మదిచింతన
ఏవో తలపులు తల నిండా,
ఏవో జ్ఞాపకాలు హ్రుదినిండా,
ఏటిఒడ్డున ఇసుక మేటపై ఎవరి పేరో రాస్తూ..,
గరిక చివర మంచుబిందువులను చిదిమేస్తూ..,
రాలుపూలను రెల్లుగడ్డితో కుట్టు కుంటూ..,
రావి ఆకుల గలగలలను వింటూ..,
మనసారా నవ్వుకుంటూ.., తనివితీరా ఏడ్చుకుంటూ..,
కుందేళ్ళతో పందెం వేసుకుంటూ.., లేగదూడలతో పరిగెడుతూ..,
నీటికోలనులో ఎవరిదా రూపం? లేఎండలో ఎవరితో సన్నిహితం?
పరుగిడి, ఎగబడి, తెగబడి, విరగబడి, అలసిపోయి చతికిల బడితే...ఎవరిదా చిరునవ్వు?
వినిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది, వినిపిస్తూనే ఉంది.
ఆకలి లేదు, భయంలేదు, రాత్రో, పగలో, అర్ధం కావటం లేదు. మదిలో అలజడి జ్ఞాపకాల ఒరవడి.
కొన్ని కంఠాలు అరుస్తూ, కొన్ని కర్రలు ఎగస్తూ..
ఎర్రటి రక్తం ఉప్పగా నాలుకను తడుపుతూ..,
వెచ్చటి ఊపిరి మెల్లగా..ఊగుతూ..,
మూతలు పడుతున్నకళ్ళముందు ఓ రూపం కదలుతుంటే..,
ఒరిగిపోతూ, ఓడిపోతూ. కులాన్నీ, ధనాన్నీ, దