ఇలా చేస్తాను
చాలా రాత్రి గడచి పోయింది
చాలా రాత్రి గడచి పోయింది
ఇక మీరు నిద్రపోండి.
నన్ను నా పని చేసుకోనివ్వండి.
నా కలలకి రెక్కలు కట్టాలి,
వాటికి వాస్తవాల ఈకలు కట్టాలి.
నా ఆశలకు ఊపిరి పోయాలి,
వాటిని ఊయలలూపాలి.
నా వారికోసం భాషించాలి,
అది ప్రియమైనదిగా ఉండాలి.
అక్క చెల్లెళ్ళ కోసం వలువలు నేయాలి,
అమ్మో! వెలుగొస్తే వారి దేహాలను
డేగకళ్ళు గుచ్చేస్తే...
గూడులేని నా ఆడపడచులు
ఆదమరచి నిద్రపోతున్నారు..
అమ్మో, నడిరేయి ఏ మానవ మృగమో..దాడి చేస్తే..
చిల్లు బంతి ఊది ఊది
బుగ్గలు బూరెలు కాగా..బుంగమూతితో
నిద్రపోయే నా చిట్టి తమ్ముడు బంతి కోసం కలవరిస్తే...
పంక్చరైన సైకిలు తొక్కి తొక్కి,
అది తనను మోయకున్నా..
తాను దాన్ని మోసే మా నాన్న నిద్ర చెడిపోతే..
జీవితాంతం చాకిరీతో సావాసం చేసే అమ్మ
ఉప్పూ, పప్పూ నిండుకున్నట్లు
నిదురలో ఉలిక్కిపడితే ..
ఇలలో వరించని వరుని కలలో కంటూ ,
కట్న కానుకలిచ్చుకోలేని ఇంట పుట్టిన
తనను తాను నిదించుకొనే అక్క కలత పడితే..
అందుకే నేను నిదురపోను ..
గుండెలో కుంపటి రాజేసుకొని,
కళ్ళలో ఆశల దివిటీ వెలిగించుకొని,
పహారా కాస్తుంటాను...నా వారి కోసం పహారా కాస్తూ ఉంటాను.
కవిత చాలా బాగుంది.
ReplyDeleteతేలికైన పదాలతో గాఢమైన భావాలను చెప్పారు.
నిద్ర లేక పోతేనేం,
చేయాల్సిన మంచి పనులు ఎన్నో చేస్తున్నారు.
గాడ్ బ్లెస్ యు.
సర్,
Deleteమీ స్పందనకు ధన్యవాదాలు..
కవిత మంచి భావాలను పలికిన్దన్నారు సంతోషం.
మీ బ్లెస్సింగ్స్ ఉంటె ఇంకా ఎన్నో మంచి పనులు చెయ్యొచ్చు.
మెరాజ్ .. ఈ కవిత చూస్తే.. "పిన్ని" విజయనిర్మల నటించిన చిత్రం లో నిదురంటూ లేదమ్మా స్త్రీ జన్మకి,ఎదనిండా..సొదలున్న ఈ జన్మకి అనే పాట గుర్తుకు వచ్చింది.
ReplyDeleteఆ పాట లభ్యం కాక నీకు వినిపించలేకపోతున్నాను.
వనజా,
Deleteపాట దొరికితే వినిపించు, లేదా నేను వెతుక్కుంటాను.
ఇంతకీ కవిత నచ్చిందో లేదో చెప్పలేదు, పోనీలే ఈ సారి వేదనతో విసిగించలేదు అనుకున్నారు కదా :-))
అది ఏ కవితైనా మీరు చూడాలి అది చాలు నాకు.
అమ్మో ఇన్ని మంచి మంచి పనులా:-)
ReplyDeleteపద్మ గారూ,
ReplyDeleteమీరు మంచిని రంగుల్లో చూపితే నేను అక్షరాలలో చూపిస్తున్నా
ధన్యవాదాలు మీ స్పందనకు.
vanaja garu chaalaa baavundandi mee kavitha
ReplyDeleteVeena garoo, idi naa prasamse anukonaa, thank you.
Deleteఎప్పటిలా.........
ReplyDeleteఈ కవిత కూడా చాలా బాగుందండీ.
బారతి గారూ,
Deleteధన్యవాదాలు.
శ్రీమతి ఫాతిమాగారికి, నమస్కారములు.
