Pages

Sunday, 29 July 2012

అనుబంధాలు


తెల్లవారుజాము నాలుగు గంటలైనట్లుంది ఇంటిముందు ఆటో ఆగిన చప్పుడుతో పాటు అల్లుడూ, అల్లుడూ... అంటూ ఓ పోలి కేక, అమ్మాయ్, అమ్మాయ్ అంటూ ఓ ఆడ కేక వినిపించి ఫ్యాక్టరీ సైరన్ లా అందరినీ లేపింది. నేను మా వారూ హడావిడిగా వీధి గుమ్మంలోకి వెళ్లి చూశాం. గుమ్మడి కాయ లాంటి ఓ ఆడ శాల్తీ, పక్కన పొట్ల కాయలా ఓ మగ శాల్తీ, దోస కాయల్లాంటి ఇద్దరు మగపిల్ల శాల్తీలు, ఓ ఆడ పిల్ల శాల్తీ అటో లోంచి దిగారు. ఎవరా వీళ్ళు అనుకుంటుండగా, పోట్లకాయలాంటి శాల్తీ " ఏమిటోయ్! నువ్వేనా మా కాముడి మొగుడివీ " అంటూ మా వారి భుజం పై ఓ చరుపు చరిచాడు. కాక చస్తానా అన్న ఫీలింగ్ కనిపించింది మా వారి మొఖం పై. అప్పుడా గుమ్మడి కాయ లాంటి ఆడ శాల్తి " నేనే నే అమ్మా, మీ సూరమ్మ పిన్నిగారికి వరసకి అక్కని, అన్నట్టు మీ పెళ్ళికి మేం రాలేదు కదా, ఓ సారి చూసిపోదాం అంటూ వచ్చామే అమ్మా" అంటూ ఇరవై ఏళ్ల క్రితం జరిగిన మా పెళ్ళి గుర్తు చేసి పరిచయాలు మొదలు పెట్టింది. వీళ్ళు అరుణ పిల్లలే, అదే నిన్ను అక్కా అక్కా అంటూ నీ వెంట వెంట తిరిగేది దాని పిల్లలు, వీడు పెద్దోడు "బంటి" వీడు చిన్నోడు "చంటి" ఇదేమో "చిట్టి" చంటిది. అప్పుడర్థమయ్యింది వీళ్లు నాకు దూరపు బందువు బాబాయి పిన్ని వరుస అవుతారని.

ఓ హో హో, మీరా పిన్ని గారూ, రండి రండి అంటూ ఇంట్లోకి ఆహ్వానించాను. ఆటోకి ఆనుకుని సెల్లు లో మాట్లాడుకుంటున్న డ్రైవర్ తో "ఒరే అబ్బీ అలా కొల్లుదున్నలా నిల్చున్నావేమిటీ? ఆ సామాను ఇంట్లో పెట్టు" అంటూ నెత్తి మీద ఒక్క మొటిక్కాయి ఇచ్చి లోపలికి వచ్చారు పిన్ని గారు. "ఇదెక్కడి పరేషాన్ రా  బాబూ " అని గొణుక్కుంటూ సామను లోపల పడేశాడు అ డ్రైవరు.

ఇంతలో బాబాయిగారు ఓయ్ అల్లుడూ.. అల్లుడూ.., ఈ అటో వెధవ చూడు, మీటరు అంటూ గోలెడుతున్నాడు, ఆ మీటరు ఏంటో వీడి మొహాన తగలెయ్యి నాయనా అంటూ లోపలికొచ్చి, ఉస్సో అంటూ ముడేసిన తాడు పడేసినట్లుగా సోఫాలో చతికిలబడ్డాడు. అల్లుడు గారు.. అదే మా వారు ఏమిటీ అపశ్రుతి అన్నట్టు నావంక కోర కోర చూస్తుంటే నేను కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారిలా ఏమీ ఎరగనట్టు ఉండిపోయాను.

బయట మావారు గట్టిగా అరుస్తున్నారు. ఏంటయ్యా మీటర్ వెయ్యలేదు ఐదు వందలు అడుగుతున్నావు అంటూ. నేనూ బయటికెళ్ళాను , ఏం జరుగుతోంది అనుకుంటూ. అటో వాడూ అరుస్తున్నాడు." అరె ఏమిడ్ది సార్ సెకండ్ షో సూసి ఇంటికేల్తుంటే తగిలిందీ గిరాకి. లొల్లి లొల్లి చేసిన్రు, ఏడేడనో తిప్పిండ్రు. పోరోల్లిద్దరు నా భుజాల మీందికెక్కి దమ్ము దమ్ము చేస్తుంటే, పోరేమో నా ఒళ్లో కూసుని హండిల్ తిప్పుతూ పరేషాన్ చెయ్యబట్టే. ఆ పెద్దయనైతే మా అల్లుడు పోలీసాయన నిన్ను మస్తు గొట్టిపిస్తా అంటూ ఆగం ఆగం చేస్తుంటే, ఆయమ్మేమో గిట్ల పోనీ, గట్ల పోనీ అంటూ ఎన్క కెళ్ళి డొక్కలో ఒకటే పోడువుడు. ఇంకొకళ్ళ కైతే హజార్ రుపై అడుగుతుంటి, ఇగ నువ్వేమో పోలీసాయన వైతివి" అంటూ గోలె డుతుంటే మా వారు వాడికి నాలుగు వందలు ఇచ్చి నా వైపు గుర్రుగా చూస్తూ లోపలికొచ్చారు.

"అవునే అమ్మాయ్, నీకో తమ్ముడు ఉండాలి కదా, ఎప్పుడో ఓ సారి అనంతపురం ఆస్పత్రిలో మీ అమ్మతో పాటు చూసాను. కుర్ర సన్నాసి ఏదో చూసి దయ్యమని దడుచుకున్నాడట , ఇప్పుడెక్కడున్నాడు?"

"బావున్నాడండీ, విదేశాల్లో చదువుకుంటున్నాడు".

"అవునా! జాగ్రత్తమ్మా ఏ తెల్ల దొరసానులో నల్లదోరసానులో ఎగరేసుకు పోతారు".

" లేదులెండి రెక్కలు మా దగ్గరే ఉంచుకుని వాడినోక్కన్నే పంపించాం" అన్నాన్నేను.

                                                                           * * *
ఇక నేను వాళ్లకు కాఫీ టిఫిన్ల ఏర్పాట్ల కోసం వంటింట్లోకొచ్చాను. కుంకలు ముగ్గురూ తోకల్లేని కోతుల్లా సోఫాల మీద దూకుతూ హడావిడి చేస్తున్నారు. ఇంతలో గట్టిగా అటో హారన్ వినిపించింది. గుండె ఝల్లు మంది నాకు, మళ్ళీ ఎవరోచ్చార్రా బాబూ అనుకుంటూ వంటింటి లోంచి వచ్చి చూద్దునుకదా ఒక కుంక అటో హారన్ నోట్లో పెట్టుకుని ఊదుతున్నాడు. అర్థమయ్యింది నాకు, కుంకలు అటో హారనుపై హస్త లాఘవం ప్రదర్శించారని. ఆ శబ్దానికి మా యువరాణి చిరాగ్గా లేచి ఆ పిల్లల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. పిన్ని గారు దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఒళ్లో కూచోబెట్టుకుని బుగ్గలు నిముర్తుంటే మా యువ రాణి గారు మళ్ళీ చిరాకు పడింది, నేనేమైనా చిన్న పిల్లనా మమ్మీ అంటూ.
ఇక మావారు తయారై ఆఫీసుకు బయల్దేరుతూ, ఏమోయ్ నా కళ్ళజోడు కనపడ్డం లేదు చూడు అంటూ హడావిడి చేస్తున్నారు. చూద్డును కదా బాబాయి గారు ఆయన కళ్ళజోడు పెట్టుకుని స్టయిలుగా పేపరు చదువుతున్నారు.

నేను విననట్లే ఉండిపోయాను. వారు కాసేపు చూసారు బాబాయి గారు కళ్ళ జోడు ఇస్తారేమోనని, ఇచ్చే సూచనలేమీ కనిపించకపోయే సరికి, ఈరోజు పనెలా ఏడవాలో కళ్ళ జోడు లేకుండా.. సణుక్కుంటూ వెళ్ళిపోయారు. పిన్నిగారేమో వంటిల్లు ఎకచత్రాదిపత్యంతో ఏలేస్తున్నారు.

                                                                             ***
సాయంకాలం నాలుగు గంటలైంది. పిల్ల రాక్షసులు ఆరు బైట ఆడుకుంటున్నారులాఉంది. పిన్నిగారు ఓ గుండు చెంబుడు కాఫీ పెట్టుకుని తాగుతూ దాని రుచిని ఆస్వాదిస్తున్నారు. బాబాయిగారేమో ఈవినింగువాక్ వెళ్లినట్లున్నారు. ఇంతలో మా అమ్మాయి పోలి కేక, కాలేజి నుండి వస్తూనే ఏమయింది దీనికి అనుకుంటూ బైటికొచ్చి చూద్దును కదా, బంటి గాడు మా పాప "లాప్ టాప్" కు తాడు కట్టి దాని చివర నడుముకు కట్టుకుని "పీప్.. పీప్.. అంటూ పరిగెడుతూ ఆడుతున్నాడు. మా పాప వాడి దగ్గర్నుంచి లాప్ టాప్ లాక్కుని ఒక్కటి అంటించింది. అంతే, వాడు ఇల్లెగిరిపోయేలా ఆరున్నొక్క రాగం అందుకున్నాడు. బామ్మ గారు "ఏమిటే అమ్మా! ఆ ముదనష్టపు డబ్బా కోసం పిల్లాడిని ఏడిపించావు అంటూ వాడికి ఆ పక్కనే ఉన్న "డిజిటల్ ఫోటో ఫ్రేం" ఇచ్చి వెళ్లి ఆడుకో నాయనా అంది. వాడు అది తీసుకుని దానికి తాడు కట్టి బస్సు ఆట నిర్విఘ్నంగా ఆడుతున్నాడు. మా యువ రాణేమో మామయ్యా గిఫ్ట్ ఇచ్చిన "డిజిటల్ ఫోటో ఫ్రేం" సర్వ నాశనం చేస్తున్నాడు వెధవ, I will neck out this fellow అంటున్న దాన్ని సముదాయించే సరికి నా తల ప్రాణం తోకకు వచ్చినంత పనయ్యింది.

ఇక రాత్రయితే చంటి గాడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మా వారి బ్రీఫ్ కేసు లోంచి ఎప్పుడు తస్కరించాడో ఆయన రివాల్వర్, అది తీసుకుని మహేష్ బాబు లెవెల్లో తిప్పుతూ, జారి పోతున్న చెడ్డీ కూడా పట్టించుకోకుండా, డాం.. డాం. అంటూ అటూ ఇటూ పరిగెడుతూ మామ్మ దగ్గర ఆగి, మామ్మ! నాకు పోలీసు డ్రెస్సు కొని పెడతావా లేదా? లేకుంటే కాల్చేస్తా అంటూ పిన్ని గారివైపు గురిపెట్టాడు. పిన్ని గారు గజ గజ వణుకుతూ పోలీసు బాబాయికి చెప్పి కొని పెడతా లేరా నాన్నా.. ముందా ముదనష్టపు పిస్తోలు అక్కడ పడెయ్యి అంటూ బతిమలాడ సాగింది. వాడు వింటేనా, అ ..అ .. నా డ్రెస్సు... అంటూ కోతిలా గంతులేస్తున్నాడు. ఇంతలో మా వారు బయట్నుంచొచ్చి వాడి చేతిలోనించి రివాల్వర్ లాగేసుకున్నారు. హమ్మయ్య... అంటూ అందరం ఊపిరి పీల్చుకున్నాం.

                                                                           * * *
మరుసటి రోజు ఆదివారం. కాపీలు, టిపినీలు లాగించి మగపిల్లపిడుగులిద్దరూ టీవీ దగ్గర కుస్తీలు పడుతుంటే ఆడ పిల్ల పిడుగు చిట్టి మాత్రం మా యువరాణి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూచుని క్రీములన్నీ మొహానికి పులుముకుని, జగన్మోహిని సినిమాలో జయమాలినిలా దర్శనమిచ్చింది. గుండెలవిసిపొయ్యాయి దాన్ని చూసి. వీళ్ళు వెళ్ళేంత వరకు పిల్లల్ని ఏమీ అనకూడదన్న వార్నింగుతో మా యువ రాణి సైలెంట్ గా చూస్తూ ఉంది, కానీ అసహనం దాచుకో లేక పోతుంది. ఇంతలో పదకొండున్నరకు "సత్యమేవజయతే" ప్రోగ్రాం చూద్దామని టీవీ దగ్గరికేల్తే, అక్కడ కుంకలిద్దరూ వాలి సుగ్రీవులను, సుందోపసుందులను మరిపిస్తూ వీర వీరగా యుద్ధం చేస్తున్నారు. పిన్నిగారు గత ఆరు ఏళ్లగా కొనసాగుతున్న ఏదో అరవ డబ్బింగు సీరియల్ చూస్తున్నారు. ఒక మొగుడి కోసం ఇద్దరు ఆడవాళ్ళు విలన్లుగా మారి భారీ డైలాగులతో పోట్లాడుకొంటున్నారు. బాబాయిగారేమో పిల్లల చేతిలోంచి రిమోట్ లాక్కుని ఫ్యాషన్ టి.వి పెట్టి ఏమిటర్రా ఇది పిల్లల ప్రోగ్రామేమో కదా అంటూ గుడ్లు మిటకరించి చూస్తున్నారు.

"ఆ.. అఘోరించారు.. వేదవ తెలివి తేటలు మీరూ, ఆ తైతక్క బొమ్మలని చూడటానికి మాత్రం అద్దాలు అక్కరలేదు." ముందు ఆ సీరియల్ పెట్టండి, అంటూ నెత్తిమీద ఒక్కటిచ్చుకున్నారు. ముందుకు తూలిన ఆయనగారి చేతిలోనించి జారిన రిమోట్ బంటి అందుకున్నాడు. వాడి చేతిలో నుండి చంటి లాక్కున్నాడు. ఇద్దరి మధ్యా హోరాహోరీ యుద్ధం కొనసాగింది.. పలితంగా టి.వి. రెండు ముక్కలు నాలుగు చెక్కలైంది. నేను నా పరివారం శ్రోతలయ్యాము. అయ్యో కొట్టుకోకండిరా నాయనా .. తాతయ్య మిమ్మల్ని పార్కుకి తీసుకెళ్తారట అని ఉరుకోబెట్టటానికి ప్రయత్నించారు పిన్నిగారు. అయ్యా బాబో ఇక పార్కులో కిష్కింధ కాండే, ఎన్ని ఫిర్యాదులోస్తాయో అనుకుంటూ వంటింట్లో కెళ్ళాను.

                                                                           ***
పిల్లలు రోజూ ఏదో అల్లరి చేస్తూనే ఉన్నా కాస్త మచ్చికయారు మాకు. మా అమ్మాయి కూడా వాళ్ళతో ఆడుతోంది. ఇక వారం తర్వాత వాళ్లు వెళ్ళడానికి తయారయ్యారు. రైలు ప్రయాణం అనో లేక ఇక్కడి కట్టడికి విసుగిచ్చిందో ఏమో పిల్లలకు మహా సరదాగా ఉంది వెళ్ళడానికి. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ బట్టలు, చిన్న చిన్న ఆటబొమ్మలు అవీ ఉత్సాహంగా సర్దుకుంటున్నారు. వాళ్ళు వెళ్తుంటే ఏదో వెలితిగా అనిపించింది. మా అమ్మాయి ఇచ్చిన ఏవో గిఫ్ట్స్ పిల్లలు సంతోషంగా తీసుకున్నారు. ఇక పిన్ని బాబాయి కళ్ళల్లో నీళ్ళు చూసి నాకూ మనసు వికలమై కళ్లల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. వాళ్లను చూస్తుంటే స్వర్గస్తులైన మా అమ్మా నాన్నా గుర్తొచ్చారు. పిన్ని గారు నన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. ఎప్పుడూ మెటీరియల్ గా ఉండే మా అమ్మాయి కుడా ఏడ్చేసింది.

వెళ్ళిపోయారు వాళ్ళు. ఇల్లు ప్రశాంతంగా ఉంది, కానీ ఏదో వెలితిగా కుడా ఉంది. నిజమే! ఓ రకమైన యాంత్రిక జీవితానికి అలవాటు పడి, పిల్లల్ని కూడా క్రమ శిక్షణ పేరుతో కట్టడి చేస్తున్నామేమో అనిపించింది. వాళ్ళ పసితనాన్ని లాక్కుంటున్నట్లు అనిపించింది. ఆ రోజు సాయంత్రం ఏంతో ఆశ్చర్యం వేసింది నాకు, మా అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చి, ఆ పిల్లలు ఎక్కణ్ణుంచో తెచ్చి ఆడుకుని పడేసి వెళ్ళిన సైకిల్ చక్రం తీసుకుని దాన్ని కర్రతో తిప్పుతూ ఇంటి ప్రాంగణం లో ఆడుతూ ఉంది. దాని మొఖంలో ఎంతో సంతోషం. పాత సైకిల్ చక్రంతో రోడ్డు మీద, వర్షం నీళ్ళలో కాగితపు పడవలతో, ముంగిట్లో తోక్క్డుడు బిళ్ల ఆడుతున్న ఆ పిల్లల ఆటలు చూస్తుంటే మా అమ్మాయి పసితనంలో ఎం పోగొట్టుకుందో దాని పసితనాన్ని ఎంతగా లాగేసుకున్నామోఅనిపిస్తోంది.

ఓ వారం రోజుల పాటు పిన్ని బాబాయి గారు బాగా గుర్తొచ్చారు. వాళ్ళు ఉన్నన్నినాళ్ళు ఏంతో "సెక్యూర్" గా అనిపించేది.ఇంట్లో పెద్ద వాళ్లు లేని కొరత ఇప్పుడు బాగా బాధ పెడుతుంది. అనుబంధాలు మర్చి పోయి మెటీరియల్ గా జీవిస్తున్న మాకు పిన్ని, బాబాయిగారు, పిల్లలు ఆ అనుబంధాలను రుచి చూపించారు.
27 comments:

 1. ఈ పోస్ట్ చదువుతుంటే, పిల్లల పొటోలు చూస్తుంటే మాకు అత్యంత దగ్గర అయిన ఇసాక్,రేష్మ పిల్లలు ఇమ్రాన్, ఇర్ఫాన్ గుర్తుకు వచ్చారు. అచ్చం మీ పోస్ట్ లో వున్న పిల్లలు ఉన్నట్టే వుంటారు. అల్లరి చేయడంలో స్టేట్ ఫస్ట్.

  ReplyDelete
  Replies
  1. నాగేంద్ర గారూ, నిజంగానా మీకు కథ నచ్చినందుకు ధన్యవాదాలు.

   Delete
 2. అంతరించిపోతున్నాయి అనుబంధాలు అనుకుంటున్నాం, కానీ చూస్తుండండి మళ్ళీ అందరూ అవే కావాలంటూ కోరుకునే కాలం వస్తుంది. Nice one.

  ReplyDelete
  Replies
  1. పద్మ గారూ నిజమే మీరు చెప్పింది మళ్ళి అలాంటి అనుబంధాలు కావాలని కోరుకొనే రోజు వస్తుంది.

   Delete
 3. meeru... malli allari cheyandi. enjoy.. once again.

  ReplyDelete
  Replies
  1. vanaja gaaroo thanks katha chadivi spandinchina meeku.

   Delete
 4. చాలా నవ్వుపువ్వులు విరబూసాయి చదువుతుంటే...
  చిన్నప్పటి అల్లర్లు గుర్తొచ్చాయి...
  నిజంగానే మన పిల్లలు ఏమి మిస్ అవుతున్నారో బాగా చెప్పారు...
  మీ పాప లాప్టాప్ బాగానే ఉందా?...:-)))
  అభినందనలు మీకు .
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారూ, ధన్యవాదాలు కథ చదివిన మీకు, మా పాప "లాప్ టాప్ " బాగుంది ఇంకో అల్లరి పిల్లల కోసం ఎదురుచూస్తుంది.

   Delete
 5. మరి నేను కూడా అలా బోలెడంత అల్లరిచేసాను కదా:)

  ReplyDelete
  Replies
  1. అనికేత్ గారూ, అయితే మీరు మా బంటీ,చంటీ లాగే అన్నమాట. కథ చదివిన మీకు థాంక్స్ అండీ.

   Delete
 6. కామెడీగా మొదలుపెట్టి, కన్నీరు పెట్టించే సెంటిమెంటుతో ముగించారు, బంధాలు ఎప్పుడూ బలమైనవే, బలహీనపడనంత వరకు.

  ReplyDelete
  Replies
  1. భాస్కర్ గారూ, ఎంత బాగా చెప్పారు నేను చెప్పదలచుకున్నది అర్ధం చేసుకున్నారు. బంధాలు ఎప్పుడూ గొప్పవే మనం బలహీన పడనంతవరకూ,

   Delete
 7. nenu ee post chadavaledu intha pedda post raayadaaniki meekuna opikaku veyyi namaskaaralu peduthunna samayam dorakanne thappaka chaduvutanu.

  ReplyDelete
 8. thanooj gaaroo, chadive opika leni meeru opiggaa comment pettinanduku meeku rendu vele prathinamaskaaraalu. chadava galigithe abhipraayam cheppandi.

  ReplyDelete
 9. ఫాతిమా గారు.. కధ సూపర్ అండీ...
  చిన్నప్పటి తుంటరి చేష్టలు అన్నీ గుర్తుచేసారు..
  చాలా బాగుంది...

  ReplyDelete
 10. సాయి గారూ, కథ కొంచం పెద్దగా అయింది ఎంతో బిజీగా ఉంది కుడా నా బ్లాగ్ దర్శించే మీకు ధన్యవాదాలు. మీకున్న సాహిత్యాభిలాష ప్రశంసనీయం.

  ReplyDelete
 11. మేమందరం వెళ్ళినప్పుడు మా చెల్లి వాళ్ళ హజ్బండ్ మా అల్లరిమూకకి దొరకకుండా తన రివాల్వర్ దాచుకోవటం గుర్తొచ్చిందండీ..
  మీ కధ చదువుతుంటే..
  మేమంతా ఒక చోట చేరితే అచ్చం ఇలాగే వుంటుంది పరిస్థితి తిరిగి రాబోయే సరికి :)

  ReplyDelete
 12. అమ్మో రాజీ గారూ, అయితే మీరు అల్లరి అమ్మాయి అన్నమాట. చూసారా నా కథ వల్లా ఎంతమంది అల్లరి బైట పడుతుందో. కథ చదివిన మీకు థాంక్స్.

  ReplyDelete
 13. ఇంట్లో వంటరితనానికి అలవాటుపడి మరో మనిషి పోడ గిట్టకుండా పోతున్న ధోరణి గురించి మీ శైలిలో వివరించారు. ముగింపు ఆలోచింపచేసేలా వుంది ఫాతిమా గారూ..

