Pages

Saturday, 14 July 2012

చేజారిపోతున్న విలువలుసభ్య సమాజం తలదించుకునే మరో సంఘటన. గౌహతిలో జరిగిందీ  సంఘటన. నడిబజారులో రాష్ట్ర సచివాలయానికి కిలోమీటరు దూరంలో  పదిహేను, ఇరవై మంది గల ఓ అసాంఘిక  గుంపు ఒక  మైనర్ విద్యార్థినిని   వివస్త్రను చేసి హేయంగా, క్రూరంగా చితక బాదుతుంటే  దాన్ని ఓ సినిమాలా నిస్సహాయురాలైన ఆ బాలిక దురవస్థను  తిలకిస్తూ  ఆనందించింది  వందల సంఖ్యలో ఉన్న సభ్య సమాజం. కారణం ఏదైనా కావచ్చు, ఆ బాలిక తప్పేదైనా చేసుండొచ్చు.   


ఎంతో బాధ్యతాయుతమైన మీడియా కూడా ఆ బాలిక రక్షణకు ప్రయత్నించకుండా  ఈ సంఘటను ఓ డాక్యుమెంటరీలా తాపీగా చిత్రీకరించి ఇంటర్నెట్లోకి ఎక్కించింది.  భాద్యతాయుతమైన  అసొం రాష్ట్ర ఒక  ఉన్నతాధికారి గారు కూడా మీడియా సకాలంలో స్పందించి వీడియో కవరేజ్  చేసినందుకు కృతఙ్ఞతలు తెలియజేసారేగానీ, ఆ   కవరేజ్   ఇంటర్నెట్లోకి ఎక్కించినందుకు మీడియాను ఎంతమాత్రం తప్పు పట్టలేదు.  ఆ బాలిక మరియు ఆమె తల్లితండ్రులు ఎంత సాంఘిక అవమానానికి (social stigma) గురిఔతారొ  DGP దొరవారికి ఎంతమాత్రం పట్టలేదు. క్షీణిస్తున్న శాంతి భద్రతలపై ప్రభుత్వానికీ, అధికారులకూ ఏ మాత్రం అవగాహన ఉందో మనకు అవగాహన అవుతోంది.  


జాతీయ నేర రికార్డుల సంస్థ  అంచనా ప్రకారం దేశంలో బాలికలు మరియు స్త్రీల పట్ల నేరాలు ఇతర నేరాలైన  హత్యలు మరియు దొంగతనాలకంటే ఎక్కువ శాతం నమోదుతున్నాయి. వీటిలో చాలా నేరాలకు స్త్రీలే బాధ్యులని చెప్పి మొఖం చాటేస్తూన్నాయి ప్రభుత్వాలూ, శాంతి భద్రతలు పరిరక్షించే సంస్థలు.  ఈమధ్య కాలంలో మన రాష్ట్రంలో జరిగిన  "ఆయేషా" హత్య సంఘటనలో ఎంత న్యాయం జరిగిందో అందరూ చూసారు.ప్రేమించిన నేరానికి "Honour Killing" అంటూ కన్న కూతుర్ని క్రూరంగా పాశవికంగా చంపేసే సంస్కృతి నాగరికులమని చెప్పుకునే ఉత్తర భారత దేశ సమాజంలో ప్రబలుతూ ఉంది. ఇది ఎంత అనాగరికం, అనాగరికమైన  ఆదిమమానవ స్థాయిలోనే ఉందా మన సమాజం.


ఎక్కడుంది స్త్రీలకూ రక్షణ? ఇంట్లో గృహ హింస, స్కూల్లో, హాస్టల్లో, పోలిస్ స్టేషన్లో చివరికి జనసమూహంలో కూడా రక్షణ లేకుండా పోతుంది. దీనికి బాధ్యత ఎవరు. సక్రమంగా పెంపకం చేయని తల్లితండ్రులడా, పబ్బులు, డిస్కోతేక్కుల కల్చరా, సమాజానిడా, ప్రభుత్వానిదా ?


ఈ సంఘటనను విచారిస్తున్న "National Commission of Women" నిందుతులను న్యాయ వ్యవస్థ ముందు నిలబెడుతుందా. చూడాలి.   


ఏది ఏమైనా మార్పు అనేది సమాజపరంగా రావాలి, దాని ప్రారంభం ఇంటినుండి మొదలవ్వాలి.
36 comments:

 1. "ఏది ఏమైనా మార్పు అనేది సమాజపరంగా రావాలి, దాని ప్రారంభం ఇంటినుండి మొదలవ్వాలి".

  నిజమేనండీ..

  ReplyDelete
  Replies
  1. రాజీ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 2. నిజం, నిజం మీరన్నది నిజం!
  మనకి సిగ్గులేదు.
  మీడియా అనేది వ్యాపారమే గాని సమాజ హితం కాదు.
  మనం మెలుకువ తెచ్చుకుని ఇటువంటి వాటిని అరికట్టాలి.
  అశ్లీలత ఇంటర్‌నెట్ లో మన ఊహకు అందనంత పెద్ద వ్యాపారం.
  మనుషుల బలహీనతలతో ప్రభుత్వాలు పెట్టుబడుదారులు ఒకే తీరుగా ఆడుకుంటున్నారు.

  ReplyDelete
  Replies
  1. సర్, చాలా చోట్ల మీ రచనల్లో ఇలాంటి అరాచకాలను ఎండగట్టారు, ఎక్కడ అన్యాయం జరిగినా ముఖ్యంగా స్త్రీల మీద జరిగితే ఎదుర్కునే ఆత్మస్తైర్యం మీ ప్రోత్సాహం వల్ల నాకు లబిస్తుంది. ధన్యవాదాలు

   Delete
 3. నిజమే....ఇలా జరిగినప్పుడంతా సమాజంలో మార్పురావాలని ఏదో చేస్సెయ్యాలని అనుకుంటాం సో కాల్డ్ సమాజంలోని మనం తెల్లారితే అంతా మామూలేకదండి! ఎందుకో నాకు ఇలాంటివి చదివినా చూసినా కలిగే ఫీలింగ్ ఇది. మన్నించాలి.

  ReplyDelete
  Replies
  1. పద్మ గారూ ,మీ ఫీలింగ్ నేను అర్ధం చేసుకోగలను,అయితే సమాజంలో మూడు వర్గాల మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు.౧ చెడు చేసేవారు.2 .చెడుతో తమకు ఏమి సంబంధం లేదు అనుకొనేవారు.౩.చెడును ఖండించేవారు,అయితే మనం చేయాల్సింది ఏమిటంటే, మీరన్నట్లు తెల్లారితే అంతా మామూలే కాకుండా ఆ తెల్లరేలోగా ఆలోచింపచేయగలగటం, పద్మ గారూ గాందీ గారి ఒక్కరితో స్వాతంత్ర్యం రాలేదు , ఆయన ప్రేరణతో మేల్కొన్న వారివల్లా వచ్చింది, కలానికి చాలా బలముంది అన్యాన్ని ఎదుర్కునే ప్రయత్నం చేద్దాం చేస్తూనే ఉందాం మార్పు అనివార్యం.

   Delete
 4. ఫాతిమా గారు
  ఇంకా స్పందించాలి .
  కవులు కలం పట్టి ఈ అనాగరిక చర్యల్ని తీవ్రంగా ఖండించాలి
  గుండె మండిన వేళ ప్రతి ఒక్కరు నిరసిస్తేనే కొంతైనా మార్పు సంభవిస్తుంది .
  లేకుంటే ఈ దుర్నార్గం దౌష్ట్యం ప్రబలిపోతుంది

  ReplyDelete
  Replies
  1. సర్, మీ స్పందనకు ధన్యవాదాలు, న్యాయమూర్తులైన మీకు తెలుసు సమాజ రుగ్మతలు వీటిని అరికట్టేందుకు మనవంతుగా చేసి ప్రయత్నమే ఈ పోస్ట్. బ్లాగ్ దర్శించిన మీకు మరో మారు కృతజ్ఞతలు.

   Delete
 5. ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం,సమాజంలోని ప్రజల నడవడిక, ప్రజలను పట్టించుకునే ప్రభుత్వం మంచిగా ఉంటే కొంతయినా మార్పు రావచ్చు. చాలా బాగా రాసారు పాతిమ గారు! కవితలు కేవలం ప్రేమను, అందాన్ని వర్ణించడానికి ఉపయోగపడతాయే తప్ప సమాజానికి ఉపయోగపడవు. ఇలాంటి పోస్ట్ ల వల్ల కొందరికైన కనువిప్పు కలుగుతుంది.

