ఈ మధ్య జులై తొమ్మిదిన గౌహతిలో ఒక విద్యార్థిని పట్ల జరిగిన సంఘటనపై అంతర్జాతీయంగా పెద్ద దుమారమే లేచింది. గౌరవ్ జ్యోతి నియోగ్ అనే ఆ జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. "Teem Annaa" కమిటీ మెంబర్ "అఖిల్ గోగోయ్" అతన్ని ఆ సంఘటనలో జనాన్ని ఆ అమ్మాయి పై ఉసిగొల్పినందుకు దోషిగా నిర్దారించడం వల్ల ఆ జర్నలిస్టు తన ఉద్యోగానికి రాజీనామా చేసారు.
మేధావులు, జర్నలిస్టులు "అఖిల్ గోగోయ్" బాధ్యతపై వారి వారి అభిప్రాయాలను వ్యక్తీకరించారు. కొంతమంది ఆ ఫోటో జర్నలిస్టుని సమర్థించారు, మరికొంతమంది విమర్శించారు.
అసోం ముఖ్య మంత్రితో సహా ఏంతో మంది ఆ గౌహతి జర్నలిస్టు యొక్క నీతి బాధ్యతపై విమర్శలు సందిస్తుండగా, మన దేశ ప్రముఖ ఫోటో జర్నలిస్టు అయిన రఘు రాయ్ లాంటి కొంత మంది గౌహతి జర్నలిస్టును సమర్థించారు. ఆయన అభిప్రాయం ఏమిటంటే, సంఘటన ఎంతటి దుర్భాగ్యకరమైనదైనా జర్నలిస్టు బాధ్యత కేవలం దాన్ని రిపోర్ట్ చేయడమే.
చర్చ ఏమిటంటే, జర్నలిస్టులు అందరిలాగా ethical standards పాటించాలా అవసరం లేదా అన్నది.
ఇక్కడ ఒక సంఘటన ఉదహరించాలి. 1994 లో Kevin Carter అనే ప్రపంచ ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు సూడాన్ లో ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉన్న కరువు ప్రాంతం లో ఓ ఫోటో తీశాడు.
Kevin Carter |
దుర్భర ఆకలితో దాహంతో ఉన్న ఓ బాలిక ఓ కిలో మీటర్ దూరంలో ఉన్న UN food camp వైపు పాకుతూ వెళ్తుంటుంది. ఓ రాబందు ఆ బాలిక చనిపోయాక పీక్కు తినడానికి దగ్గరలో వేచి చూస్తూ ఉంది. Kevin Carter ఆ చిత్రాన్ని కెమెరా లో బంధించాడు. తర్వాత ఆ ఫోటోకు అమెరికాలో పాత్రికేయులకు కొలంబియా విశ్వ విద్యాలయం వారు ఇచ్చే అత్యుత్తమ "Pulitzer prize" దొరికింది.
ఆ తర్వాత ఒక కాన్ఫరెన్సు లో, ఫోటోలో ఉన్న ఆ బాలికకు ఏం జరిగింది, మీరు ఆ బాలిక కోసం ఏమైనా సహాయం చేశారా అని అడిగారు. ఫోటో తీసిన తర్వాత ఆ బాలికకు ఏమీ సహాయం చేయనందుకు ఆయన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శకు, నిరసనకు గురి అయ్యారు. ఆ సంఘటనతో తీవ్రంగా కలత చెందిన ఆయన రెండేళ్ళ తర్వాత ఆత్మ హత్య చేసుకున్నారు.
ప్రెస్సు వాళ్లయినా, విలేఖరులయినా, ఫోటో జర్నలిస్టులయినా, సామాన్యులు అయినా ethical standards ఉండాలా అవసరం లేదా అన్నది ఎంతవరకు చర్హనీయాంశం. అది వారి వారి విజ్ఞతకు వదిలేయాలి.
good feeling.
ReplyDeleteThank you sir,
Deleteమానవత్వం మనిషికి ఉండాలా లేదా అంటే ఎవరేమి చెబుతారు?ప్రతి వ్యక్తీ తను చేయగలిగింది చేయటానికి అటువంటి సందర్భం లో ప్రయత్నించాలి.అతను పోలీసు లకు ఫోన్ చేసాను అని చెబుతున్నాడు.
ReplyDeleteThank you for your response Ravisekhar garu.
Deleteపవిత్ర రంజాన్ మాస ఆరంభమైన సందర్భాన్ని పురస్క్రించుకుని, మీకు
ReplyDeleteఅల్లా తగిన మానసిక శారీరిక శక్తి ఇవ్వాలని, మీరిరువురు మరిన్ని మంచి పనులు చేయాలని కాంక్షిస్తున్నాను.
మీ కుటుంబానికి మంచి జరగాలని కోరుతున్నాను.
Sir,
Deleteరంజాన్ మాస శుభారంభ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు.
జర్నలిసం పేరుతో మానవత్వం మంటకలిసిపోయింది, పోతోంది, పోతుంది.
ReplyDeleteThank you for response sir,
Deleteహాట్ హాట్ గా వార్తలు, ఆసక్తి కర కథనాలు అందిస్తూ క్రెడిట్ కోసం పని చేయడం తప్ప మాకు సామాజిక భాద్యత లేదు అనుకునే పాత్రికేయులను మనమేమి అనలేం. సమాజంలో ఉన్న మిగతా అందరూ చోద్యం చూస్తున్నారు.నేను ఇంకా రిపోర్ట్ చేసాను అంటే అది అతని భాద్యత. అంతవరకే అయిపోయిందని చెప్పినట్లా..?
ReplyDeleteక్రింద చిత్రం గురించి వివరణ ఆసక్తి కరంగా ఉంది.Kevin Carter అతని ఆత్మహత్య లో అర్ధం ఉంది.
అవార్డ్ లు,రివార్దులే కాదు..మానవీయ స్పందన ఉండాలి అని చెప్పడమే కదా!
గుడ్ పోస్ట్..ఐ లైక్ ఇన్ థిస్ పోస్ట్..
వనజ గారూ, స్పందనకు, పోస్ట్ నచ్చినందుకు కృతఙ్ఞతలు.
DeleteKevin Carter గురించీ ఆయన తీసిన ఆ photograph గురించీ తెలిసింది.
ReplyDeleteజర్నలిస్ట్ల్ లూ నైతిక బాధ్యత పాటిస్తే మంచిది, కానీ అన్నీ అందరూ అన్ని సందర్భాల్లో పాటించలేరు అన్నదీ Kevin మరణంతో అర్ధం అవుతుంది.
చిన్ని ఆశ గారూ, స్పందనకు కృతఙ్ఞతలు.
Deleteజర్నలిస్టు అంతే ఒక బాధ్యత. సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రవర్తించాలి. అంతేకాని తన ఎదుట ప్రాణాలు పోతుంటే, అవార్డు కోసం కెమెరాలో బంధించడం కాదని పాత్రికేయులు గుర్తించాలి. మంచి పోస్ట్ పాతిమ గారు!
ReplyDeleteనాగేంద్ర గారూ, మీరు చెప్పింది అక్షరాలా నిజం. మానవత్వం అనేది అన్ని అవార్డులను మించింది. మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteandaru abhiprayalu anni rakaluga cheppaka nenu cheppadaaniki emi migalaledu anduke nishkramisthunnam .sri sri thanooj varlam hahaha
ReplyDeletethanooj gaaroo, pl. nishkraminchakani chaduvutoo undandi ade chaalu. naa blog dharsinchina meeku thanks
ReplyDeleteకెవిన్ కార్టర్ తీసిన ఫొటోకి పులిట్జర్ ప్రైజ్ వచ్చింది అంటే అది వారి నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండే ఇచ్చి ఉంటారు, కదా!
