మనసా కవ్వించకే.
గమ్యమెరుగని గాలిపటానివి
నిన్ను అందుకోలేను.
తప్పించుకు తిరిగే నీకోసం
తపించనూలేను.
ఆప్తులను అల్లుకొనే నీకోసం
ఆశల తీగను కాలేను.
చీకటి మాటున దాగే నీకోసం
కాన్తిరేఖను తేలేను.
నిదురను దొంగిలించిన నీకోసం
కలవరించలేను.
అక్షరాన్ని హత్య చేసిన నీకోసం
ఏదీ లిఖించను.
ఎప్పుడో చనిపోయిన నేను నీకోసం
తిరిగి శ్వాసించను.
మనసుతోనే మంతనాలా?
ReplyDeleteఆ కవ్వింపులను గెలవటం ఎవ్వరికైనా సాధ్యమా?
'కాన్తిరేఖ' ని 'కాంతిరేఖ' అని సవరించాలేమో...
కవ్వించే మనసుతో మనసంత సున్నితంగానే మాటలాడారు!
అమ్మో మనసా మజాకా....
Deleteచావకొట్టి చెవులు మూస్తుంది..:-))
మనసు కవిత బాగుందండి.
ReplyDeleteఅనికేత్ గారూ, మనసు కథ అంతే..
Deleteమెచ్చిన మీకు థాంక్స్.
బాధాతప్త హృదయం...ఎదురుతెన్నులు చూస్తున్న వైనం....
ReplyDeleteచాలా బాగా వ్రాసారు మేరాజ్ గారూ!...@శ్రీ
శ్రీ గారు. మీరు వేరేకోణం నుండి చూసారు. చక్కని విశ్లేషణ
Deleteధన్యవాదాలు.
"ప్రియమైన శత్రువు"ను అప్పుడప్పుడు అలా మందలించి,బెదిరించాలన్నమాట :)
ReplyDeleteచాలా బాగుందండీ..
రాజ్యలక్ష్మి గారూ,ఎంత బాగా చెప్పారు ప్రియమైన శత్రువే మనసంటే.
Deleteచదివిన మీకు కృతజ్ఞతలు.
కవ్వించకే అన్నా మనసు మాట వినదండి:-)
ReplyDeleteపద్మ గారూ, మన మొదటి శత్రువు మనసే,అందుకే మనసులేని మనుషులు సుఖంగా ఉంటారు.
Deleteనిదురను దొంగిలించిన నీకోసం
ReplyDeleteకలవరించలేను... చాలా బాగుంది...ఫాతిమాజీ..
వర్మాజీ ధన్యవాదాలు.
Deleteశ్వాసవైనా నీవే, ధ్యాసవైనా నీవే,
ReplyDeleteనీకోసం తలచి తలచి,
నిన్నే పిలిచి పిలిచి,
నీవే నేనైనానే నా మనసా,
అంటే అది మీ పాదాలు ముద్దాడి
పెంపుడు కుక్కపిల్లలా మీ చుట్టూనే తిరుగుతుంది.
కాని మీ కవిత సూటిగా సుత్తిలేకుండా ఉంది.
స్ప్రైట్ లా క్లియర్ గా
Thank you Deepak garu
ReplyDeleteమీ కవిత చాలా బాగుంది. కానీ నేను చెప్పాల్సినలాంటి భావాలనే మరొకరు చెప్పేసారు.
ReplyDeleteఏది ఏమైనా మీకు మళ్ళీ అభినందనలు.
Thank you sir.
Delete"నిదురను దొంగిలించిన నీకోసం
ReplyDeleteకవరించలేను" బహుశా "కలవరించలేను" అని రాద్దామనుకున్నారేమో కదా! అయినా నాకు చాలా నచ్చినవాక్యం అది.అవును మనం మనకొసం ఉండే ఏర్పాటులో ఇవేవీ చెయ్యలేం
Vasudev garu, kavitha nachhinanduku dhanyavaadaalu.
Delete