  ReplyDelete
  Replies
  1. నాగేంద్ర గారూ, మీరన్నది నిజమే ఇల్లు,సమాజం,ప్రభుత్వం ఈ మూడింటా మార్పు రావాలి ఆశిద్దాం, ప్రయత్నిద్దాం. మీరిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.

   Delete
 6. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న ఈ (అ)నాగరిక దేశామేనా ప్రపంచ అభివృద్ధి చేందే దేశాల జాబితాన చేరింది, అగ్రరాజ్యంగా ఎదిగే కోవలో....
  సిగ్గు చేటు, అనాగరీక సమాజం...
  మార్పు రావాలి, నెమ్మదిగా, ఇల్లూ, ఊరూ, వాడా...అది రానంతవరకూ ఎదుగుదల లేనట్టే ఎన్నున్నా సున్నానే...
  ఆలోచింపజేసే మీ పోస్ట్ లు కొందరినైనా ఆలోచింపజేస్తే చాలు.

  ReplyDelete
  Replies
  1. చిన్నిఆశ గారూ, కలకంటి కంట కన్నీరోలికితే ఉపద్రవం సంభవిస్తుందనే సంస్కృతి గల మన దేశంలో, పబ్బులు, డిస్కోతేక్కులు, లాంటి పాశ్చాత్య సంస్కృతి ప్రభావం దానిపై పులి మీద పుట్ర లాగ దుర్వినియోగం అవుతున్న ఇంటర్నెట్, ఇవన్నీ కలిపి మన దేశ సంస్కృతినే మార్చే ఉపద్రవం కనిపిస్తుంది. మీరన్నట్లు మార్పు రావాలి. మనమే తేవాలి. స్పందనకు కృతఙ్ఞతలు.

   Delete
 7. నిజమే ఫాతిమా గారూ,
  బాగా రాసారు.మంచి పోస్ట్.
  నాకు తెలిసి మనిషి లో మార్పు మొదలయితే అది చాలా గొప్పగా ఉంటుంది.

  ReplyDelete
  Replies
  1. సీత గారూ, మీరన్నది అక్షరాలా నిజం. మార్పు అన్నది రావాలే గానీ గొప్పగా ఉంటుంది. కానీ ఆ మార్పుకోసమే మనం ప్రయత్నించాలి. టపా చూసినందుకు స్పందించినందుకు కృతఙ్ఞతలు.

   Delete
 8. Meraj jee, Padmarpita Madam’s comment made me to respond on your post. How thought provoking Edward Bulwer-Lytton "The pen is mightier than the sword"

  Beneath the rule of men entirely great,
  The pen is mightier than the sword, Behold.
  The arch-enchanters wand! — itself a nothing! —
  But taking sorcery from the master-hand
  To paralyse the Cæsars, and to strike.

  This is the power of pen, with this power, Governments have changed, Rulers have ruined, recent example in AP history is social activist Swamy Ramananda Teertha who led the Hyderabad liberation struggle, during the reign of the last Nizam with the power of pen. He fought the Nizam, and created a revolutionary movement which helped Hyderabad to integrate with the Indian union in 1948. The integration was successful after Police Action.

  I respect Padmarpita Madam’s feeling, but this “MONOTONY” will definitely takes change one day or other. Here I want to give an example of Mahatma Gandhiji, when he was travelling in a train. The person sitting in his front happened to spit out of the window, but it falls on the pane. Mahatma wiped it out. The same thing happened thrice and Mahatma did the same thing. At last the person realizes and wiped the spit his own. Definitely our patient efforts reap fruitful results one day.

  As regards to rescue of outraged, Prophet Mahummad said, if you are strong enough, go to the rescue of the outraged. If you are not strong enough, try to convince and pacify orally. If you are weak and fragile at least you pray for the help of outraged.

  I invite your attention to the comment of Sri Ganga Sir. The media is indeed commercial but not social friendly. In bygone days, trade of War weapons and Drugs were considered to be the highest profitable. In the changed scenario, Porn and indecency is the unimaginable profitable trade. Let us save our younger generations from the evil of internet and use it for prosperity.

  Padmarpita Madam, it is suffice to have a pain for sufferers. It is like a dormant volcano, it will burst one day when it ignited.
  Thank U.

  ReplyDelete
  Replies
  1. Shaik Mohammed Ismail Sir...thanks for your valuable and hopeful reply.

   Delete
  2. Isamil Garu, Thank you very much for your response and informative comment.

   Delete
 9. ఇంతకంటే ఘోరమైన అత్యాచారాలు మన దేశంలో ఏదో మూల ప్రతిరోజూ జరుగుతూనే ఉంటాయి.
  కానీ అవేమీ మీడియాకి పట్టవు. ఎందుకంటే వాటిలో గ్లామరు, మసాలా ఉండదు.
  మహానగరాల్లో జరిగినవో, పేజ్ 3 వ్యక్తులమీద జరిగినవో, HYPE చేసి చూపిస్తారు.
  ఈ పేజ్ 3 వ్యక్తులు కూడా సోషల్ నెట్‌వర్కులు, మీడియాకి ఎక్కి రాధ్ధాంతం చేస్తారు.
  జెస్సికా లాల్, అరుషి తల్వార్ లాంటి కేసులకి జాతీయ మీడియా ఇచ్చిన ప్రాధాన్యం ఆయేషా హత్య కేసుకి ఎందుకు ఇవ్వలేదు?

  ReplyDelete
 10. ఆవేదన నిండిన ఈ మీ పోస్ట్ .. ఆలోచింప జేస్తుంది. ప్రతి ఒక్కరు ఇలాటి సంఘటనల పట్ల స్పందించాలి. ప్రతి ఒక్కరు సమూహంలో వారే కాదా! మనకి జరగలేదని నిర్లక్ష్యంగా ఊరుకుంటామా!? పేద వారింటి పిల్ల అయినా..పేజ్ 3 కల్చర్ అయినా జరిగినది అవమానకర సంఘటనే కదా!
  తల్లిదండ్రుల ఉదాసీనత , పిల్లల నిర్లక్ష్య దోరణి మితి మీరి తీసుకుంటున్న స్వేచ్చ .. వ్యవస్థ లో లోపాలు అన్నీ కలగలపి ..ఇలాటివి జరగడానికి దోహదం చేస్తున్నాయి.
  ఆలోచనతో..ఆగిపోకూడదు ఆచనరణలో ఆవగింజంత ప్రగతి కనిపించినా హర్షణీయమే!!
  గుడ్ పోస్ట్ ..కీప్ ఇట్ అప్ ..మేడం!

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ, నా పోస్ట్ సున్నితమైన మిమ్మల్ని తప్పకుండా కదిలిస్తుంది నాకు తెలుసు ఇకపోతే మీరన్నది నిజం, తల్లితండ్రుల ఉదాసీనత వెనుక సమాజానికి జవాబుదారీ కావటానికి వెనుకడుగు వేయటం. అయితే పిల్లలలో నిర్లక్ష్య భావం, పెద్దలఅభిప్రాయానికి విలువ ఇవ్వకపోవటం ఈమధ్య కాలంలో ఎక్కువైంది ఇది ఇంచుమించు అన్ని కుటుంబాలలో పెద్దలు ఎదుర్కుంటూ ఉన్నదే, మీరన్నట్లు ఆచరణలో ఆవగింజంత ప్రగతి కనిపించినా హర్షదాయకమే, మీ స్పందనకు మరో మారు థాంక్స్.

   Delete
 11. బోనగిరి గారూ, బాగా చెప్పారు. commercial media exposure అంతా page 3 వ్యక్తుల పైనే కేంద్రీకృతమై ఉంది. మీరన్నట్లు ఆయేషా కేసులో మీడియా మరియు పోలీసు కూడా అంతంతమాత్రం పాత్ర వహించాయనేది అందరం చూశాము. ఈ మధ్య చూశారుగా, ఇన్నాళ్ళుగా ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులు ఒక్కసారిగా హుక్కా కేంద్రాలపై దాడులు, దీనికి media exposure. దీనికింత పుబ్లిసిటీ అవసరమా? ఇది ప్రభుత్వ hyper activism కాకపోతే ఇంకేమిటి. మీ స్పందనకు, వ్యాఖ్యకు కృతఙ్ఞతలు.

  ReplyDelete
 12. మీరు కూడా ఇదే అంశంపై నాలాగే స్పందించటం coincidence.మీ పోస్ట్ లో చక్కగా విశ్లేషించారు.action కి reaction తక్షణమే ఉండాలి.ఆలోచింపచేసే విధంగా వ్రాసారు.

  ReplyDelete
  Replies
  1. సర్, అందరమూ స్పందించాలి ఎక్కడ అన్యాయం జరిగినా మానవులం అని మానవత్వము ఉండాలనీ గుర్తుచేసుకోవటమే కావాలి.

   Delete
 13. మీ పోస్టులో ఆవేదన కన్పిస్తుంది ఫాతిమా. గారూ..
  నిజంగా సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయం..
  విలువలను కాలరాసే పని అది. తొందరలోనే రియాక్షన్ రావాలి అండీ..

  ReplyDelete
  Replies
  1. సాయి గారూ, తప్పకుండా మార్పు వస్తుంది మీ వంటి యువత చైతన్యవంతులు, వివేకవంతులు కావడం, మీలో ఇలాంటి స్పందన ఉండటం గొప్ప విషయం. పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు'

   Delete
 14. అందరి రక్తం మరిగిపోతుంది ఇలాంటి వార్త విన్నప్పుడు. నాకైతే వెళ్ళి ఆ టెలికాస్ట్ చేసిన వాడి కేంద్రం మీద దాడి చేసి,ముందు ఆ వెధవకి బుద్ది చెప్పాలి.అది ఒక news లా కనిపించిందే కాని మానవత్వం లోపించిన వాది రూపం వాడికి అర్ధం కాలేదు.

  ReplyDelete
  Replies
  1. ఆ ఘటన ను ఆపడం ఆ వీడియో తీసిన విలేకరి(?)చేత కాని పని అయి ఉండచ్చు,
   ఆ వీడియో తీసి, టెలికాస్ట్ చేయడం మూలానే ఇటువంటి పాపపు పనులు సభ్య సమాజానికి తెలిసి, జనాలలో లో చైతన్యం రావడానికి కారణం అవుతోంది. నేరస్తులను గుర్తించడానికి సులువు అవుతోంది.
   టెలికాస్ట్ యాస్ టీస్ గా ఇచ్చారా? అయితే దీనిని ఖండించాలి. ( వీడియో చూడలేదు, న్యూస్ మాత్రం చదివాను)
   ఇక్కడ ఆ అమ్మాయి సమిధ అయ్యింది , బాధాకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తల్లి దండ్రులు, పోలీసు వారు అలర్ట్ అవుతారని నమ్మకం.

   --
   ħ

   Delete
  2. మీరన్నట్లుగా వీడియో కవరేజ్ నేరస్తులను గుర్తించడంలో ఉపయోగపడింది. ఈ సంఘటనను ఉన్నదున్నట్లుగా తీసి దాన్ని ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసారు. ఆ పదిహేనేళ్ళ పిల్లను దాదాపు పది పదిహేను మంది రౌడీలు జుట్టు పట్టుకుని ఈడ్చ్కుంటూ, కొట్టుకుంటూ నానా యాగీ చేసారు. ఎంత క్రూరులయినా ఆ క్లిప్పింగ్ చూస్తె కంట తడి పెట్టకుండా ఉండలేరు. ఆ వీడియోని ఇంటర్నెట్లో అప్ లోడ్ అలా చేయకుండా కేవలం ఇన్వెస్టిగేషన్ కొరకు ఉపయోగించి ఉంటె ఆ బాలికకు ఆమె తల్లితండ్రులకు మానసిక క్షోభ మరియు సాంఘిక అవమానం తప్పేది. పిల్లలు తప్పు చేయడం సహజం. మన పిల్లలయినా, ఎవరి పిల్లలయినా. దుష్టులు, దుర్మార్గులు ఆ బాలికకు ఎంతో అన్యాయం అవమానం, అత్యాచారం చేయనే చేసారు, మీడియా కూడా తన వంతు పాత్ర నిర్వహించింది, ఇంకా ఆ క్లిప్పింగ్ ఇంటర్నెట్లో అలాగే ఉంది. సంఘటనపై మీ స్పందనకు, ఖండనకు కృతఙ్ఞతలు.

