Pages

Friday, 9 November 2012

కోకిల


కోకిల 

కూతవేటు దూరానున్నా, 
కూయలేను.

అల్లంత దూరాన ఉన్నా,
అరవలేను.

పిసరంత దూరాన ఉన్నా 
పిలవలెను.

ప్రకృతిని చూసి 
పలకలేను.

ఊపిరి ఉన్నా,
ఉలకలేను.

దేవా...

మానవ  కోకిలల  గానానికి జోగుతున్నావా? 
మధుమాసపు  కోకిలనైన  నన్ను మరిచావా?
ఆమని  అందాల సృష్టి నీదే కదా..
కృత్రిమ  కుసుమాలనేల  ఇష్టపడుతున్నావు?

ప్రభూ ...

చిరుగాలి  సృష్టి కర్తవు, శుష్క జీవుల ప్రాణ దాతవు,
శీతల పవనాలు నీ కనుసైగతో వీస్తాయి కదా..
మరి ఎందుకు  కృత్రిమ శీతల భవనాలలో బందీవయ్యావు?

స్వామీ...

జాబిలి  తలను వంచి  అవనిపై  వెన్నెల కురిపించావు,
మరి  ఈ నియాన్ వెలుగుల నిర్భాగ్యం నీకెందుకు?

తండ్రీ ..

ప్రమిద వెలుగులో  దేదీప్యమానంగా ప్రజరిల్లెవాడివే,
మరి ఎందుకు ఈ విద్యుద్దీపాలలో  విహరిస్తున్నావు?

ఆమని ఆగమనం  నీ ఆజ్ఞే కదా..,
శ్రావ్యమైన  నా గొంతుక నీ బిక్ష కదా..,

కరుణామయా.. 

యేమని చెప్పను నా ఆవేదన, ఎవరికి చెప్పగలను  నా వేదన  ..
చెట్లకై  వెతికే మాకు  సెల్లు టవర్లూ,
చిగురుకై వెతికే మాకు టి.వీ టవర్లూ తగులుతున్నాయి.

కరంటు తీగలు మాగొంతు కోస్తున్నాయి.
నగరజీవితం నను తరిమికొడుతుంది,

ఎగిరి,ఎగిరి, నా చిన్ని రెక్కలు విరిగి పోతున్నాయి.
అనంతలోకాన నా ఆమని ఎక్కడుందో చెప్పవా? 

ప్రభూ .. నేనిపుడు  రాగ కోకిలను కాను మూగ కోకిలను.

30 comments:

 1. పాపం కోయిల వేదన బహుకరుణదాయకం.

  ReplyDelete
  Replies
  1. యోహాంత్ గారూ, మూగజీవుల వేదన వర్ణనాతీతం

   Delete
 2. ఫాతిమా గారు మొన్న హైదరాబాద్ వచ్చినపుడు , చిన్నమ్మాయి ఇంటి దగ్గర గోడమీద బియ్యపు గింజలు పోసింది, ఎందుకన్నా, పిచుకలు తింటాయంది, నిజం ఆ రోజు రయిలు లేక ఉండిపోయిన సందర్భంలో పిచుకలని చూశా. విధి చాలా చిత్రమైనది.

  ReplyDelete
  Replies
  1. సర్, మీరు పిచ్చుకను చూసి సంబరపడటం సంతోషం అనిపిచింది.
   నిజంగా ఎలాంటి స్థితికి చేరుకున్నాం మనం. కానీ మా ఇంటి దగ్గర చాలా పక్షులు ఉన్నాయి నేను రోజూ గింజలు వేస్తాను.
   మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 3. మూగబోయిన కోయిల గొంతు ఆర్తనాదంలా ఉందండి మీ కవిత!

  ReplyDelete
  Replies
  1. పద్మగారూ,
   నిజంగానే నా కవిత ఆర్తనాదమే.. చిన్ని పక్షులు కరంటు తీగలకు తగిలి చనిపోతుంటాయి
   మన నాగరికత వాటి జీవితాలకు ఉరితీత.
   మెచ్చిన మీకు ధన్యవాదాలు.

   Delete
 4. ఆమని ప్రకృతిలోనే కాదండి, జీవితాల నుండి కూడా దూరమైపోతోంది.

  ReplyDelete
  Replies
  1. జ్యోతి గారూ, చక్కగా చెప్పారు.
   ఆమని జీవితాల నుండే తొలిగిపోతుంది.

   Delete
 5. గానకోకిల గొంతు...
  కవితాకోకిల అక్షరాల్లో ప్రాణం పోసుకుంది...
  బాగా వ్రాసారు మేరాజ్ గారూ!...@శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారూ, గానకోకిల బాధని నా అక్షరాలూ పలికి ఉంటె నిజంగా ధన్యురాలినే.
   మీ స్పందనకు నా కృతజ్ఞతలు

   Delete
 6. అమ్మీ ఫాతిమా..
  ఇన్ని జెప్పినావు కానీ సెల్ ఫోనూ, కరెంటు, కాంక్రీటు యిల్లు, ఫర్నీచరూ వాడకుండా వున్నామా...
  తప్పదమ్మీ..
  సుకాలూ కావాలా సోకులూ కావాల మనికి...
  అవన్నీ అనుబవిస్తూ ఇలా రాసేత్తే ఆహా ఓహో అనౌకోవడమే తప్ప జరిగేదీ ఒరిగేదీ ఏమీ నేదు..
  మరోలా అనుకోమాకు...
  నామాటెప్పుడూ యిట్టాగే వుండాది మరి..

  ReplyDelete
  Replies
  1. ఓలమ్మో అడక్కుండానే చానా చెప్పీసినావు గానీ
   నేను కుసింత పాటిన్చినాకే చెప్పేస్తాను. నా ఇంట్లో మూగ జీవాలని చేరదీసి (కొన్నింటినే) చాన్నాలైనాది.
   ఎప్ప్పుడైనా తెలుసుకోనీ మాట్లాడు .సరేనా..ఏమి అనుకోకు నీనిలాగే చెప్తాను చెల్లీ.

   Delete
 7. ఈ మధ్య అంతా వేదనే కనిపిస్తుంది మీ కవితల్లో?

  ReplyDelete
  Replies
  1. Prerana gaaroo,
   edo oka vishayam meeda epppudoo allochistoo untaanu bahusaa aa prabhaavam kavitallo padutundavachhu. kavitha chadivina meeku thanks.

   Delete
 8. జాబిలి తలను వంచి అవనిపై వెన్నెల కురిపించావు,
  మరి ఈ నియాన్ వెలుగుల నిర్భాగ్యం నీకెందుకు?...ఇలా రాయగలగడమ్ మీకే చెల్లు ఫాతిమాజీ...కరుణరసాత్మకంగా...

  ReplyDelete
  Replies
  1. వర్మ గారూ,
   మీ ప్రశంస కు ధన్యవాదాలు. ఇలా మీరే రాయగలరు అనే ప్రశంసను సాటి కవి నుండి పొందటం నా అదృష్టం.
   జవాబు ఆలస్యమైనందుకు అన్యదా భావించరని ఆశిస్తున్నాను.

   Delete
 9. చాలా చక్కగా చెప్పారు! మనం చిన్నప్పుడు చూసిన "గిజిగాడ్లు" ఈ సెల్ టవర్ల పుణ్యమాని జాతికి జాతే అంతరించింది. వాటి స్మ్రుత్యర్థం ఒక కవిత రాయండి ఫాతిమా గారూ.ప్రక్రుతిని ప్రేమికులే నిజమైన దైవ భక్తులు. అందరి దేవుళ్లని ప్రార్థించిన మీ ఊహ ఆమోఘం.

  ReplyDelete
  Replies
  1. నరసింహ గారూ,
   తప్పకుండా, మీ సలహా మేరకు రాయటానికి ప్రయత్నిస్తాను.
   కవిత మెచ్చిన మీకు నా ధన్యవాదాలు.ప్రకృతి మీద మీకున్న అభిమానం గొప్పది.

   Delete
 10. గొంతెత్తి రాగం తీసే కోయిల మూగవోయి ఎలుగెత్తి చేసే వినబడని ఆర్తనాదం...
  మీ కవితలో హృద్యంగా వినిపించింది మెరాజ్ గారూ!
  మీ కలం నుంచి జాలువరింది మళ్ళీ ఆలోచింపజేసే అద్భుత కవిత.

  బొమ్మ లో కరెంట్ తీగల మధ్యా, ఫ్యాక్టరీ పొగగొట్టాలపై బిక్కు బిక్కుమంటున్న కోయిల గానం ఇక వినిపించేనా? అంధకారమైన ఈ లోకం కళ్ళుతెరిచేనా? తెరిచినా పాడేందుకు కోయిలలు మిగిలేనా?

  ReplyDelete
  Replies
  1. చిన్ని ఆశగారూ,
   మీ వేదన అర్ధం అవుతుంది.. ఓ చిత్రకారునిగా సున్నితమైన భావాలు, మూగజీవుల రోదన అర్ధం చేసుకోగలరు.
   కొన్ని పక్షుజాతులు అంతరించిపోతున్నాయి.నేను మిగతా పక్షులతోపాటు కోకిలకు కూడా గింజలు వేస్తాను కాని ఎందుకో తినవు..
   మీ ప్రసంశ నాకు సంతోషాన్నిచ్చింది.

   Delete
 11. అబ్బ ఎన్నళ్ళయింది కోకిలను చూసి. కళ్ళకు కనబడేలా చిత్రించారు మి కోకిలను.
  మీ ఇంటి దగ్గర నెమళ్ళు కూడా వస్తాయని ఇదివరకోసారి చెప్పారు.
  మీ అదృష్టం. నగరజీవనంలోనే ఉంటూ, ప్రశాంత ప్రకృతిని కూడా
  ఆస్వాదిస్తున్నారు.
  ఆ మధ్య డిల్లీలో రైల్వే ప్లాట్‌ఫారం పైన చూసాను పిచ్చుకులను.
  మన ఊళ్ళల్లో కనిపించడంలేదు పాపం.
  కవిత బాగుంది!
  దేవుడు జాబిలి తల వంచి అవనిపై వెన్నెల కురిపించాడు అన్నారు.
  కొత్త ఊహ. చాలా బాగుంది. కాని జాబిలి దేవుడిని చూసి తల వంచుకున్నాడేమో!?
  ఎలా అయినా ఇది ఒక మంచి ఊహ!
  మీకు ఎలా తడతాయి ఇంత మంచి ఊహలు!!
  అభినందనలు!

  ReplyDelete
  Replies
  1. సర్,
   కవితాభావాన్ని విశ్లేషించారు. ఇకపోతే మీకు ఎలా వస్తాయి కొత్త ఊహలు అన్నారు అందుకు మీకు నేను చెప్పేది ఒకే సమాదానం..
   మా ఇంటిచుట్టూ పక్షులే.. వాటిని చూస్తూ ఉంటె ప్రశాంతంగా ఉంటుంది. మీరన్నట్లు జాబిలే దేవుని ముందు తల వంచాడేమో.. పెద్ద కవులకి అలాంటి భావం వస్తుంది అనుకుంటా..:-))
   కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

   Delete
 12. Dhanyavaadaalu Srikanth reddy garu.

  ReplyDelete