Pages

Monday, 26 November 2012

నా కనకానివి



నా   కనకానివి


కళ్ళు తెరవకముందే  నా వడి చేరావు.
అమ్మ నుండి విడదీసానని  అల్లరి చేసావు.

బుడి,బుడి అడుగులతో బుడతలా తిరిగావు.
చిట్టి,చిట్టి అరుపులతో చిడతలు వేసావు.

విడిచిన  బట్టల్లో ఇష్టంగా దోర్లేవు.
విడిచిన చెప్పుల్ని ఇష్టంగా కోరికేవు.

పాలబువ్వంటే పసందుగా తింటావు.
కారు టైరు  కనిపిస్తే ఇష్టంగా తడిపేవు.

దూషించానో..దూరంగా పోతావు.
శాసించానా  గారంగా వస్తావు.

మాటలు రావు కానీ మారాం తెలుసు,
భాష తెలీదు కానీ భావం తెలుసు.

ఒరే కన్నా నేను   శిక్షణ ఇస్తే
నీవు నాకు   రక్షణ ఇస్తావు.

నేను నీకు నివాసం చూపాను,
నీవు నాకు విశ్వాసం చూపావు.

నువ్వు మాలిమైన శునకానివే  కాదు,
నువ్వు  మేలిమైన కనకానివి కూడా..










22 comments:

  1. హ హా హా...
    కాదేదీ కవితకనర్హం....భలే బాగుందండీ మీ కుక్కపైన మీ కవిత్వం.

    ReplyDelete
    Replies
    1. అస్సలు అర్హత ఆ బుజ్జిముండ విస్వాశానికే కదా..
      మనిషి కంటే ఎన్నో రెట్లు నయం కుక్కలు. కాదంటారా చిన్ని ఆశగారూ

      Delete
  2. మీ పదాల గారడీలో కనకం విన్యాసాలు మహా ముద్దుగా వున్నాయి ఫాతిమాజీ.

    ReplyDelete
    Replies
    1. జ్యోతి గారూ , ధన్యవాదాలు.

      Delete
  3. మీ కనకం జాగ్రత్త ఫాతిమా గారు,..

    ReplyDelete
    Replies
    1. Ammo chaalaa viluvainadee,priyamainadee, thanks Bhaskarji

      Delete
  4. కవితా బాగుంది. అంతర్లీనంగా కన్పించే మీ మంచి మనస్సు (ప్రేమైక భావాలు) బాగుంది మెరాజ్ గారు.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, నా ప్రేమ తత్త్వం ఏమోగానీ , మీ మంచి హృదయం నాకు తెలుసు.
      ధన్యవాదాలు.

      Delete
  5. మీ కనకం బాగుంది, మా ఇంట కూడా ఉన్నది ఒక కనకపుకొండ...అదే నాకు కూడా అండ.

    ReplyDelete
    Replies
    1. Kanakapu kode undaa, ayite andamaina ee telugammaayiki kaapalaa anna maata :-))

      Delete
  6. నువ్వు మాలిమైన శునకానివే కాదు,
    నువ్వు మేలిమైన కనకానివి కూడా..:-)

    ReplyDelete
    Replies
    1. Varmaaji maa kukka peru Motu (fat gaa untundi) nijamgaa adi knakame.

      Delete
  7. Tammudoo.. yelaa unnaav. kavita chadivaaru kadaa thanks.

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. మీరు అంత ప్రేమగా దాని గురించి రాస్తే,
    మళ్ళీ వాటిని చూసినప్పుడు 'కుక్కలు ' అనాలంటే
    ఏదోలా ఉందండి.
    కవిత చాలా బాగుంది

    ReplyDelete
  10. Sir, kavitha nachhinaduku dhanyavaadaalu.

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. భలే ఉంది మేరాజ్ గారూ!...పెంపుడు జంతువుల పట్ల మీ ప్రేమ...@శ్రీ

    ReplyDelete