Pages

Monday 29 October 2012

ఇలా చేయాలని ఉంది



ఇలా చేయాలని  ఉంది 

మౌనాన్ని  ఛేదించాలనీ,     
మనస్సులో మగ్గుతున్నమాటల బంధనాలను,
తెంచుకోవాలనీ ...

ఏదో అడగాలనీ...
అది  నీకే  చెందినదై  ఉండాలనీ...,

పలికే ప్రతి మాటా మృదువుగా ఉండాలనీ..,
నిన్ను నొప్పెంచనే రాదనీ...

నే  విసిరిన మంచు ఈటెలు, 
నిను ఎంత  గాయపరిచాయో అడగాలనీ...

సతత హరితమైన నీ సహనాన్నీ,
కంచే లేని నీ మంచితనాన్ని,
స్తుతించాలనీ...

ఎంత ఎదిగినా  ఒదిగి ఉండే నీ ఉన్నత  గుణాన్ని,
అక్షరాలతో ఆలంకరించాలనీ..,

మర్మమెరుగని  నీ మనస్సుకు,
వడిశిల తగిలినా చలించని  నీ నిగ్రహానికి,
సాష్టాంగ  పడి నమస్కరించాలనీ..,

స్వయం ప్రకాశమైన  నీ ముందు,
వెల వెల బోయే దివిటీనైనా.,
కావాలనీ..,

హిమాలయమంతటి  నీ ముందు,
ఓ చిన్ని  హిమబిందువునైనా,
కావాలనీ..,

అక్షర శ్రీగంధమైన  నీ పక్కన,
అగరు ధూపమైనా  కావాలనీ..,

నా అణువణువూ  రెండు హస్తాలుగా  చేసి, 
నీకు.నమస్కరించాలనీ...



36 comments:

  1. ఎంత బావుందో!

    ఆలస్యం చేయకుండా.. చెప్పేయి నేస్తం.!

    రోజు పొగడ కూడదు. కానీ తప్పడం లేదు. :)

    ReplyDelete
    Replies
    1. వనజా, చెప్పేస్తాను:-))
      మీరు పొగడకపోతే ఇంకెవరు పొగుడుతారు చెప్పండీ..
      అయినా రాయమని ప్రోత్సహించి ఇప్పుడు తప్పుకోవటం వీలుకాదు.
      మీ కామెంట్ లేకపోతె నా కవితకి వన్నె రాదు.

      Delete
  2. ఫాతిమా గారు, మీ బ్లాగును నేను మిస్స్ అయ్యాను..ఈరోజు హారంలో పట్టుకున్నాను..బావుంది మీ కవిత:)

    ReplyDelete
    Replies
    1. చిన్ని గారు , చాలా కాలానికి మీ వ్యాఖ్య చూసి సంతోషం అనిపించింది.

      Delete
  3. స్వయం ప్రకాశమైన నీ ముందు,
    వెల వెల బోయే దివిటీనైనా.,
    కావాలనీ..,
    హిమాలయమంతటి నీ ముందు,
    ఓ చిన్ని హిమబిందువునైనా,
    కావాలనీ..,
    అక్షర శ్రీగంధమైన నీ పక్కన,
    అగరు ధూపమైనా కావాలనీ..,
    నా అణువణువూ రెండు హస్తాలుగా చేసి,
    నీకు.నమస్కరించాలనీ.........

    ఎంత ఆరాధన మెరాజ్ గారూ!...

    ఆ క్షమాయాచన కూడా ఎంత అందంగా ఉందో...
    (పలికే ప్రతి మాటా మృదువుగా ఉండాలనీ..,
    నిన్ను నొప్పెంచనే రాదనీ...
    నే విసిరిన మంచు ఈటెలు,
    నిను ఎంత గాయపరిచాయో అడగాలనీ...)
    చాలా చాలా బాగుంది .అభినందనలు...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ,
      క్షమించమని అడగటం ఓ గొప్ప సంస్కారం,
      అది రాయాలనే ప్రయత్నమే ఈ కవిత.
      నా పదాలను విశ్లేషించిన మీ వ్యాఖ నాకు స్పూర్తినిస్తుంది.
      ధన్యవాదాలు.

      Delete
  4. ఆరాధనా భావాన్ని గొప్పగా కవిత్వీకరించారు ఫాతిమాజీ...
    నమస్సుమాంజలులు...

    ReplyDelete
    Replies
    1. వర్మ గారూ, నా కవితలోని ఆరాధనని,అపరాద భావాన్నీ గుర్తించి ప్రశంసించిన మీకు ధన్యవాదాలు.

      Delete
  5. మాటల్లో చెప్ప(గ)లేని చాలా గొప్ప భావన ఫాతిమ గారూ!
    మీరు కవితతో అలంకరించారు, హృదయమంత స్వచ్చంగా!

