Pages

Friday 25 April 2014

మరొక జన్మకై...,

    




మరో జన్మకై..,


కనులు తెరిచి కాంచే స్వప్నానివి నీవు.

గతజన్మ జ్ఞాపకానివి నీవు.

అద్దములో నీది కాని ప్రతిబింభముతో..,

సంభాషించే...,మనోభాష్యానివి నీవు.


పగిలిన ప్రతిమని అతికించాలనుకొనే,

సున్నిత మానసిక స్నేహానివి నీవు,

అనుభవించే దేహం నీది కాదు,

ఆలోచించే మనో వికాసానివే నీవు.

నిప్పులు పూచే నీ గుండెలపై,

తాను విశ్రాంతికై తలవాల్చితే...,

శీతల శబ్దాలను కూర్చి ఓ అబద్దం చెప్పు,

మరుజన్మకి తనమెడలో...దారమౌతానని.














6 comments:

  1. శీతల శబ్దాలను కూర్చి ఓ అబద్దం చెప్పు,
    అవును ఒక్కొక్కసారి అబద్ధమే మానసిక బలాన్నిస్తుంది..............
    మీరజ్ బాగుంది మీ మనో విశ్లేషణ.

    ReplyDelete
    Replies
    1. దేవీ, మీ స్పందన నాకు స్పూర్తినిస్తుంది, ధన్యవాదాలు.

      Delete

  2. ఎంతో బాగున్నాయ్ మీ కవితలో దాగి ఉన్న ఆణిముత్యాలు !

    ఫాతిమా గారు మీ ఈ కవిత ........
    మీ రచనలకు కాస్తా భిన్నంగా తోచింది..
    - అంటే 'అదోలా' అని కాదు. 'బాగుందని' చెప్పడం.

    "...... పగిలిన ప్రతిమని అతికించాలనుకొనే,
    సున్నిత మానసిక స్నేహానివి నీవు,,

    - అన్న మీ పలుకుల్లో ఎంత అమాయకత ఉంది.

    "శీతల శబ్దాలను కూర్చి ఓ అబద్దం చెప్పు,
    మరుజన్మకి తనమెడలో...దారమౌతానని."

    పట్టున్న పదాలతో ముగింపును చాలా అమూల్యంగా మలిచారు.
    భేష్ ఫాతిమా జీ ... భేష్.
    అప్యాయతాభినందనాలు మీకు.

    * శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. నా కవిత భిన్నరీతిలో ఉందని గమనించారు, ప్రశంసించారు.
      బ్లాగ్ మిత్రునిగా మీ స్పందన నాకెంతో స్పూర్తినిస్తుంది శ్రీపాద గారు.

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete

  4. కనుల ముందు స్వప్నమై, గతజన్మ జ్ఞాపకమై ఎవరి ప్రతిబింబమో లా ..., సంభాషించే..., మనోభాష్యం, పగులు ప్రతిమని అతికించాలనే సున్నిత మానసిక స్నేహం .... అతను. తనది కాని తన అనుభవ ఆలోచనల మనో వికాసం నిప్పులు పూచే గుండెలపై శీతల శబ్దాలను కూర్చి చెప్పే ఓ నమ్మకమైన అబద్దం .... మరుజన్మకి ఆమె మెడకు .... దారమౌతానని.

    ఉరో అది పసుపుతాడో అనే ప్రశ్నలుదయిస్తూ .... చక్కని కవిత
    అభినందనలు మెరాజ్ గారు!

    ReplyDelete