Pages

Friday 16 November 2012

ఎదురుచూపు




చల్లగాలి నీ ఆలోచనలనీ ..
పిల్లగాలి నీ ఆగమనాన్నీ .. 
గుర్తుతెస్తాయి.

రాత్రి నీ వలపునీ.. 
మైత్రి నీ తలపునీ..
మోసుకోస్తాయి.

మేఘాలు  నీ ఆకృతినీ..
రాగాలు నీ  ఆలాపననీ..
తలపిస్తాయి.

మౌనం నీ మోహాన్నీ ..
గానం నీ రాగాన్నీ..
వినిపిస్తాయి.

మనస్సు నీ మనుగడనీ ...
వయస్సు నీ ఒరవడినీ..
కూర్చి చూస్తాయి.

చిలిపితనం  నీ కోరికనీ..
కలికితనం నీ కౌగిలినీ..
కోరుకుంటాయి.

పిరికితనం నీ రాకనీ..
వంటరితనం నా రాతనీ..
పరిహసిస్తాయి.

22 comments:

  1. చిన్న చిన్న ప్రాస పదాలతో ఈ కవిత స్వీట్ గా ఉంది. ఎంచుకున్న బొమ్మా చాలా బాగుంది..

    ReplyDelete
  2. పదాల అల్లికతో అందమైన కవిత. బావుంది ఫాతిమా గారు.

    ReplyDelete
  3. కవిత,బొమ్మా చాలా బాగుంది..

    ReplyDelete
    Replies
    1. రాజీ గారూ. ధన్యవాదాలు.

      Delete
  4. చాలా బావుంది ఫాతిమా గారు, బ్లాగ్ కి పొయిటిక్ వ్యూ వచ్చినట్లుంది,.సెంటర్ కి సెట్ చేస్తే ఇంకా బావుటుందేమో...

    ReplyDelete
  5. మీ ఈ కవితలో మీ ఇదివరకటి కవితల కంటే కొత్తదనం కన్పిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. Raajaa rao sir, bahukaala dharshanam.. dhanyavaadaalu

      Delete
  6. మేఘాలు నీ ఆకృతినీ..
    రాగాలు నీ ఆలాపననీ..
    తలపిస్తాయి.

    మౌనం నీ మోహాన్నీ ..
    గానం నీ రాగాన్నీ..
    వినిపిస్తాయి....chalaa baagundi meraj gaaroo!...@sri

    ReplyDelete
  7. మీ 'ఎదురుచూపు 'హృద్యంగా ఉంది.
    ఎప్పటిలాగే చిన్నిచిన్ని పదాలతోనే ఒక చక్కటి చిత్రాన్ని
    రచించి కళ్ళముందు ఒక సున్నితమైన వేదననుభవించే
    ప్రేమికురాలిని సాక్ష్యాత్కరింపచేసారు.
    శుభాభినందనలు.

    ReplyDelete
  8. విరహ వేదన వినటానికి కొంచం రుచించదు.
    కానీ ఇష్టమైన మనిషికోసం ఎదురుచూడటం ఓ విదమైన తీయని బాద అంటారు.
    ఎప్పటికీ అర్ధం కానిది ఈ ఎదురుచూపులు కష్టమే అయినా ప్రతి ప్రేమికులకూ తప్పనివి ఇవి.
    సర్, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete