Pages

Thursday, 8 November 2012

దీపపు పురుగు.


సోగ కళ్ళ  బాష అందమైనది అనుకోకు,
ఆ భాషకు  తర్జుమా  వేరుగా ఉంటుంది.

మృదు మదుర  మాటలను  ఆర్తిగా ఎరుకోకు 
ఆ  మాటల వెనుక  వాడియైన గాలం ఉంటుంది.

లాంతరు  వెలుగును  హత్తుకోవాలి  అనుకోకు,
గాజు బుడ్డిపై  పేరుకొన్న వెలిగారమై పోతావు.

స్వార్ధం స్వాగతిస్తే  దాని వెంట పరుగులు తీయకు,
వ్యర్ధ జీవిగా   పదిమందిలో  ముద్ర పడుతావు.

ప్రతి నిమిషమూ మోహపు మంత్రాన్ని జపించకు, 
అబద్దపు ఆసనంపై  కూర్చోకు అవివేకిగా మిగిలిపోతావ్ 

మరుభూమిలో, మల్లెలు పూస్తాయి అనుకోకు,
కల్పనకూ, వాస్తవానికీ ముడిపెట్టకు సహజత్వం  కోల్పోతావ్.

గుండెను  అమ్ముకోకు, మనస్సును  మభ్య పెట్టకు,
సహచరి  సమక్షంలో   అపరాదివవుతావు.

ఆకర్షణకు, అందానికీ, అబద్దానికీ  అమ్ముడుపోకు  
అయిన వారిని కోల్పోయి ఆనాధవి  అవుతావు. 25 comments:

 1. కల్పనను నమ్మితే బ్రతుకు బండి దారి
  తప్పుతుందని బాగా హెచ్చరించారు యువతను,
  బాగుంది.
  కొత్తగా ఉంది!

  ReplyDelete
  Replies
  1. సర్, నిజమే కదా వాస్తవం చేదుగా ఉన్నా దాని విలువ దానిదే కదా..
   ఏమిటో ఈ మద్య మీవంటి పెద్ద కవులకు కూడా చెప్పేస్తున్నా:-))
   ఈ వారం నవ్య లో మీ సీరియల్ "నీ వెనుక నేను" చదివాను చాలా బాగుంది శైలి అద్భుతం.
   ధన్యవాదాలు సర్ మీ స్పందనకు.

   Delete
 2. ఎన్నెన్ని సలహాలో!!!
  సరళమైన భాషలో!!!

  ReplyDelete
  Replies
  1. పద్మ గారూ, సలహా సరళమే,
   ఆచరణే కష్టం. కవిత చదివిన మీకు నా కృతజ్ఞతలు

   Delete
 3. baagundi baagundi...
  ayinaa yevari gola vaaride kadaa...

  ReplyDelete
 4. చాలా బాగుంది :)  ReplyDelete
 5. meraj gaaroo!...paipai merugulaku mosapovaddantoo meerichchina kavitaa sandesam...chalaa baagundi...@sri

  ReplyDelete
  Replies
  1. Sree garu, kavitha nachhinanduku dhanyavaadaalu.

   Delete
 6. చాలా లోతైనది భావం. చదివేకొద్దీ ఏవో అర్ధాలు స్ఫురిస్తున్నాయి.

  ReplyDelete
  Replies
  1. జ్యోతి గారూ,
   మీరు చదివితే తప్పకుండా స్పురిస్తాయి ఎందుకంటే అంట లోతుగా భావాలను పరిశీలిస్తారు మీరు.
   ధన్యవాదాలు మీకు.

   Delete
 7. మరుభూమిలో, మల్లెలు పూస్తాయి అనుకోకు,
  కల్పనకూ, వాస్తవానికీ ముడిపెట్టకు సహజత్వం కోల్పోతావ్.

  నిజమా:)

  ReplyDelete
  Replies
  1. అవుననే అనుకొన్నా... అయినా పండితులు మీరు చెప్పాలి.
   సర్, కవిత చదివినందుకు కృతజ్ఞతలు

   Delete
 8. ఈ కవిత ఇంతకు ముందటి వాటిలా అలరించేటట్టు లేదు.ఎవరికైనా అన్నీ ఒకే స్థాయిలో వ్రాయడం సాద్యం కాదు మరి. మీరు మీ చిన్ని కవితల్లో అచ్చుతప్పులు లేకుండా చూసుకోండి. బాష,మదుర, ఎరుకోకు,అబద్దపు, అపరాది,అబద్దానికీ వంటివి పంటిక్రంద రాళ్ళలాతగుల్తున్నాయి.

  ReplyDelete
  Replies
  1. గోపాల కృష్ణ గారూ, మీ సలహా పాటించేందుకు ప్రతిసారీ ప్రయత్నిస్తూనే ఉన్నాను, హడావిడి తో రాసిన
   ఈ కవిత మీరన్నట్లు ఎక్కువ శ్రమపడి రాసినది కాదు.
   కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

   Delete
 9. "గుండెను అమ్ముకోకు, మనస్సును మభ్య పెట్టకు"
  మంచి ఆలోచించాల్సిన విషయాలు చెప్పారండీ..

  ReplyDelete
  Replies
  1. రాజీ గారూ, మీ ప్రశంసకు ధన్యవాదాలు.

   Delete
 10. మొట్ట మొదటిసారి మీ కవిత్వం నాకు నచ్చకపోవడం అన్నది జరిగింది.
  నొచ్చుకోకు నేస్తం!!
  భాష తో ప్రయోగం చేసినట్లు ఉంది. భావం హృదయాన్ని నాటు కోలేదు. సూక్తులు చెపుతున్నట్లు ఉంది.
  ఐ సే సారీ!!

  ReplyDelete
 11. వనజా, మీ వ్యాఖ్యని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నాను.
  ఈ కవితలో నేను చెప్పింది సూక్తులే, నిత్యం వ్యక్తుల జీవితంలో మననం చేసుకోవలసిన మాటలివి.
  కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

  ReplyDelete
 12. ప్రతి పంక్తీ ఆలోచింపజేసేదిగానే ఉంది. చివరి రెండు లైన్లూ మరింతగా...

  ReplyDelete
 13. Chinni aasa gaaroo mee prasamshaku kruthagnathaku.

  ReplyDelete
 14. "ఆకర్షణకు, అందానికీ, అబద్దానికీ అమ్ముడుబోకు
  అయిన వారిని కోల్పోయి అనాధవి అవుతావు"
  చాలా బాగా చెప్పారు పాతిమా గారు!

  ReplyDelete