నేను నేనుగా మిగిలాను
ఎవరితోనూ పోలికలేని,
దేనిలోనూ పొంతనలేని నేను నేనుగా మిగిలిపోదాం అనుకున్నాను..
కానీ వెక్కిరించే బంధాలే ఎక్కువయ్యాయి.
విస్మరించాల్సిన సంఘటనలే దిక్కయ్యాయి.
బతుకు ఎంత బలీయమైందంటే నాచేతులతో
నా గొంతు నొక్కుకొనేలా చేస్తుంది.
జీవితం ఎంత చలాకైనదంటే..పదునైన ఆయుధంతో
నా గుండెను నేనే ముక్కలు చేసుకొనేలా చేస్తుంది.
విధి ఎంత విచిత్రమైనదంటే...వెతల రంగులద్ది,
నా ముఖాన్ని నేనే గుర్తుపట్టనట్లు చేస్తుంది.
నేను ఎంచుకొన్న బాట ఎంత చంచలమంటే
నడుస్తున్న నన్ను చాపలా చుట్టివేస్తుంది.
నేను గడిపే కాలం ఎంత కఠినమైనదంటే..
క్షణ,క్షణం కాలనాగై కాటువేయాలని చూస్తుంది
నేను ఎక్కిన భలిపీటం ఎంత దయలేనిదంటే..
కాలికింద ఆసరా ఇస్తూనే తల తలారికిచ్చింది.
నను తోలిచేసే జ్ఞాపకాలు ఎలాంటివంటే..
నాతోనే ఉంటూ అందని నీడలా దూరమౌతున్నాయి.
అందుకే నేను నేనుగా మిగిలిపోయాను.
ఫాతిమా గారు జనాల్ని మరీ భయపెట్టేస్తున్నారు .
ReplyDeleteసర్, నిజమా .. అయితే నవ్వించి మంచి చేసుకుంతాను..:-))
Deleteమీరు మీరుగా మిగలకండి ఫాతీమాజీ....సాగిపొండి అలా:-)
ReplyDeleteఅంతేనా .. అయితే మీ తోడు కావాలి మేడం:-))
Deleteవిధి ఎంత విచిత్రమైనదంటే...వెతల రంగులద్ది,
ReplyDeleteనా ముఖాన్ని నేనే గుర్తుపట్టనట్లు చేస్తుంది.
నేను ఎంచుకొన్న బాట ఎంత చంచలమంటే
నడుస్తున్న నన్ను చాపలా చుట్టివేస్తుంది.
నేను ఎక్కిన భలిపీటం ఎంత బలమైనదంటే,
కాలికింద గోతిని చూపించి తల తలారికిచ్చింది....
మనసును మంచు కత్తితో కోసాయండీ వాక్యాలు...యిలా నేనెప్పటికి రాయగలనో...అభినందనలతో...
వర్మగారూ, మీ స్పందన ఇంకా రాసేంత స్పూర్తినిస్తుంది.
Deleteధన్యవాదాలు.
మెరాజ్ గారూ!
ReplyDeleteమీరు వ్రాసే ఇలాంటివన్నీ చదివేస్త్తూ నేను కూడా ఇలా వ్రాసేద్దామని
ఎంత ప్రయత్నం చేసినా...వర్మ గారన్నట్లు...ఇలాంటి పదాలు రావెందుకో?
నేను గడిపే కాలం ఎంత కఠినమైనదంటే..
క్షణ,క్షణం కాలనాగై కాటువేయాలని చూస్తుంది...
చాలాబాగుంది (వ్యథాకథనం) కవిత....@శ్రీ
శ్రీ గారూ, నాకిలాంటి పదాలు రావెందుకో అన్నారు,
Deleteవర్మగారూ ఇదే మాట అన్నారు, మీరు రాసే అందమైన వెన్నెల కవితలూ ,
వర్మగారూ రాసే సమాజం లోని చెడుని సిరాతో కడిగే కవితలూ నేను రాయగలనా.. చాలు ఇలాంటి స్పందన.
ధన్యవాదాలు మీకు.
.
