది కాదండి. హృదయానిది.

    ReplyDelete
    Replies
    1. నిజమే , ఈ దోషం హృదయానిదే చక్కగా చెప్పారు. ధన్యవాదాలు

      Delete
  13. సమాజాన్ని మీ కలం నిశితంగా పరికిస్తుందండి.మీ కవిత అభాగ్యుల గుండె ఘోషను వినిపిస్తుంది.చాలా బాగా వ్రాసారు.

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారు, నా భావాలను మెచ్చుకున్న మీ సహృదయతకు కృతజ్ఞతలు.

      Delete
  14. బతుకు పుస్తకానికి భవిత అట్టలేసుకొనే మధ్యతరగతి యువత ....
    మీ కవితల్లో ఇలాంటి అద్భుతమైన భావాలనేకం కనిపిస్తాయి.
    మన కంటికి మీరు రాసిన రెండూ నిత్యమూ కనిపిస్తూనే ఉన్నా...ఒక వైపు కనిపించేవి మాత్రమే మదిని తాకుతాయి. అది కంటి దోషం కాదేమో...కన్ను చూపిస్తుంది కానీ మదే అది తీసుకోదు...బహుశా అది...మది దోషం ఏమో!
    కవిత ఎప్పటిలానే చదివిన ప్రతి హృదయాన్నీ ఆలోచింపజేస్తుంది.
    అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. చిన్నిఆశ గారు , నిజమే కంటి చూపువేరు మది ఆలోచన వేరు,
      కవితా భావాన్ని మెచ్చిన మీకు ధన్యవాదాలు.

      Delete
  15. కంటి దోషమా? కాదు 'ముక్కంటి మంట' ,
    చదువు ప్రతి గుండె చీలి వెచ్చని రుధిరము
    చిమ్మి తనలోని కుళ్ళు నశించు కొంత ,
    కవి కలానికి పదు నెక్కు వవుట నిజము .
    -----సుజన-సృజన

    ReplyDelete
  16. సర్, మీ వ్యాఖ నా కవితకు స్పూర్తినిస్తుంది.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  17. ఇదొక అద్భుతమైన కవిత. కవి సునిశిత ద్రుష్టికీ, హృదయ సౌకుమార్యానికీ ఇదొక మచ్చుతునక. అభినందనలు.

    ReplyDelete
  18. ఖరీముల్లా గారికి, బ్లాగ్ కి స్వాగతం.
    కవితాభావం నచ్చిందుకు ధన్యవాదాలు.

    ReplyDelete