Pages

Thursday, 26 July 2012

ఆరోజు వస్తుంది





ఆరోజు వస్తుంది

గుడిసె  కూలిపోయింది చట్టాల పరిదిలో,
బ్రతుకు  కొట్టుకు పోతుంది కష్టాల  వరదలో,

కాపురం తరువు కిందికి మారింది,
కాచుకున్న గంజి కుక్కల పాలైంది.

సగం చీర చంటిదానికి  ఉయ్యాలైంది,
చిరుగుల  సగం సిగ్గును  దాచలేకుంది,

తిన్న ఒక్కముద్డా  ఆకలిని ఆర్పనన్నది,
ఉన్న  ఒక్క దుప్పటీ చలిని  ఆపలేనన్నది, 

అంటుకునే  రోగాలకు అంతమే లేకుంది,
అందనంత ఎత్తులో  ఆరోగ్యం శ్రీ  కారం చుట్టింది, 

గుడ్డిదీపం చమురులేక  కొండెక్కింది,
దుడ్డు బియ్యానికి  కార్డ్  కరువయ్యింది,

చంటోడికి  చదువంటే బయంగానే ఉంది,
అయినా వెళ్తాడు, మద్యాన్న బువ్వ ఇంకా ఉంది.

కాలం మార్పును తెస్తుంది
జనజీవనం  మార్పు కోరుకుంటుంది,
యువత  తమ దారి మార్చుకుంటుంది.

కాయం కత్తుల కంబళి  కప్పుకుంటుంది,
కాలం నిప్పుల కుంపటి  నెత్తికెత్తు కుంటుంది,

కలాన్నీ, మడాన్నీ, వెనక్కి తిప్పవద్దన్నది,
కులాన్నీ, మతాన్నీ ఎంచి  చూపొద్దన్నది .

వేయి గొడ్లు మింగిన రాబందును  వేటాడి  బంధిస్తుంది,
పట్టుకొని  పొట్ట కోసి  నీళ్ళు రాని  పంపుకింద  కడుక్కొమంటుంది.

పొట్ట నింపుకోవడాని పనికొచ్చే పట్టా వస్తుంది,

చట్ట సభలలో బూతుబోమ్మలకు బట్టలేసే రోజు వస్తుంది.

అంగళ్ళలో రత్నాలు అమ్మేరోజు రాకున్నా..,

అందరూ కడుపునిండా అన్నం తినే రోజు వస్తుంది.


                                                                తప్పకుండా వస్తుంది.




29 comments:

  1. రావాలనే ఆశిద్దాం...

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞగారూ వస్తుంది తప్పకుండా. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  2. ఆ రోజు కోసమే ఎదురుచూపులు....:)
    చాలా బాగా రాసారు ఫాతిమా గారూ

    ReplyDelete
    Replies
    1. సీత గారూ, కాలే కడుపులు తిరగబడిన రోజు మార్పు వస్తుంది. కవిత చదివిన మీకు థాంక్స్.

      Delete
  3. అందరూ కడుపునిండా అన్నం తినే రోజు వస్తుంది,తప్పకుండా వస్తుంది.
    చక్కగా రాశారు, అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారూ, అందరూ కడుపునిండా అన్నం తినే రోజు వస్తే దిగంబర కవిత్వం పట్టు బట్టలు కట్టుకుంటుంది. ఆకలి కేకలని వినిపించిన కవిత్వమది.

      Delete
  4. ఆ రోజు తప్పక వస్తుంది ఫాతిమా గారు...
    చాలా చాలా బాగా రాసారండీ...

    ReplyDelete
    Replies
    1. సాయి గారూ, ఆశిద్దాం మార్పు కోసం మన వంతు ప్రయత్నిద్దాం.

      Delete
  5. ఉందిలే మంచీ కాలం ముందూ ముందూనా...
    అందరూ సుఖపడాలీ..నందనందానా...
    అనీ ఆరోజు కోసం ఎదురు చూద్దాం ఫాతిమా గారూ!
    కవితలో పేదల దీనత్వాన్ని బాగా చూపారు...
    ఆశాభావంతో ముగించారు...
    అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ,మంచి కాలం ఉందొ లేదో తెలీదు కానీ, మండే కాలం మాత్రం ఉంది( కడుపు మండే కాలం) మండే ధరలు,చాలీ చాలని బతుకులు, తిరగ బడితే తప్ప ఆకలి తీరదేమో అనే ఆలోచన వస్తుంది, అలా కాకుండా అందరూ కడుపునిండా అన్నం తినగాలగాలని ఆశిద్దాం

      Delete
  6. Replies
    1. సర్, మీ ప్రశంసకు అర్హురాలనైతే సంతోషమే. నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.

      Delete
  7. వస్తుంది అన్న ఆశే బ్రతికిస్తుంది!
    Nice inspiring post.

    ReplyDelete
    Replies
    1. ప్రేరణగారూ, కవిత చదివిన మీకు ధన్యవాదాలు. మార్పు రావాలి ఆకలి బాద ఎవరికీ ఉండ కూడదు.

      Delete
  8. రవాలి,రావాలని కోరిక.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా సర్ , మీకు కవిత చదివినందుకు థాంక్స్.