  ReplyDelete
 14. nijame jyothigaaroo meerannadi manam ontarigaa undataaniki alavaatu padaamu.

  ReplyDelete
 15. చాలా బాగా అనుబంధాల తీపిని రుచి చూపించారు ఫాతిమ గారూ...ఈ పోస్ట్ లో.
  చదవటం కాస్త ఆలశ్యం అయింది.
  అల్లరి చేసే పిల్లలని విసుక్కునే పెద్దవాళ్ళు చదివితీరవలసిన పోస్ట్.
  స్వతంత్రంగా ఇంట్లో మసలుకునే బంధువులు అతి తక్కువమంది ఉంటారు ఎవరికైనా...వాళ్ళెళ్ళాక ఇంట్లో ఏం కరువయ్యిందో తెలిసొస్తుంది...
  చాలా నచ్చింది ఈ పోస్ట్ మాకైతే...

  ReplyDelete
  Replies
  1. చిన్ని ఆశగారూ, మీ వ్యాఖ, మీ అబిప్రాయం విలువైనవే ఆలస్యం అయినా పర్వాలేదు.
   కథ ఓపిగ్గా చదివారు ఇంత క్రితం మీరే అన్నారు కథ కొంచం పెంచి ఇంకా కొన్ని విషయాలు సరదాగా రాయాల్సింది అని,
   అందుకే ఈ కథ కొంచం పెద్దగా రాయటానికి ధైర్యం చేసాను. నచ్చినందుకు థాంక్స్

   Delete
 16. ఈ కథ చదవడం లేటయింది. పని ఒత్తిడి వల్ల అంటే
  ఆత్మ వంచన అవుతుందేమో!?
  అనుబంధాలకు మనుషులు తమ చుట్టూ గీసుకున్న పరిధుల
  చక్రాలు చిన్నవవడం ముఖ్య కారణం.
  పరిధులు విస్తరించాలి!
  మమతలు పరిమళించాలి!!
  కథ రాయడంలో ఒడుపు కనబడుతోంది!
  శుభాకాంక్షలు.

  ReplyDelete
 17. సర్, మీకు కథ చదివే సమయం ఉండదని తెలుసు,
  అయినా సమయం వెచ్చించి చదివినందుకు ధన్యవాదాలు.
  నిజమే అనుబంధాలు గిరిగీసుకున్న చక్రంలో ఉండిపోతున్నాయి.
  ఏదైనా దూరమయినపుడే తెలిసేది మనం ఏమి కోల్పోయామో.
  అతి కొద్దిమంది మాత్రమె మనసుకు దగ్గర అవుతారు. అది వారు దూరమయినప్పుడే తెలిసివస్తుంది.
  అదే నేను ఈ కథలో చెప్పింది.

  ReplyDelete
 18. నిజమే అనుబంధాలన్నీ మరలా వస్తాయి....కథ సూపర్..నేను భలే అల్లరి చేస్తా లేండీ..చిన్నప్పుడూ అంతే ...ఇప్పుడూ అంతే...:-)
  భలే నచ్చింది

  ReplyDelete
 19. సీత గారూ, కథ చదివిన మీకు ధన్యవాదాలు
  మీరు అల్లరిపిల్ల అనుకోలేదు పాపం ఎక్కడున్నాడో రామయ్య మీ అల్లరి ఎలా భారిస్తాడో (సరదాగా అన్నాను )

  ReplyDelete
  Replies
  1. హహ..నాకు కూడా తెలీదండీ ;).సరదాగా అన్నా అది నిజమేనండీ...నా అల్లరి భరించలేక సీత లేకుండానే అడవులకెళ్ళిపోతాడేమో ;) హహా...మీ పోస్ట్ తో ఎవరెవరు అల్లరి బాగా చేస్తారో అందరూ బయటపడిపోయారు గా.....:-)

   Delete