Pages

Tuesday, 20 November 2012

ఓదార్పు






ఓదార్పు 

నా నుండి  నేను  నిష్క్రమించాటానికి ,
ఆత్మస్థైర్యం  కావాలి.


చీకటి వంటి నిను  సోధించటానికి,
కాంతి  తత్వం కావాలి.

బహిర్గత పలుకులు  పలకటానికి,
ధైర్యం కావాలి.

ఎడారివంటి  నిను  వదిలి పోవటానికి,
ఇసుకతత్వం  కావాలి.

మౌన దేహాన మార్పు  తేవటానికి 
మాటల ఊరట  కావాలి.

స్పందనలేని  కాలాన్ని కదల్చటానికి,
కాల్పనికత  కావాలి.

మదిలోని  అవ్యక్త  భావాలను అల్లటానికి,
అక్షర సాలీడు కావాలి. 

మనమధ్య  మానవీయ  వారధి కట్టటానికి,

విలువల  ఇటుకలు కావాలి.

గగనంతో  కరచాలనం  చేయటానికి,

మేఘాల  మెట్లేక్కాలి.

కొత్త చరిత్ర కి  నాంది పలకటానికి,

పాత  పునాది  పెకలించాలి.

నాలో నీ  జ్ఞాపకాలు  భస్మం కావటానికి,

గుండెలో చితాగ్ని మండాలి.

నా  క్షత  వేదనా హృదయాన్ని ఓదార్చటానికి,

అమ్మతనం కావాలి.

శాపగ్రస్త   నైన  నన్ను నేను  ఓదార్చు కోవటానికి,

కొన్ని కన్నీళ్లు కావాలి.


13 comments:

  1. చీకటి వంటి నిను సోధించటానికి,
    కాంతి తత్వం కావాలి.

    గగనంతో కరచాలనం చేయటానికి,
    మేఘాల మెట్లేక్కాలి...............

    శాపగ్రస్త నైన నన్ను నేను ఓదార్చు కోవటానికి,
    కొన్ని కన్నీళ్లు కావాలి....chaalaa baagundi meraj gaaroo!...sri

    ReplyDelete
    Replies
    1. శ్రీ, గారు, ధన్యవాదాలు.
      మీ బ్లాగ్ ఓపెన్ అయ్యే ప్రయత్నం చేసారా లేదా?

      Delete
  2. మనమధ్య మానవీయ వారధి కట్టటానికి...విలువల ఇటుకలు కావాలి.
    నాలో నీ జ్ఞాపకాలు భస్మం కావటానికి...గుండెలో చితాగ్ని మండాలి...........తేలికైన పదాలతో లోతైన భావాలు వ్యక్తికరించడం చాలా బాగుంది ఫాతిమ గారు.

    ReplyDelete
    Replies

    1. డేవిడ్ గారూ, బహుకాలదర్శనం,
      కవిత నచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు.

      Delete
  3. శాపగ్రస్త నైన నన్ను నేను ఓదార్చు కోవటానికి,
    కొన్ని కన్నీళ్లు కావాలి...
    మీ ప్రతి కవితలోనూ ఇలా మెరిసిపోయే మాణిక్యాలు కొన్నైనా ఉంటాయి. కన్నీళ్ళకి మించిన ఓదార్పులేదేమో ఈ లోకంలో!
    "కాల్పనికత" అన్న పదార్ధం వివరిస్తారా? అర్ధం అయ్యీ కానట్టుంది.

    ReplyDelete
    Replies
    1. చిన్నిఆశ గారు,
      నా కవితల్లో మంచి పదాలు ఉంటాయి అన్నారు ,
      చాలా సంతోషం అనిపించింది.ఇకపోతే "కాల్పనికత " అంటే "క్రియేటివిటీ"
      ఏదయినా కొత్తది సృష్టించటం, ఇక్కడ నేను వాడిన సందర్బం కాలం భారంగా సాగుతుంటే దాన్ని ఆదిగమించటానికి
      చేసే సందడి.

      Delete
  4. నిజమే....మనల్ని ఓదార్చేవి మన కన్నీళ్ళే... బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ,
      మనం ఒంటరి అనే భావన మరీ కృంగదీస్తుంది.
      ఇలాంటప్పుడు మనకు తోడు కన్నీళ్ళే.
      కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete
  5. ఓదార్పు కోసం కన్నీళ్ళు,
    వారధి కోసం విలువల ఇటుకలు,
    ఇంకా మనిషికి ఎన్నెన్ని కావాలో కదా!
    అన్నిటికీ మించి మంచి స్నేహం తోడుంటే
    జీవితం మధురం కదా!
    చక్కటి అనుభూతి ఉంది మీ కవితలో.

    ReplyDelete
  6. సర్, మీరు చెప్పే ఆ మంచి స్నేహం ఎక్కడుందో కనుక్కోవటం కష్టం. అస్సలు దొరకటమే కష్టం.
    మదురమైన జీవితానికి విలువలు పనికిరావటం లేదు, ఓ మనిషికి ఒంటరితనం శాపం అయితే ఓదార్పు కన్నీళ్ళే.
    మానవత, మమత, మంచి, ఇవ్వన్నీ మరుగున పడిపోయి మనిషి గోముఖవ్యాఘ్రం అయ్యాడు.
    కవిత మెచ్చిన మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  7. బాగుందండి మీ ఒంటరితనపు వెసులుబాటు.:-)

    ReplyDelete