Pages

Sunday, 8 July 2012

శిశు గీత
శిశు గీత

ఏ అనుబంధం నన్ను  కడుపులో  పెంచిందో,
ఏ అసహనం  నన్ను అక్కరలేదు అనుకుందో,

ఏ సమస్య నన్ను వదిలించుకోమందో,
ఏ నిర్ణయం నన్ను బుట్ట దాఖలు  చేసిందో,

ఏ ఆలోచన నన్ను అంతం చేసిందో,
ఏ విషాదం నన్ను దూరం చేయమందో,

ఏ సందిగ్దం  నన్ను తప్పించుకోమందో,
ఏ సందర్భం  నన్ను సాగనంపిందో,

ఏ సలహా నన్ను చంపివేయమందో,
ఏ సమాజం నన్ను పంపివేయమందో,

అమ్మా నాన్నలకే  అక్కరలేని నేను, అన్యులైన  మిమ్ము అడుగుతున్నా.

ఎక్కడిదీ బిడ్డలను చంపుకునే అసాంఘిక ధర్మం?
ఎక్కడిదీ ఆడపిల్లలను కడతేర్చే ఆటవిక న్యాయం?

ఎక్కడిదీ మానవతను మంటగలిపే  బుద్దిమాంద్యం?
ఎక్కడిదీ అంతరాత్మను  చంపుకొనే అంధ  అజ్ఞానం?

ఎక్కడిదీ వారసత్వపు  శకలాలను  మూటగట్టే మూఢత్వం?
ఎక్కడిదీ మాతృత్వాన్ని మంటగలిపే గొడ్డుమోతుతనం?

ఎవరు తెచ్చారు  ఈ సంకరజాతి  సంస్కృతిని ?
ఎవరు నేర్పారు  ఈ వికృతనీతి  విష క్రీడని?

ఎవరు ఎదుర్కుంటారు ఈ  విపరీత పరిణామాన్ని?
ఎవరు వేటాడుతారు  ఈ  విషపు విహంగాన్ని?

నిష్టూరమన్న (అమంగళం) నన్ను, సృష్టి కి ప్రతి సృష్టిగా  గుర్తించే వరకూ నేనింక తిరిగి  రాను.


38 comments:

 1. welldon. very strong poetry.

  సృష్టి కి ప్రతి సృష్టిగా గుర్తించే వరకూ నేనింక తిరిగి రాను.
  entha baavundi ee vaakyam!!

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ, కవిత ను అర్ధం చేసుకున్నారు ధన్యవాదాలు. మీ స్పందన నాకు నచ్చింది.

   Delete
 2. ఫాతిమా గారూ!
  విష సంస్కృతికి అంతమెపుడని సూటిగా ప్రశ్నించారు...
  కదిలించింది మీ కవిత...
  చివరి వాక్యాలే కవితకి ప్రాణం...
  అభినందనలు...

  మీరు ఈ కవితని ప్రెజంట్ చేసిన పద్ధతి బాగుంది..
  స్పష్టంగా..అలా రెండు రెండు లైన్లలో విడగొట్టి...
  మీరు కవితలు ఇలాగే ప్రెజంట్ చేయండి ప్రతిసారీ...
  చదువరులకు బాగుంటుంది...:-)
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. పోస్ట్ పెట్టె విదానం నచ్చినందుకు కృతజ్ఞతలు.

   Delete
 3. When will change this things?

  ReplyDelete
  Replies
  1. God alone knows, sir, ee samaajam maaraalani aasiddam.

   Delete
 4. one of the best, sootiga, nirbhithiga goppaga prasnincharu,
  keep writing.

  ReplyDelete
  Replies
  1. భాస్కర్ గారూ, ధన్యవాదాలు మీ ప్రశంసకు. ఆ బిడ్డను చూస్తుంటే సమాజంలోని అమానుషాన్ని ఇంకా దూషించాలని ఉంది.

   Delete
 5. ఫాతిమా గారు,
  తరాలు మారుతున్నా...ఎన్ని మార్పులోస్తున్నా
  ఆడపిల్ల అనే భయం మాత్రం పోవడం లేదు.
  ఎందుకనో...?!?!!?
  ఆ ప్రశ్న కి సమాధానం అలా అనుకునే వారే చెప్పాలి...

  చదువుకుంటునా,గోప్ప పట్టాలు పొందినా కానీ ఆలోచన ఆడపిల్ల పట్ల మారడం లేదు ఎందుకనో?
  ఇంక చదువులేని వాళ్ళననుకోలేం....
  విద్య విచక్షణ ను నేర్పాలి...ఇలాంటి ఆలోచనలను ఆపాలి.
  కాని అది చాలా తక్కువ శాతం జరుగుతొంది ?!

  అలా చనిపోవడం దారుణం..కాని అలా బ్రతుకుతూ ఉండడం ఇంకా దారుణం...కొన్ని జీవితాలు అలాగే ఉంటాయి.నిరంతరం మదిలో సంఘర్షణ ...ఆలోచిస్తే ఆడపిల్ల అని గుర్తు చేస్తూ....!!

  ఎంత గొప్పదయినా స్త్రీ కి ఈ దుస్థితి ఎమిటో?
  స్త్రీ నే మూలం అని తెలిసినా ఎమిటో ఇదంతా?


  మీ కవిత చాలా బాగుంది.
  మీకు హృదయపూర్వక అభినందనలు !

  ReplyDelete
  Replies
  1. సీత గారూ, మీ స్పందన ఎంతో ఉన్నతంగా ఉంది, నిత్యం నేను ఎదుర్కునే సమస్య ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు చూపించే పక్షపాత బుద్ధి.నేను ఆడపిల్లల కోసం తల్లిదండ్రులతో పోట్లాడిన సందర్బాలు లేక పోలేదు. ఒక్క చదువు విషయంలో కొడుక్కి , కూతురికి వ్యత్యాసం చూపించే వీరు ఇక జీవితాంతం భరువు అనుకోవటంలో వింత లేదు. డియర్, ఇప్పటి మీ తరమైనా ఆడ పిల్ల అంటే ఏమిటో నిరూపించండి.

   Delete
  2. నిజమే కదండీ....ఆడపిల్ల లేకపోతే సృష్టే జరగదని తెలిసినా వ్యత్యాసం చూపించే వారిని ఏమనాలి??
   కోత్త పేర్లు పేట్టాలేమో వీళ్ళకి....
   ఆడపిల్ల తల్చుకుంటేఎంత ఉన్నత శిఖరాలనయినా అధిరోహించగలదు ...
   ఎంతో మంది మన దేశ భవిష్యత్తు ని తీర్చిదిద్దగలరు...అలాంటి వారిని ఇలా చేస్తున్నారు కనుకనే మనమింకా ఎదుగుతూనే ఉన్నాం...
   ఎప్పటికీ ఇలాగే 'ఎదుగుతూనే' ఉండిపోతాం ఏమో...!!ఎదగలేమేమో....!!

   Delete
  3. సీతా డియర్, నాకు మీలాంటి అమ్మాయిలను చూస్తే చాలా గర్వంగా ఉంటుంది ఎందుకో తెలుసా ఇప్పటి తరమైన మీరు సాహితీ విలువలను కలిగి ఉండటం, మార్చండి మీ ముందున్న మూడులను, మీ కలంతో, మీ గళంతో మనం చేయ గలిగింది ఇదే. మీ స్పందనకు మనస్పూర్తిగా ప్రతిస్పందిస్తున్న, ఆశీర్వదిస్తున్నా.

   Delete
  4. మీ ఆశీస్సులున్నాయి గా....ప్రయత్నిస్తాను ఫాతిమా గారు...ధన్యవాదాలు :)

   Delete
  5. సీత గారూ, తప్పకుండా నా ఆశీస్సులు ఉంటాయి. మన జీవితం మనకు ముఖ్యమే కాని కొంచం ఇలాంటి విషయాలకు కూడా మనం కొంత సమయం కేటాయించి మంచి చేయగలగాలి. దేవుడు మీకు ఆ శక్తీ ఇవ్వాలి.

   Delete
 6. కవిత చాలా బాగుంది అక్కా!

  ReplyDelete
  Replies
  1. Harsha, thanks, bizy gaa undi koodaa naa kavitha chadivinanduku.

   Delete
 7. మనం ఎంతమొత్తుకున్నా వినటం లేదండి! మరేదో చేయాలి, విరుగుడు దీనికి.

  ReplyDelete
  Replies
  1. సర్, వస్తుంది నవ సమాజం వస్తుంది, కొన్ని కలుపు మొక్కలను ఏరిపారవేయాలి అంతే,

   Delete
 8. మనసును కదిలించేలా ఉంది అండీ మీ కవిత.... నిజమే.. ఎప్పుడు మారుతుంది ఈ సమాజం ?

  ReplyDelete
  Replies
  1. సాయి గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. వస్తుంది మార్పు త్వరలో ఎదురుచూద్దాం.

   Delete
 9. కవితా, ఆ ఫొటో రెండూ హృదయాన్ని కదిలించేశాయి. పుట్టిన పాపాయిని ఆడ శిశువని చంపుకోవటం ... నాగరీకం అన్న ముసుగులో మనం నిర్మించుకున్న అనాగరీక సమాజం ఫలితం. చాలా బాధాకరం.
  ఎప్పటిలా ఇలాంటి విషయాలపై మీ శైలిలో హృద్యంగా రాశారు.

  ReplyDelete
 10. సర్, ఆడ శిశువు పట్ల చిన్న చూపు (అందరిలో లేదు ) పోవాలి.బిడ్డలని చంపుకొనే రాక్షస క్రీడ అంతరించాలి.

  ReplyDelete
 11. ఈ సమస్య అత్యంత హేయమైనది.మొన్న నేను ఇంటికివస్తున్నప్పుడు ఒక శిశువును మురికి కాలువలో చూసాను.మనసు ద్రవించింది.మీ కవిత సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నట్లుంది.చాలా బాగా వ్రాసారు.

  ReplyDelete
 12. రవి గారూ, ఆడపిల్లలను అంతం చేసే ఈ రాక్షస క్రీడ, వరకట్నం అనే మహమ్మారి వదిలే వరకూ సాగుతూనే ఉంటుంది.

  ReplyDelete
 13. రవి గారూ, ఆడపిల్లలను అంతం చేసే ఈ రాక్షస క్రీడ, వరకట్నం అనే మహమ్మారి వదిలే వరకూ సాగుతూనే ఉంటుంది.

  ReplyDelete
 14. Entha cruel oh e prapancham anipistundi okko sari!...Papam ah pilla....ah picture chustu unte....chala badhaga undi......Amma ni accept chestam...chellini accept chestam...wife ni accept chese vallu....daugther em papam chesindi??

  .Me kavitha chala bavundandi.....mundu mundu maname edurukuntam parinamanni...Kontha mandi chesina tappu motham society ki muppu testundi...:(

  ReplyDelete
  Replies
  1. valli gaaro, meeru naa avedananu ardam chesukunnaru, nijame meerannadi amma, chelli ,bhaarya, veellani accept chesinaa aadapilla koratha valla pai varsaleevee undavu. asalu amme undappudu srusti undadu. dhanayavaadaalu na blog darsinchina meeku.

   Delete
 15. నిర్ణయం - బుట్ట
  ఆలోచన - అంతం
  ఇవే కాదు ఇంకా ఇలాంటి పదాలను అలవోకగా రాస్తారు.
  మీకు ఇంతటి ప్రతిభనిచ్చిన దైవానికి ధన్యవాదాలు!
  ఎందుకంటే మాకు ఇలాంటి కవిత్వం చదివే భాగ్యం దక్కినందుకు!!
  కవిత ' కత్తి ' లా ఉంది.
  సమాజానికి శస్త్ర చికిత్స చేస్తుంది!

  ReplyDelete
  Replies
  1. సర్, మీ ప్రశంస నన్ను ఆకాశానికి ఎత్తేసింది, "ఇలాంటి కవిత్వం చదవటం మా భాగ్యం"అన్నారు ఇలాంటి ప్రశంసలు ముఖ్యంగా మీ వంటి పెద్ద రచయితలు పలకటం నిజంగా నా అదృష్టం. సర్ నా ప్రతి కవిత చదివి ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదాలు.

   Delete
 16. సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నట్లు..
  మీ శైలిలో కవిత చాలా బాగుంది.

  ReplyDelete
  Replies
  1. రాజీ గారూ, మీకు నా శైలి నచ్చినందుకు ధన్యవాదాలు. మీ ప్రశంస నన్ను ముందుకు నడిపిస్తుంది .

   Delete
 17. This comment has been removed by the author.

  ReplyDelete
 18. fathima garu ఆడపిల్లను వద్దనుకునే హీన సంస్కారపు సమాజాన్ని సూటిగా ప్రశ్నించిన మీ కవిత చాల బాగుంది.పుట్టడానికి ఇంకా పుట్టిన ప్రతి క్షణం నుండి చచ్చేంత వరకు కూడా ఆడవారిపై ఆధారపడి బ్రతుకుతూ కూడా బిడ్డగా ఆడది వద్దనుకునే ఈ ప్రబుద్ధులని ఏంచేసినా తప్పు లేదు.photo చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది దహిస్తోంది ఈ సమస్యకు అంతమెప్పుడో...

  ReplyDelete
 19. వీణ గారూ, ఆడపిల్ల వద్దు అనుకోనేవారిలో చాలా బాగం ఆడవారే, నిత్యం నేను నా చుట్టూ ఉన్నవారితో పోరాడేది ఈ ప్రవర్తన వల్లనే, స్త్రీలు ( అందరూ కాదు సుమా) మగ బిడ్డని ఉన్నతంగా భావించి ఆడపిల్లని తేలికగా చూస్తున్నారు, ఎంతో మంది బాలికలకు నేను సముదాయించి చెప్తూ ఉంటాను. మనకు తెలుసు జంతువులు, పక్షులు కుడా తమ బిడ్డ కి హానీ చేస్తే ఊరుకోవు, అలాంటప్పుడు ఇలాంటి చెర్యల వెనుక ఎంత పోరాటం ఉంటుందో, కారణం ఎవరైనా ఇది అమానుషం. నా కవిత కి స్పందించిన మీకు ధన్యవాదాలు.

  ReplyDelete
 20. ఫాతిమాజీ, మనిషుల్లో మానవత్వం నేతిబీరకాయ....లాంటిదేనని అనుకోవాలేమో! ఆడపిల్లని లక్ష్మీదేవి అని పూజించే ఈ భారతదేశంలోనే ఈ వింత పోకడ.సమాజంపై మీస్పందన అభినందనీయం

  ReplyDelete
 21. వాసుదేవ్ గారూ, కవిత చదివిన మీకు ధన్యవాదాలు. ఆడపిల్లని అపురూపంగా చూసుకునే మంచి మనుషులూ ఉన్నారు కానీ ఈ అమానుషాన్ని అంతరించే సమాజ సృహ అందరిలో రావాలి. మీ స్పందనకు థాంక్స్.

  ReplyDelete