ReplyDeleteఇకపోతే ఆయన ఫొటో తీసిన తర్వాత అవార్డు పొందినట్లే విమర్శలు కూడా విన్నాడు. అది లోకం తీరు. ఆయన పరిస్థితిని గువాహటి లోని గౌరవ్ జ్యోతి నియోగ్ పరిస్థితి వేరు వేరు. కెవిన్ ఆ రాబందుని సీన్ లోకి ఆహ్వానించలేదు. రెచ్చగొట్టలేదు.
ఇక ఆయన ఆత్మహత్య విచారకరం. ఆయన సూయిసైడ్ నోట్ లో ఇలా ఉందట.
""I am depressed ... without phone ... money for rent ... money for child support ... money for debts ... money!!! ... I am haunted by the vivid memories of killings and corpses and anger and pain ... of starving or wounded children, of trigger-happy madmen, often police, of killer executioners ... I have gone to join Ken [recently deceased colleague Ken Oosterbroek] if I am that lucky."
మీరన్నట్లు కెవిన్ కార్టర్ సంఘటన వేరు గౌరవ్ జ్యోతి నియోగ్ సంఘటన వేరు. అయితే కెవిన్ కార్టర్ ఆ రాబందును ఆహ్వానించక పోయినా, ఫోటో బాగా రావడానికి రాబందు ఆ బాలికకు బాగా దగ్గరికి వచ్చే వరకూ దాదాపు అర గంట వరకు వేచి ఉండి ఫోటో తీసుకున్నాడేగానీ, ఆకలితో దప్పికతో ఓ కిలోమీటరు దూరంలో ఉన్న రిహాబిలెషన్ వరకు పాకుతూ వెళ్తున్న ఆ బాలికకు అక్కడికి చేరడానికి అయినా సహాయం చేయాలేదు అన్నది ఒక అభిప్రాయం. చాలా మంది అడిగారు ఆ బాలిక ఫీడింగ్ సెంటర్ చేరుకుందా అని. ఏది ఏమైనా సూడాన్ లోని దయనీయ పరిస్థితులు, శవాలు, బాధలు, ఆకలిచావులు అన్నీ ఆయను క్రుంగ దీసి డిప్రెషన్ కు లోనయ్యేలా చేసాయి. ఫలితంగా ఆయన ఆత్మ హత్య చేసుకున్నారు. బ్రతుకులోని బాధ సంతోషాన్ని జయించింది అంటూ రాసుకున్నారు ఆయన.
ReplyDeleteగౌరవ్ జ్యోతి నియోగ్ విషయంలో కూడా విమర్శలతో పాటూ, ఆయన వీడియో ఇన్వెస్టిగేషన్ కు తోడ్పడింది అనే సానుభూతి చూపించారు. పోలీసు విచారణలో తేలిన అసలు సంగతి ఏమిటంటే గౌరవ్ జ్యోతి నియోగ్ కేవలం వీడియో తీయలేదు, ఆ సంఘటనకు కారకులలో ఒకడిగా ఉన్నారు. మీరన్నట్లు రెండు సంఘటనలకు సామీప్యం ఏమీ లేదు. ఏ సంఘటనలో అయినా ఎక్కడయినా ఏ రంగంలో అయినా నైతిక విలువల అవసరం గురించి ప్రస్తావించాను. మీ విలువైన అభిప్రాయానికి ధన్యవాదాలు.
జర్నలిస్టు అంతే ఒక బాధ్యత. సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రవర్తించాలి. అంతేకాని తన ఎదుట ప్రాణాలు పోతుంటే, అవార్డు కోసం కెమెరాలో బంధించడం కాదని పాత్రికేయులు గుర్తించాలి. మంచి పోస్ట్ పాతిమ గారు!...
ReplyDeleteనేను నాగేంద్ర గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను..
@శ్రీ
మానవత్వపు విలువలు లేనివాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా ఇలాగే ఉంటారు, రాక్షసుల్లా.
ReplyDeleteVery Good post faatima gaaru.
Thank U Vennela garu.
ReplyDeleteThank U Vennela garu.
ReplyDelete