ReplyDeleteచీకటిలో సూదిలోకి దారాన్ని ఎక్కించినంత గొప్పగా వుందీ కవిత. అతిశయోక్తి ఏమాత్రం కాదు. నీరు పల్లమెరుగు, నిజం దేముడెరుగు అన్నట్లుగా, మీ మనసులోని నిజమైన భావాలు కవితారూపంలో పల్లానికి (మా వైపుకు) పారుతున్నాయేమో!!
మీ స్నేహశీలి,
మాధవరావు.
మాదవ రావు గారికి, నమస్కారం
Deleteమీ అభిమానం, ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపిస్తాయి.
ధన్యవాదాలు కవిత మెచ్చిన మీకు.
చాల బాగుంది అంది ఇందులో కొన్ని పదాలు నాకు తెలియవు...
ReplyDeleteభాషించాలి, వలువలు నేయాలి---వాటి అర్ధం ఏమిటి
ప్రిన్స్ గారూ,
Deleteకవిత నచ్చిన మీకు థాంక్స్
భాషించటం అంటే సంభాషణ (ఇక్కడ నా వారి కోసం ఏదైనా మంచి చెప్పాలి అనే అర్ధం )
వలువలు అంటే వస్త్రాలు.
మీ కవిత కొంచం భారం గా వున్నా బాగుంది .
ReplyDeleteMaalaa kumaar garu ధన్యవాదాలు మీ స్పందనకు.
Deleteమేరాజ్ గారూ!...
ReplyDeleteచాలా బాగా వ్రాసారు ఎప్పటిలాగే...
పదాల్లో కరకుదనం చూపిస్తూ సున్నితమైన భావాలను
చక్కగా కవిత్వీకరిస్తారు...
అభినందనలు మీకు @శ్రీ
శ్రీ గారూ, ఎప్పటిలాగే మీ ప్రశంస కొండంత దైర్యాన్నిస్తుంది.
Deleteధన్యవాదాలు మీకు.
ఇన్ని కష్టలా మధ్య నిబ్బరంగా నిలిచే ధైర్యం మాత్రమే మిగిల్చాడేమో..దేవుడు,..బాగుంది ఫాతిమా గారు.
ReplyDeleteబాస్కర్ గారూ, నిజమే దేవుని దయలేనిదే మనం ఏమీ చేయలేము.
Deleteఎలా స్పందించాలో తెలియటం లేదు. కానీ వాస్తవికతను కళ్ళకి కట్టారు.. బాగుంది అనడం తప్ప ఇంకేమి అనగలం.
ReplyDeleteసుభ గారూ, మీరు బాగుందీ అంటే చాలు.
Deleteఇంకా బాగా రాయటానికి ప్రయత్నిస్తాను.
చాలాచాలాచాలా... బాగుందండీ.
ReplyDeleteగోపాల కృష్ణ గారూ, మీకు చాలా,చాలా, చాలా , ధన్యవాదాలు.
Deleteమీరు ఒక్కసారి చెప్తే చాలు నేను వంద చాలా లు చెప్పెసుకుంటాను :-)))
ఎటునుండి చుట్టుముట్టే సమస్యలనైనా ఎదుర్కోవటానికి,
ReplyDeleteవాటి నుండి తనవాళ్ళను కాపాడటానికి నిదురమాని పహరా కాస్తున్న
ఆ వ్యక్తి ప్రయత్నం ఫలించాలని కోరుకుంటాను..
కవిత చాలా బాగుందండీ...
Raajee garu, ilaanti spoorthi unte ye panainaa saadyame.
ReplyDeletethank you my friend
మీ కవితల్లో సమాజాన్నీ, అందులోని జీవితాల్నీ చాలా ఖచ్చితంగా ఉన్నదున్నట్టు చూపిస్తున్నారు, ఫాతిమ గారూ! మీ ప్రతి కవితా ఓ మంచి ముత్యమే.
ReplyDeleteచిన్ని ఆశగారూ,
ReplyDeleteమీ ప్రసంశ ఓ ముత్యం నాకు, నా కవితల్లో నిజాయితీని గుర్తించిన మీ అబిమానానికి నా కృతజ్ఞతలు.
bavundandi
ReplyDeleteTanooj garu thank you
ReplyDeleteకనుల కరిగిన కన్నీటి చుక్క..
ReplyDeleteఏమని వ్యాఖ్యానించను..:((
Madam, mee comment choodaledu sorrry,
ReplyDeletemee prasamsaku thanks