ఇలా చేయాలని ఉంది
మౌనాన్ని ఛేదించాలనీ,
మనస్సులో మగ్గుతున్నమాటల బంధనాలను,
తెంచుకోవాలనీ ...
ఏదో అడగాలనీ...
అది నీకే చెందినదై ఉండాలనీ...,
అది నీకే చెందినదై ఉండాలనీ...,
పలికే ప్రతి మాటా మృదువుగా ఉండాలనీ..,
నిన్ను నొప్పెంచనే రాదనీ...
నే విసిరిన మంచు ఈటెలు,
నిను ఎంత గాయపరిచాయో అడగాలనీ...
సతత హరితమైన నీ సహనాన్నీ,
కంచే లేని నీ మంచితనాన్ని,
స్తుతించాలనీ...
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నీ ఉన్నత గుణాన్ని,
అక్షరాలతో ఆలంకరించాలనీ..,
మర్మమెరుగని నీ మనస్సుకు,
వడిశిల తగిలినా చలించని నీ నిగ్రహానికి,
సాష్టాంగ పడి నమస్కరించాలనీ..,
సాష్టాంగ పడి నమస్కరించాలనీ..,
స్వయం ప్రకాశమైన నీ ముందు,
వెల వెల బోయే దివిటీనైనా.,
కావాలనీ..,
హిమాలయమంతటి నీ ముందు,
ఓ చిన్ని హిమబిందువునైనా,
కావాలనీ..,
అక్షర శ్రీగంధమైన నీ పక్కన,
అగరు ధూపమైనా కావాలనీ..,
నా అణువణువూ రెండు హస్తాలుగా చేసి,
నీకు.నమస్కరించాలనీ...
ఎంత బావుందో!
ReplyDeleteఆలస్యం చేయకుండా.. చెప్పేయి నేస్తం.!
రోజు పొగడ కూడదు. కానీ తప్పడం లేదు. :)
వనజా, చెప్పేస్తాను:-))
Deleteమీరు పొగడకపోతే ఇంకెవరు పొగుడుతారు చెప్పండీ..
అయినా రాయమని ప్రోత్సహించి ఇప్పుడు తప్పుకోవటం వీలుకాదు.
మీ కామెంట్ లేకపోతె నా కవితకి వన్నె రాదు.
ఫాతిమా గారు, మీ బ్లాగును నేను మిస్స్ అయ్యాను..ఈరోజు హారంలో పట్టుకున్నాను..బావుంది మీ కవిత:)
ReplyDeleteచిన్ని గారు , చాలా కాలానికి మీ వ్యాఖ్య చూసి సంతోషం అనిపించింది.
Deleteస్వయం ప్రకాశమైన నీ ముందు,
ReplyDeleteవెల వెల బోయే దివిటీనైనా.,
కావాలనీ..,
హిమాలయమంతటి నీ ముందు,
ఓ చిన్ని హిమబిందువునైనా,
కావాలనీ..,
అక్షర శ్రీగంధమైన నీ పక్కన,
అగరు ధూపమైనా కావాలనీ..,
నా అణువణువూ రెండు హస్తాలుగా చేసి,
నీకు.నమస్కరించాలనీ.........
ఎంత ఆరాధన మెరాజ్ గారూ!...
ఆ క్షమాయాచన కూడా ఎంత అందంగా ఉందో...
(పలికే ప్రతి మాటా మృదువుగా ఉండాలనీ..,
నిన్ను నొప్పెంచనే రాదనీ...
నే విసిరిన మంచు ఈటెలు,
నిను ఎంత గాయపరిచాయో అడగాలనీ...)
చాలా చాలా బాగుంది .అభినందనలు...@శ్రీ
శ్రీ గారూ,
Deleteక్షమించమని అడగటం ఓ గొప్ప సంస్కారం,
అది రాయాలనే ప్రయత్నమే ఈ కవిత.
నా పదాలను విశ్లేషించిన మీ వ్యాఖ నాకు స్పూర్తినిస్తుంది.
ధన్యవాదాలు.
ఆరాధనా భావాన్ని గొప్పగా కవిత్వీకరించారు ఫాతిమాజీ...
ReplyDeleteనమస్సుమాంజలులు...
వర్మ గారూ, నా కవితలోని ఆరాధనని,అపరాద భావాన్నీ గుర్తించి ప్రశంసించిన మీకు ధన్యవాదాలు.
Deleteమాటల్లో చెప్ప(గ)లేని చాలా గొప్ప భావన ఫాతిమ గారూ!
ReplyDeleteమీరు కవితతో అలంకరించారు, హృదయమంత స్వచ్చంగా!