వ్యధతో భీతి చెందితే అది మనల్ని ఇంకా భయపెడుతుంది, రమ్మని ఆహ్వానిస్తే భయపడి తోకాడిస్తుంది.
ReplyDeleteప్రేరణ గారూ, మీరిచ్చే ప్రేరణ చాలు దైర్యం వస్తుంది.
Deleteఏదో కన్‌ఫ్యూజన్ కనిపిస్తోంది.
ReplyDeleteమీరు మీరుగా ఉంటే
బాగుందా,
మీరు మరోలా ఉంటే బాగుందా అనేది
నాకు
అర్థం కాలా!
కాని మీ కవితలు మాత్రం పదునుగా, సూటిగా ఎప్పటిలాగానే
ఉన్నాయి.
బక్రీద్ స్పెషల్ ఏమిటో చెప్తారా!
సర్, పెద్ద రచయితలు మీరు చెప్పాలి ఎలా ఉంటె బాగుంటుంది.
Deleteరాయమని చెప్పిందీ మీరే రాస్తే అర్ధం కావటం లేదు అంటున్నదీ మీరే.
మీ స్పందనకు ధన్యవాదాలు. సర్, మీ కన్ఫ్యూజన్ దూరం చేయటానికి కవితలో కొంత మార్పు చేసాను. ఎలా ఉందొ చెప్పండి.
కవిత బాగుంది అండి... చదివిన అంత సేపు అంత అర్ధం ఐంది కాని చివరకు ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కాలేదు...
ReplyDeleteప్రిన్సు గారు, మీరు చదివారు అది చాలు.
Deleteచాలా కాలానికి చూస్తున్నాను మీ కామెంట్. ధన్యవాదాలు
అమ్మయ్య, చివరకు మీరు మీరుగానే మిగిలారు, అదోక్కటి చాలండి ఆనందంగా బతకడానికి...
ReplyDeleteనేను ఎక్కిన బలిపీఠం ఎంత దయలేనిదంటే..
కాలికింద ఆసరా ఇస్తూనే తల తలారికిచ్చింది.
....లాంటి మంచి వాక్యలు అలవోకగా అల్లేసారు,
భాస్కర్ గారూ, ఇప్పటికి వచ్చారన్నమాట, చాలా సంతోషం.
Deleteకవిత బాగుంది ఫాతిమా గారు.
ReplyDeleteమీకూ, మీ కుటుంబ సభ్యులకు 'బక్రీద్' శుభాకాంక్షలు!
నాగేంద్ర గారు, మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteమీకు కూడా పండుగ శుభాకాంక్షలు.
నేను ఎక్కిన భలిపీటం ఎంత దయలేనిదంటే..
ReplyDeleteకాలికింద ఆసరా ఇస్తూనే తల తలారికిచ్చింది....
నను తోలిచేసే జ్ఞాపకాలు ఎలాంటివంటే..
నాతోనే ఉంటూ అందని నీడలా దూరమౌతున్నాయి.....
మీరు కవితల్లో పద విన్యాసం చేస్తూ భావాన్ని నడిపించే తీరు చాలా బాగుంటుంది.
చిన్ని ఆశ గారూ , మీకు నచ్చిందంటే సంతోషం.
ReplyDeleteనా శైలి నచ్చినందుకు కృతజ్ఞతలు
మీరు రాసిన ప్రతి వాక్యం ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒక్కసారైనా మనసుకు అనిపించేవే
ReplyDeleteకానీ మీరు వ్యక్తం చేసినట్లు ఎవరూ చేయలేరేమోనండీ..
చాలా బాగుంది..
రాజీ గారు, నా భావాలు ఎలా ఉన్నా మీ ప్రశంస చాలా ప్రేమగా ఉంటుంది.
ReplyDeleteఎదుటి వారిలోని ప్రత్యేకతని గుర్తించటం మీ ఉన్నతానికి నిదర్శనం.
మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.( రాజీ గారు మా పాప తయారు చేసిన చిన్ని మూవీ చూసి మీ అభిప్రాయం చెప్ప్పండి )