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారూ, ఇంత కంటే ఏమి కావాలి ఈ ప్రశంస చాలు.
      హృదయమంత స్వచ్చంగా అన్నారు.అంటే స్వచ్చమైన అపరాద భావనే అక్కడ తెలపాలనుకున్నాను.
      కృతజ్ఞతలు మీకు.

      Delete
  6. మీ కవిత బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్, పద్మ గారు.

      Delete
  7. ఆలోచించకుండా చేసేవే కదా/ చేసేయండి:-)

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా..? అయితే ఒకే.
      తెలుగమ్మాయి చెప్తే చేయకపోవటమా..నెవ్వర్.:-))

      Delete
  8. చాలా చాలా బాగుంది.అంటే సరిపోదేమో మరి?

    ReplyDelete
    Replies
    1. సర్, ఇప్పటికి సరిపెట్టుకుంటాను.:-))
      మీ స్పందనకు కృతజ్ఞతలు.

      Delete
  9. అద్భుతమైన కవిత.
    చక్కటి భావవ్యక్తీకరణ మెరాజ్ గారు!

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, భావాన్ని అర్ధం చేసుకున్న మీ భావుకతకు ధన్యవాదాలు .

      Delete
  10. కోరికలు తీరేనా?

    ReplyDelete
    Replies
    1. సర్, వాటి తీరే అంత:-))))

      Delete
  11. చాలా బాగుంది Meraj gaaru :)

    ReplyDelete
  12. మంచి ప్రయత్నం ,బాగా రాశారండి,

    ReplyDelete
  13. స్వచ్చమైన భావం. మాటలు చెప్పలేని ఏదో తన్మయత్వం. అప్రయత్నంగా నమస్కారం. మీ సంస్కారం వెలకట్టలేని ఓ సాగరం. చాలా అద్భుతం.

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారూ,
      వెలకట్టలేని సంస్కారాన్ని, మీ విలువైన వ్యాఖ్యతో కట్టేసారు.
      నా కవిత నచ్చి, మెచ్చిన మీ ప్రసంషకు ధన్యవాదాలు.

      Delete
  14. ఎంత గాఢమైన భావన!
    ఎంత చిక్కనైన అల్లిక!
    ఈ పదాల సుమహారం అందుకునే అదౄష్టం ఎవరిదో కదా!
    ఎద నిండిన ప్రేమను పలికించడంలో మీ భాష, భావం అనితర సాధ్యం!
    ఎవరికి వారే తమ ప్రియతములకు చెప్పుకోవడానికి మీ మాటలు అప్పుగా తీసుకుందామనుకుంటారు.
    సందేహం లేదు!!
    అద్భుతమైన కవిత.
    మీరు ఇంకా ఇంకా రాయాలని , రాస్తూనే ఉండాలని
    కోరుకుంటూ,
    అభినందనలతో...

    ReplyDelete
    Replies
    1. సర్,
      ప్రతి మనిషిలో అపరాద భావన కలుగుతుంది,
      తానూ నొప్పించిన వారిని మెప్పించగలిగితే ఆ భావన నుండి బైట పడినట్లే.
      నేనుకూడా చాలా సందర్భాలలో ఎందరినో నొప్పించాను
      అప్పట్లో మన్నించమనే అడగటానికి అహం అడ్డువచ్చినా
      ఆ తర్వాత ఇదిగోఇలాంటి భావాలు కవితారూపంలో వస్తాయి. నా కవిత నచ్చి నన్నింకా రాయమని ప్రోత్సహించే మీ సహృదయతకు నా కృతజ్ఞతలు.

      Delete
  15. మనసును హత్తుకున్న ప్రియనేస్తం పై ఉండే
    ప్రేమ, ఆత్మీయత,గౌరవం అన్నీ మీ కవితలో కనిపించాయండీ..
    చాలా బాగుంది..

    ReplyDelete
    Replies
    1. రాజీ గారూ,
      నా భావానికి అద్దం మీ వ్యాఖ్యలే..
      నా కవితల్లో ఏమున్నాయో చూసుకోవాలంటే మీ స్పందన చాలు.
      మీ అభిమానానికి కేవలం థాంక్స్ సరిపోదేమో.

      Delete
  16. భావవ్యక్తీకరణ బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. సృజన గారూ,
      మీ అభిమానమ్ కంటే విలువైనదా నా భావం.
      ధన్యవాదాలు.

      Delete
  17. ..................మాటలు రాక మౌనంగా వున్నా...అంత బాగుంది.

    ReplyDelete
    Replies
    1. Devid garu thanks cheppatam chinna maata anukuntunnaanu.

      Delete