Pages

Saturday, 24 November 2012

ఏమిచేప్పనే చెలీ....


ఏమిచేప్పనే చెలీ....

ఎమిచెప్పను ..ఎలాచెప్పనూ..

కలిచివేసే  కన్నీటి  కథచెప్పనా...
కరిగిపోయిన కలను గూర్చిచేప్పనా...

పారిపోయిన గతాన్ని గూర్చిచెప్పనా...
మారిపోయిన నేస్తాన్ని గూర్చి చెప్పనా...

కూలిపోయిన కలల సౌధంగూర్చిచెప్పనా..
వాడిపోయిన  పూల తీగ గూర్చి చెప్పనా..

ఎడతెగని శోకం వలదని చెప్పనా..
చంచల  ప్రేమ  నమ్మ వలదని చెప్పనా...

ఏమిచెప్పను  సఖీ.
నిన్నెలా ఉండమని చెప్పనూ....

ఉద్వేగాలు, ఉద్రేకాలూ వలదని చెప్పనా..
నిరసనలూ, నిష్టూరాలూ  వలదని చెప్పనా..

మందారంలా విరియమని చెప్పనా..
మల్లెలా మనసారా నవ్వమని చెప్పనా..

హరిణి లా పరుగిడమని చెప్పనా..
హంసలా నడయాడమని చెప్పనా...

కీరంలా పలకమని చెప్పనా...
మయూరంలా నర్తించమని చెప్పనా...

అమ్మలా ఆదరించనా ...
అక్కలా అక్కున చేర్చుకోనా..


ప్రియ సఖిలా ప్రేమించనా..
నెచ్చలిలా లాలించనా....

 ఏమిచేప్పనే చెలీ.... ఎమిచెప్పను ..ఎలాచెప్పనూ.  


18 comments:

  1. "తెలుసుకొనవే యువతీ అలా నడచుకునవే యువతీ" అంటూ..
    ప్రియ సఖిలా మీరెలా చెప్పినా బాగానే ఉంటుందండీ..

    ReplyDelete
    Replies
    1. రాజీ గారూ, మీ సంగీత హృదయం మరో మారు తెలిసింది.
      నిజమే నా కవిత అలాగే ఉంది కదా..:-))

      Delete
  2. "ప్రియసఖిలా ప్రేమించనా... నెచ్చెలిలా లాలించనా..." అంటూ చక్కగా చెప్పారు ఫాతిమా గారు!
    మీకు, మీ కుటుంబ సభ్యులకు 'మొహరం' పర్వదిన శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. నాగేందర్ గారూ,
      మీ స్పందనకు ధన్యవాదాలు. నా ప్రతి కవితా చదివే మీకు నా కృతజ్ఞతలు

      Delete
  3. పారిపోయిన గతాన్ని గూర్చిచెప్పనా...
    మారిపోయిన నేస్తాన్ని గూర్చి చెప్పనా...

    కూలిపోయిన కలల సౌధంగూర్చిచెప్పనా..
    వాడిపోయిన పూల తీగ గూర్చి చెప్పనా..

    ఎడతెగని శోకం వలదని చెప్పనా..
    చంచల ప్రేమ నమ్మ వలదని చెప్పనా...

    అంటూ బాగా చెప్పారు!

    ప్రేమ మాటల వలలో పడి అమాయక స్త్రీలు అంతులేని వేదన హృదయాలలో
    మోస్తున్నారు. మీరు వారిపై దృష్టి సారించి సుద్దులు చెప్పడం ముదావహం.
    అలాగే ఇంటర్‌నెట్ అనే పెద్ద మాయ వవలలో కూడా కొందరు చిన్నారులు
    చిక్కుకుంటున్నారు. వారి కోసం కూడా మీ కలాన్ని నడిపిస్తారా, ప్లీజ్!

    ReplyDelete
    Replies
    1. సర్, మీ స్పందనకు సంతోషం.
      ప్రేమ వలలో ఎందఱో అభాగినిలు అలమటిస్తున్నారు,ఇది చెప్పే ప్రయతమే ఈ కవిత,
      ఇకపోతే మీ సూచన మేరకు రాసేందుకు ప్రయత్నిస్తాను.

      Delete
  4. Replies
    1. అన్నీ పోగుట్టుకున్న నెచ్చెలి..కి తన చెలి చల్లని తోడూ ఉంది అని చెప్పు మెరాజ్ .
      ప్రేమ భాదని మిగిలిస్తే స్నేహం ఆ కన్నీటిని తన అమృత హస్తంతో తుడుస్తుంది.

      Delete
    2. వనజా,
      ప్రేమని ,అంతరంగిక విషయాలనూ చెప్పుకోగాలిగేది నేచ్చలికే తన బాధని తీర్చలేకున్నా వినగలదు కదా.
      చాలా మంది విషయంలో ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా స్నేహితులే ఆపగలిగేది....మీరన్నట్లు అమృత హస్తం అందించేది స్నేహితులు మాత్రమె.
      మీ స్పందన నాకు స్పూర్తిదాయకం..మెరాజ్

      Delete
  5. మనిషికి రెండు వైపులా చెప్పారీ కవితలో, కానీ మనసుకి రెండు వైపులా చెప్పగలమా?
    కవిత ఎప్పటిలానే బాగుంది.

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారూ, మనసుకు కూడా చెప్పుకోగాలగాలి,
      తోడులేని, ఎవరూ తోడురాని లోకం తయారయ్యింది.

      Delete
  6. ఇన్నిన్ని మాధుర్యాలను పంచుకునే మీకు ఆ నెచ్చెలి ఏమని బదులీయగలదు...
    చాలా బాగుంది ఫాతిమాజీ...

    ReplyDelete
    Replies
    1. నెచ్చలి వింటుంది కదా అదే చాలు.
      వర్మాజీ కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete
  7. చాలా బాగుంది మేరాజ్ గారూ!...ఇది మంచి హెచ్చరిక....@శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ, కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete