Pages

Saturday, 20 October 2012

వారఫలాలు
వారఫలాలు 

ఎప్పుడూ హోలీ పండక్కి వచ్చే అల్లుడు అమ్మాయి ఈసారి రామా రావు దంపతుల్ని హైదరాబాదు రమ్మని ఆహ్వానించారు. పెద్దగా ఇష్టం లేకున్నా వాళ్ళ మాట కాదనలేక కూతురింటికి వెళ్ళారు రామారావు దంపతులు.

పేపరు వస్తూనే ముందుగా వారఫలాలు చూసే అలవాటున్న రామారావు, వారఫలాల శీర్షికలో "ఆకస్మిక ధన ప్రాప్తి, కళ్ళు మూసుకుని ఆత్మీయుల కోసం వెచ్చిస్తారు" అని చూసి ఆనందపడ్డాడు. శుక్రవారం కావటం మూలాన అలవాటు ప్రకారం లలితమ్మ ప్రొద్దున్నే లేచి... స్నానం వగైరాలు కానిచ్చి, తాపీగా పేపరు చూస్తున్న రామారావును గుడికి బయలుదేరమని పురమాయించింది. రామారావు చిరాగ్గా "నీతో పెద్ద చిక్కొంచిందే, చెట్టు కనిపిస్తే మొక్కేస్తావు, కొట్టు కనిపిస్తే కొనేస్తావు, ఇక్కడ ఏ దేవుడో తెలీకుండా ఎలా వెళతాం ... అన్నారు రామారావు గారు. ఆ.. ఏ దేవుడైతేనేమిలెండి, బయల్దేరండి అంటూ బయల్దేరదీసింది భర్తను. చేతిలో కొబ్బరికాయ, హారతి పళ్ళెంతో రోడ్దేక్కారో లేదో, రోడ్డంతా రంగులు చల్లుకునే జనాలతో కోలాహలంగా ఉంది. ఎదురుగా ఓ ఇద్దరు కుర్రాళ్ళు మోటార్ సైకిలుపై వచ్చి రామారావుపై పిచికారితో రంగు చల్లి అదే స్పీడుతో వెళ్ళిపోయారు. ఆ రంగు కాస్తా కళ్ళల్లో పడటంతో రామా రావు కుయ్యో... మొర్రో అంటూ కూలబడి పోయాడు. లలితమ్మ వాళ్ళను శాపనార్థాలు పెడుతూ, ముదనష్టపు వెధవలు ఎంతపని చేసారు, ఇలా కూర్చోండి నీళ్ళు తెస్తాను అని పళ్ళెం రామారావు చేతిలో పెట్టి, చెట్టు కింద కూచోబెట్టి నీళ్ళ కోసం వెళ్ళింది. రామారావుకు ఏమీ కనపడ్డం లేదు. ఉస్సో .. బుస్సో.. అంటూ కళ్ళు మూస్తూ తెరుస్తూ అవస్థపడుతున్నాడు. కాసేపటికి పళ్ళెంలో టప టప ఎదో పడిన చప్పుడయ్యింది. ఆ తర్వాత పక్కన హి... హి ... హి ... అంటూ ఓ నవ్వు వినిపించింది, ఆ నవ్వుతోపాటు "కొత్తా" అని వినిపించింది రామారావుకు. ఊరికి కొత్తా అని అడుగుతున్నాడేమో అనుకుని, ఆ... అవును అన్నాడు. ఊరికే అలా కళ్ళు ఆర్పుతూ ఉండకు, జనాలకి అనుమానం వస్తుంది.. గట్టిగా అరవాలి... అలా కూర్చింటే ఎవరూ వేయరుమరి అన్నదా కంఠం.

ఒక్క ముక్క అర్థం కాలేదు రామారావుకు. ఈవిడింకా రాదేమిటీ అంటూ గట్టిగానే సణుక్కున్నాడు. అదివిన్న పక్కనున్న శాల్తీ .. ఈ పక్కనే ఎగ్జిబిషను ఉంది.. అక్కడ మరీ కాంపిటీషను అంది. భజన అయిపోయినట్లుంది అన్నదానం మొదలయ్యింది అంటూ వెళ్ళిపోయింది ఆ శాల్తీ. అర్థంగాక ఎదో అడిగేలోపు, జనాలుపరిగెత్తే చప్పుడు, ఆ తర్వాత రామారావును తోసుకుంటూ, తొక్కుకుంటూ మూకుమ్మడిగా జనాలు గుళ్లోకెళ్ళారు.