   Delete
  3. వెన్నెల గారూ, మీరు చదివే ఉంటారు 1969 లో Mari Punzo రాసిన నవల "God Father". పత్రిక సర్కులేషన్ పెంచడం కోసం మాఫియా సహాయంతో VVIP ల హత్యలు చేయిస్తాడు ఆ పత్రిక యజమాని సంచలన వార్తల కోసం. అప్పటినుంచే ఉంది ఈ మీడియా యొక్క దిగజారుడుతనం. Electronic media వచ్చాక ఈ దిగజారుడుతనం ఇంకా ఎక్కువయ్యింది. మేధావి వర్గం ఎప్పటికప్పుడు ఈ మీడియా యొక్క దిగాజారుడుతనాన్ని ఎండగడుతూ ఉండాలి.

   Delete
 15. మీ ఆవేదన ధర్మాగ్రహంతో ఏకీభవిస్తున్నా...సంఘటనలు జరిగినప్పుడు స్పందించి మరల ఎవరి ముసుగులో వారు దూరిపొయే సమాజం మనది...చివరంటా వాటిని నివారించే కృషి చేయడంలో మనమెప్పుడూ నిస్సహాయులుగానే మిగిలిపోతుంటాం.. ఈ సంధిగ్దావస్థ నుండి బయట పడి మార్పు కొరకు ఆలోచించి అంతా కృషి చేస్తారని ఆశతో...

  ReplyDelete
  Replies
  1. వర్మ గారూ, మీరన్నది నిజమే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆవేశం చెంది తర్వాత మర్చిపోతారు, సర్ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడటమే కావాలి. అందుకోసం అవసరమైన సంస్కృతి, క్రమశిక్షణ ఇంటా, బయటా రావాలి. పిల్లలకి ఎంత స్వేఛ్చ అవసరమో అంతే దొరకాలి. తల్లిదండ్రులూ, టీచర్స్ ఈ విషయంలో ప్రదమ పాత్ర వహించాలి. వర్మాజీ మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.

   Delete
 16. manavatvanni marachi potunnaru alochanaatmakam ga vundi mi tapaa..!!

  ReplyDelete
  Replies
  1. dhanyavaadaalandee mee sahakaaraaaniki blog darshinchina meeku kruthagnathalu.

   Delete
  2. వెన్నెల గారూ, మీ ఆవేశం అర్ధవంతమే, కానీ అసమర్ధత అన్యాయాన్ని అడ్డుకోలేని అక్కడున్న ప్రతి ఒక్కరిదీ. విపరీత మైన స్వేచ్చనిచ్చిన తల్లిదండ్రులది. మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 17. ఫాతిమా గారూ!
  చాలా కాలం క్రితం గౌహతి ట్రైన్ లోనే...
  వివాహిత సామూహిక బలాత్కారం...
  ఎక్కడ పడితే అక్కడే...రోజుకి స్త్రీ పై అత్యాచారం వార్త లేని దినపత్రిక
  వెదకటం అంటే...అసాధ్యమైన విషయం...
  ఇలాంటి సంఘటనలు జరిగినది వీడియో తీయడం కంటే..వారిని రక్షించడమే
  ఆ సమయంలో మీడియా కర్తవ్యమ్ అంటాను నేనైతే...
  Shaik mohammed ismail గారు చెప్పినదాంట్లో చాలా వాస్తవాలున్నాయి...
  మీరు సరైన విషయాన్ని చర్చకి తీసుకొని వచ్చారు...
  @శ్రీ

  ReplyDelete
 18. శ్రీ గారూ, మీ స్పందనకు కృతజ్ఞతలు, మీరు మీడియా వారు అయిఉండి కూడా సరిగా అర్ధం చేసుకున్నందుకు. ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతున్నా ఇంకా ప్రజలలో చైతన్యం రావటం లేదు. ఆశిద్దాం మార్పు వస్తుందని.

  ReplyDelete