చిన్ని ఆశ గారూ, ఇంత కంటే ఏమి కావాలి ఈ ప్రశంస చాలు.
Deleteహృదయమంత స్వచ్చంగా అన్నారు.అంటే స్వచ్చమైన అపరాద భావనే అక్కడ తెలపాలనుకున్నాను.
కృతజ్ఞతలు మీకు.
మీ కవిత బాగుందండి.
ReplyDeleteథాంక్స్, పద్మ గారు.
Deleteఆలోచించకుండా చేసేవే కదా/ చేసేయండి:-)
ReplyDeleteఅంతేనంటారా..? అయితే ఒకే.
Deleteతెలుగమ్మాయి చెప్తే చేయకపోవటమా..నెవ్వర్.:-))
Wow wow wow !!!
ReplyDeleteSuper Like :)
Thanks Harsha.
Deleteచాలా చాలా బాగుంది.అంటే సరిపోదేమో మరి?
ReplyDeleteసర్, ఇప్పటికి సరిపెట్టుకుంటాను.:-))
Deleteమీ స్పందనకు కృతజ్ఞతలు.
అద్భుతమైన కవిత.
ReplyDeleteచక్కటి భావవ్యక్తీకరణ మెరాజ్ గారు!
భారతి గారూ, భావాన్ని అర్ధం చేసుకున్న మీ భావుకతకు ధన్యవాదాలు .
Deleteకోరికలు తీరేనా?
ReplyDeleteసర్, వాటి తీరే అంత:-))))
Deleteచాలా బాగుంది Meraj gaaru :)
ReplyDeleteThank you Kaavya garu
Deleteమంచి ప్రయత్నం ,బాగా రాశారండి,
ReplyDeleteBhaskar garu thanks
Deleteస్వచ్చమైన భావం. మాటలు చెప్పలేని ఏదో తన్మయత్వం. అప్రయత్నంగా నమస్కారం. మీ సంస్కారం వెలకట్టలేని ఓ సాగరం. చాలా అద్భుతం.
ReplyDeleteరాజారావు గారూ,
Deleteవెలకట్టలేని సంస్కారాన్ని, మీ విలువైన వ్యాఖ్యతో కట్టేసారు.
నా కవిత నచ్చి, మెచ్చిన మీ ప్రసంషకు ధన్యవాదాలు.
ఎంత గాఢమైన భావన!
ReplyDeleteఎంత చిక్కనైన అల్లిక!
ఈ పదాల సుమహారం అందుకునే అదౄష్టం ఎవరిదో కదా!
ఎద నిండిన ప్రేమను పలికించడంలో మీ భాష, భావం అనితర సాధ్యం!
ఎవరికి వారే తమ ప్రియతములకు చెప్పుకోవడానికి మీ మాటలు అప్పుగా తీసుకుందామనుకుంటారు.
సందేహం లేదు!!
అద్భుతమైన కవిత.
మీరు ఇంకా ఇంకా రాయాలని , రాస్తూనే ఉండాలని
కోరుకుంటూ,
అభినందనలతో...
సర్,
Deleteప్రతి మనిషిలో అపరాద భావన కలుగుతుంది,
తానూ నొప్పించిన వారిని మెప్పించగలిగితే ఆ భావన నుండి బైట పడినట్లే.
నేనుకూడా చాలా సందర్భాలలో ఎందరినో నొప్పించాను
అప్పట్లో మన్నించమనే అడగటానికి అహం అడ్డువచ్చినా
ఆ తర్వాత ఇదిగోఇలాంటి భావాలు కవితారూపంలో వస్తాయి. నా కవిత నచ్చి నన్నింకా రాయమని ప్రోత్సహించే మీ సహృదయతకు నా కృతజ్ఞతలు.
మనసును హత్తుకున్న ప్రియనేస్తం పై ఉండే
ReplyDeleteప్రేమ, ఆత్మీయత,గౌరవం అన్నీ మీ కవితలో కనిపించాయండీ..
చాలా బాగుంది..
రాజీ గారూ,
Deleteనా భావానికి అద్దం మీ వ్యాఖ్యలే..
నా కవితల్లో ఏమున్నాయో చూసుకోవాలంటే మీ స్పందన చాలు.
మీ అభిమానానికి కేవలం థాంక్స్ సరిపోదేమో.
భావవ్యక్తీకరణ బాగుందండి.
ReplyDeleteసృజన గారూ,
Deleteమీ అభిమానమ్ కంటే విలువైనదా నా భావం.
ధన్యవాదాలు.
..................మాటలు రాక మౌనంగా వున్నా...అంత బాగుంది.
ReplyDeleteDevid garu thanks cheppatam chinna maata anukuntunnaanu.
Delete