హడావిడిగా వచ్చ్హిన లలితకు నీరసంగా గుడిముందు కూలబడి ఉన్న భర్త కనిపించాడు. "ఏమండీ నీళ్ళు తెచ్చాను " అన్నది లలిత. "ఇంతసేపూ ఎక్కడి కేళ్ళావ్ " మండుతున్న కళ్ళను ఆర్పుతూ తెరుస్తూ చిరాకు పడ్డాడు రామారావ్.

"అయ్యో మరిచేపోయాను, మీకు నీళ్ళు తేవాలని వెళ్ళానా ఈ పక్కనే ఎగ్జిబిషన్ పెట్టారు, ఓ కొట్టులో చిన్ని రాగి చెంబు బుజ్జిముండ చాలా బాగుంది, వెధవది సమయానికి డబ్బులు తేలేదు, వదలబుధ్హి కావటం లేదు బుజ్జిముండ ఎంత బాగుందో.."ఏదైనా ఒకటి కొంటె ఒకటి ఫ్రీ.." సంబరంగా చెప్పుకుపోతుంది లలిత.

"నీ షాపింగ్ మండిపోనూ నన్నిలా కభోదిని చేసి, ఎక్కడికేల్లావే..పాపిష్టి దానా.." ఇంచుమించు ఏడిచినంత పనిచేసాడు రామారావు. "అర్రే.. పళ్ళెంలో చూసారా ఎంత చిల్లరో...."సంబరంగా అరిచినంత పనిచేసింది. లలిత.

"చిల్లరేమిటే? పళ్ళెంలో ఎందుకుంది..కొపదీసి నన్ను ముష్టి వెదవని అనుకున్నారా జనాలు?అయితే ఇందాక నా పక్కన చేరి మాట్లాడిందీ, నన్ను తొక్కుకుంటూ వెళ్లిందీ ముష్టి వాడా? ఎంత ఖర్మ పట్టిందే ఛి..ఛీ, ఆకరికి నన్ను ముష్టి వెధవని చేసి ఎక్కడ ఊరేగుతున్నవే ఇంత సేపూ.. ఇదేనా నీ పతి భక్తీ ?, కళ్ళు మండుతున్నాయే చేయి ఆసరా ఇవ్వు ఎక్కడ తగలడ్డావ్? అర్రుస్తున్నాడు రామారావ్.

"ఏమండీ కాస్సేపు అలాగే అరవండీ, కొంచెం సేపే, ఇంకో ఇరవయ్ రూపయిలితే చాలు, మీరిక్కడెవరికీ తెలీదు కదా! డబ్బులు ఆకొట్టు వాడి మొఖానకొట్టి చెంబు తెచ్చేస్తాను,  డబ్బులు లేకుండా ఎందుకు బేరం చేస్తారు అంటాడా.. అరవండీ, అంటూ చెట్టుచాటుకు వెళ్ళింది లలిత (తన పట్టు చీర చూస్తె డబ్బులు రాలవని).

చూసారా వారఫలాల ప్రకారం రామారావ్ గారికి ఆకస్మికంగా వచ్చిన ధనం ఎలా వినియోగమైందో... :-))


30 comments:

 1. :-)....:-)... :-)....
  చాలా బాగుంది వారఫలం...
  ఈ రోజు మనసారా నవ్వుకోవాలని దినఫలంలో ఉందేమో...
  అందుకే మీ పోస్ట్ చదివాను...:-)
  చాలా బాగుంది మేరాజ్ గారూ! అభినందనలు...@శ్రీ

  ReplyDelete
 2. వారఫలం చూశారా అక్షరాలా ఎలా నిజమైందో :)
  నిజంగా గొప్పదే కదా..

  ReplyDelete
 3. ప్రియమైన బ్లాగర్ మిత్రులకు. మీకు " దసరా పండుగ శుభాకాంక్షలు ".
  మీరు , మీ కుటుంబ సభ్యులు కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ...మెరాజ్ ఫాతిమా.

  ReplyDelete
 4. పేపరు చేతిలోకి తీసుకుంటూనే దినఫలం చూసే అలవాటుంది నాక్కూడా , అందరి లానే . తర తరాలుగా సగటు భారతీయుడు అనేకానేక అసంగతాల బ్రమలలోకి నెట్టబడి , అవన్నీ అసంగతాలని తెలుస్తున్నప్పటికీ ,నేటికీ - ఆ భావ పరంపరల బ్రమల నుండి బైట పడలేక పోతున్నాము . ఆహా ! ఎంత గట్టిగా మెదళ్ళలో కెక్కించారు మహానుభావులు ! ఒక పనికి మాలిన అశాస్త్రీయ భావజాలాన్ని, తమ బతుకు తెరువుకోసం .
  మీ వ్యంగ్య కథాస్త్రం రామారావులకే కాదు రాజారావులకు కూడా కనువిప్పు కల్గిస్తే , మొదటగా సంతోషించే వాడిని నేనే .

  ReplyDelete
  Replies
  1. రాజారావ్ సర్, ముందుగా మీ ఆత్మ విమర్శకు అభినందనలు.
   వారఫలాలను నమ్మేవారిని విమర్శించటం నా ఉద్దేశ్యం కాదు అదివారి నమ్మకం,
   ఇకపోతే రాజారావ్ గారికి కనువిప్పు అక్కర లేదు. (తెలిసే చదివేస్తున్నారు కనుక )
   సంతోషం మీకు నా కథ నచ్చినందుకు.

   Delete
 5. చాలా బాగుందండి....చూడాలి నేను బ్లాగిడిన వారఫలం ఎలాఉందో:-)

  ReplyDelete
  Replies
  1. తెలుగమ్మాయీ ,,, నా బ్లాగ్ చెప్పే వారఫలం చూడాలంటే కొన్ని నవ్వులు రుసుము చెల్లించాలి :-))
   స్వాగతం బ్లాగింటికి

   Delete
 6. mee comments laage mee katha rendo saari post ayipotondi...choosukondi meraj gaaroo!...@sri

  ReplyDelete
  Replies
  1. Sree garu, naa blog lo oke post kaniposthundi. mari porapatu ekkadundo teleetam ledu.

   Delete
  2. maro sari choodandi meraj gaaroo!...
   mottam anta kaadu...meeru vraasina maatter nemmadigaa chaduvutoo randi...apudu telustundi...aa part edit chesi teeseyavachchu...@sri

   Delete
  3. sree garu, mee sahakaaraaniki, abhimaanaaniki thanks.

   Delete
 7. చాలా బాగుందండి మెరాజ్ గారు.

  ReplyDelete
 8. హ హ హ:))))మొత్తానికి మా వారఫలం బాగానే ఉంది:)

  ReplyDelete
 9. Nice story.
  Went to Srisailam and returned few hours back.
  WISHING ALL HAPPY DASARA

  ReplyDelete
 10. సర్, అక్షరాలతో మాయాజాలం చేస్తున్నాను అన్నారు కదా,
  అందుకే హాస్యకథ రాసాను, మీ వ్యాఖ్య లేదేమిటా అనుకున్నాను.
  ప్రయాణం నుండి వస్తూనే నా బ్లాగ్ చూసి స్పందినచిన మీకు కృతజ్ఞతలు.
  Happy dasara sir.

  ReplyDelete
 11. హహహ్హః-)
  మీ వ్యంగ్యం చురకత్తిలా వుంటుంది ఫాతిమాజీ...

  ReplyDelete
 12. varmaji, prasamsaku dhanyavaadaalu.

  ReplyDelete
 13. కథ చాలాబాగుంది ఫాతిమా గారూ...ఈరోజు నా వారఫలం బాగుందన్న మాట.. !!!

  ReplyDelete
 14. Sesidar gaaroo, mee vaarapalam ellakaalam baagundaalani korukuntunnaanu. katha chadivina meeku dhanyavaadaalu.

  ReplyDelete
 15. This comment has been removed by the author.

  ReplyDelete
 16. katha , kavitalu verasi mee blogu...bahu baagu baagu..

  ReplyDelete
  Replies
  1. mee comment aalasyamgaa choosaanu sorry,
   mee spandanaku dhanyavaadaalu

   Delete