Pages

Tuesday 29 April 2014

నేనెవరినో తెలుసా..?

    






   నేనెవరినో తెలుసా..?

    విరుల  సిరులకై  దోసిలొగ్గిన,
    వనమంతా తిరిగే  వనమాలిని. 

    నిత్యం నీ సమయాన్ని కొలిచే,
    చంచలిత   కొలమానాన్ని. 

    తలపుల దారిలో నీతో అడుగు కలిపే,
    ఊహల బాటసారిని. 

    అంతర్ గవాక్షం నుండి నిను గాంచె,
    అదృశ్య  నయనాన్ని. 

    నీవు రగిల్చిన  నిప్పుల నెగడులో,
    రాలి  పడుతున్న  నివురుని. 

    నీలి మేఘాల చీకటి  మాటున,
    జాబిలికై నిరీక్షించే  అభిసారికని. 

    మరణ రహిత  అమృత  కలశాన్ని. 

10 comments:

  1. 'మరణ రహిత అమృత కలశాన్ని'
    భగవంతుని శుభాశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మీకు

    ReplyDelete
    Replies
    1. సర్, నమస్తే..,
      మీ స్పందనకు నా ధన్యవాదాలు.

      Delete
  2. నీ మధురోహల మృదుభావాన్ని................

    ReplyDelete


  3. " తలపుల దారిలో నీతో అడుగు కలిపే,
    ఊహల బాటసారిని.
    నీలి మేఘాల చీకటి మాటున,
    జాబిలికై నిరీక్షించే అభిసారికని. "

    ఈ పలుకులు చాలవా ఫాతిమా గారూ ...
    మీరు అక్షరాలను ఎంత అందంగా అల్లగలరో అవగాహన చేసుకోడానికి.

    అన్నీ బాగా చెప్పారు మరి చివరన.......
    " మరణ రహిత అమృత కలశాన్ని " అని
    కాస్తా కలవరాన్ని అందించారు ఎందుకో.
    జీవిత పాఠాలను నేమరువేసుకున్నట్లుగా తోచింది.
    మంచి కవిత .
    అభినందనలు ఫాతిమా గారు .

    * శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాద గారూ,
      మరణరహిత అమృతకలశం అంటే మంచిదే కదండీ....?
      నిజంగా నా కవితలు జీవితానికి దగ్గరగా అనిపించాయీ అంటే నా అక్షరం ధన్యత పొందినట్లే..
      మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete
  4. ఫాతిమాజీ ,

    అన్నీ చాలా బాగున్నాయి ఒక్కటి తప్ప , చక్రభ్రమణాన్ని చంచలిత అని పోల్చటం అంతగా నచ్చలేదు .

    ReplyDelete
    Replies
    1. శర్మాజీ.., మీకు నచ్చని పదాన్ని పరిసీలించాను,
      కానీ నేను పోల్చింది ఓ స్త్రీ హృఉదయముతో..., అయినా తీసేద్దాం అంతే..:-))

      Delete
  5. విరుల సిరులకై దోసిలొగ్గిన వనమంతా తిరిగిన వనమాలిని. నిత్యం నీ సమయాన్ని కొలిచి, నీ తలపుల దారిలో నీతో అడుగు కలిపి, అంతర్ గవాక్షం నుండి నిన్నే చూస్తూ, నీవు రగిల్చిన నిప్పుల నెగడులో రాలి పడుతున్న నివురుని. నీలి మేఘాల చీకటి మాటున జాబిల్లికై నిరీక్షిస్తున్న అభిసారికని. మరణ రహిత అమృత కలశాన్ని. .... నేనెవరినో తెలుసా? ఆంటూనే ఎంతో భారమైన భావనలతో రాసిన కవిత మళ్ళీ మళ్ళీ చదివించింది .... మంచి మంచి పదాలు ఎంతో నాణ్యతగా .... చాలా బాగుంది
    అభినందనలు ఫాతిమా గారు!

    ReplyDelete
  6. ధన్యవాదాలు సర్,
    నా భావాలు మెచ్చుకున్ననందుకు చాలా సంతొషంగా ఉంది.

    ReplyDelete