      Delete
  9. ఆ రోజు తప్పక రావాలని అందరిలాగే ఆశిద్దాము ఫాతిమా గారు.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా వెన్నెల గారూ, మీకు కవిత చదివినందుకు థాంక్స్.

      Delete
  10. అబ్బ, ఏమి రాసారు.
    మీ కలానికి సలాం.
    శ్రీ కారం అనేది ప్రారంభానికి,
    పాజిటివ్ ఉద్దేశం చూపడానికి గాను వాడుతారు.
    మీరు విలక్షణంగా వాడారు.
    నిస్సహాయిలకు అందకుండా, నెత్తి మీద 'జెల్లా
    కొట్టి వెక్కిరిస్తున్న భావన కలిగంచారు.
    చాలా చాలా బాగా మీ ఆవేదనను, ఆశావాదాన్ని వ్యక్తీకరించారు.
    శ్రీ శ్రీ మళ్ళీ గుర్తుకి వచ్చారు.

    ReplyDelete
    Replies
    1. సర్, ఎంత మాట మీ ప్రశంసలు నన్ను ఇంకా రాయమని ప్రోత్సహిస్తున్నాయి. అస్సలు నేను రాయగలనా అనే సందేహం ఉండేది, మా వారు బ్లాగ్ ఓపెన్ చేయించి నా అక్షరాలను మీఅందరి ముందు ఉంచే అదృష్టం కల్పించారు. అందుకు ఈ సందర్బంగా వారికి అక్షర రూపేణ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా భావాలను వివిధ పత్రికలలో అచ్చు రూపంలో చూసుకునేలా మీరు ప్రోత్సహించారు. ఏదో చెప్పాలన్న తపనా, ఆవేదనా ఇలా అక్షర రూపం దాలుస్తుంది, నా రాతలను చదివి నా ప్రతి పోస్ట్ కు వ్యాఖ్య పెట్టె నా బ్లాగ్ మిత్రులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

      Delete
  11. కాయం కత్తుల కంబళి కప్పుకుంటుంది,
    కాలం నిప్పుల కుంపటి నెత్తికెత్తు కుంటుంది,
    మంచి కవితా పద ప్రయోగం.ఇక కవిత చాలా ఆర్ద్రంగా సాగింది.సరళమైన పదాలతో కొత్త శైలిలో రచించారు.60సం:స్వాతంత్ర్యం పేద వాడి ఆకలి తీర్చలేక పోయింది.గోదాముల్లో బియ్యం ముక్కి పోతున్నాయి. మంచి కవిత.

    ReplyDelete
    Replies
    1. సర్, ధాన్యం ముక్కి పోయినా పరవాలేదు పథకాలు దెబ్బ తినకూడదు. విందు వినోదాలలో పారవేసే ఆహార పదార్దాలు కొన్ని ఆకలి కేకలను ఆపవచ్చు. కానీ ఈ మద్య కొందరు పుణ్యాత్ములు ఆ పదార్దాలను అనాదలకు పంచుతున్నారని విని సంతోషించాను. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  12. కాలం మార్పును తెస్తుంది
    జనజీవనం మార్పు కోరుకుంటుంది,
    యువత తమ దారి మార్చుకుంటుంది.


    కాయం కత్తుల కంబళి కప్పుకుంటుంది,
    కాలం నిప్పుల కుంపటి నెత్తికెత్తు కుంటుంది,

    చాలా బాగా చెప్పారండీ...మీ ఆశావహ ముగింపు నచ్చింది..కానీ దానికి పెద్ద యుద్ధమే అవసరం మరి..కాదంటారా??

    ReplyDelete
  13. వర్మాజీ, మీరన్నది నిజమే పెద్ద యుద్దమే వస్తుంది. కాలే కడుపులు, నీడ లేని బ్రతుకులు వెనుక ఉన్న మహమ్మారి బీదతనం, తమ బిడ్డలకు ఆకలిని కానుకగా ఇవ్వాలని ఏ జీవి కోరుకుంటుంది చెప్పండి. వీరి ఆకలికి ధనవంతులు కారణం అనటం తప్పు.ప్రతి యుద్ధం వెనుకా, తురుగుబాటు వెనుకా మండే గుండెలే కాక , కాలే కడుపులు కూడా ఉన్నాయి. కనీసం పట్టెడు అన్నం కుడా దొరకని అన్నపూర్ణమ్మ బిడ్డలం మనం.

    ReplyDelete
  14. మంచిని ఆకాంక్షిస్తూ చాలా బాగా రాశారండీ..
    కవిత చాలా బాగుంది!!

    ReplyDelete
  15. రాజీగారూ, ధన్యవాదాలు కవిత చదివిన మీకు.

    ReplyDelete
  16. చాలా బాగా రాశారు ఫాతిమగారూ....ఆశావాదం.
    కూడూ, గుడ్డా, నీడా కరువైన పేద జీవనం పోయే నాడు......ఆరోజు తప్పకుండా వస్తుంది.

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశగారూ, మీ వ్యాఖ కోసం ఎదురుచూసాను. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ పెట్టలేదు. సర్ ధన్యవాదాలు మీ ప్రశంసకు.

      Delete
    2. థ్యాంక్స్ అండీ, అవును కొత్త పోస్ట్ పెట్తలేదు. వచ్చే వారం పెట్టటానికి ప్రయత్నిస్తాము.

      Delete