వ్యధ
దిగులు మొగలి పొదలా గుచ్చుకుంటూ ఉంటుంది.
సమయాన్ని చావగొట్టి చెవులు మూస్తుంది.
చైతన్యాన్ని చెంత చేరనీయక తరిమేస్తుంది.
అంతరంగాన్ని అంధురాలిని చేస్తుంది.
వివేకానికి వినికిడి లేకుండా చేస్తుంది.
వర్తమానానికి అందత్వవం, భవిషత్తుకు వ్యంధత్వం ఇస్తుంది.
ఆచరణని పాతరవేసి ,వేదాంతాన్ని వేదికనెక్కిస్తుంది.
ఆకలికి చరమగీతం పాడి, వేదనతో యుగళగీతం పాడుతుంది.
సమూహంలో కలసిపోయామా..చంకనెక్కి కూర్చుంటుంది.
పోనీలే గుండెమూల పడిఉంటుంది అనుకోన్నామా...
అరబ్బీషేకు గుర్రంలా...డేరాలో మకాం వేస్తుంది.
సరే వెంటరానీ అనుకున్నామా.. దింపుడు కల్లాం వరకూ దిగబెడుతుంది.
ఫాతిమ గారు అప్పుడెప్పుడో దిగులు మీద ఒక కవిత ఇలా రాసా....
ReplyDeleteదిగులు,
దిగులు దిగులుగా
దిగులు
ఎందుకూ?
ఎందుకో చెప్పుందుకు వీలుంటే దిగులెందుకు?....
మి కవిత చదువుతుంటే అది గుర్తుకు వచ్చింది ఎంతైన మీ కలం నుంచి ఈ కవిత జాలువారింది గా ఎప్పటిలా అందంగా ఉంది.
డేవిడ్ గారూ, దిగులు చాలా బయంకరమైనది.
Deleteఅది తెలియజేయటమే ఈ ప్రయత్నం.
మీ కవిత చదివాక "దిగులు" అంటేనే భయం పట్టుకుందండోయ్...మరీ ఆఖరి లైన్లో అక్కడి దాకా దిగబెడుతుందీ అంటుంటేనూ...
ReplyDeleteబాగుంది. దేనిమీదైనా మీరలా కవిత్వం చెప్పేయగలరు.
చిన్ని ఆశ గారూ, మెచ్చుకున్నారో, నోచ్చుకున్నారో తెలీలేదు .
Deleteపోనీండి స్పందించారు అంటే చాలు.
"వర్తమానానికి అందత్వవం, భవిషత్తుకు వ్యంధత్వం ఇస్తుంది.
ReplyDeleteఆచరణని పాతరవేసి ,వేదాంతాన్ని వేదికనెక్కిస్తుంది."
భలే చెప్పారు! మీరన్నది నిజం! నిజం!!
సర్, మీకు నచ్చింది అన్నారు,సంతోషం
ReplyDeleteవ్యధ ఎంత భయంకరమైనదో అక్షరాలలో పలికిన్చగలిగాను.
నా కవితలు, వేదననూ వ్యదనూ పలుకుతున్నాయని బయపడుతున్నారు, ఏమిచేద్దాం కొత్త భావాలకోసం అక్షర కూర్పు మొదలెడతాను.
చాలా బాగా వ్రాసారు....మేరాజ్ గారూ!...
ReplyDeleteకాకుంటే ఈ కవిత చాలా సంక్షిప్తంగా ఉంది....
అక్షరాల్లో భావాలు మాత్రం సంక్షిప్తంగా లేవు....@శ్రీ...
శ్రీ గారూ,కవితా భావాలు మెచిన మీకు ధన్యవాదాలు.
ReplyDeleteవర్తమానానికి అందత్వవం, భవిషత్తుకు వ్యంధత్వం ఇస్తుంది.
ReplyDeleteబాగున్నాయి ఈ వాక్యాలు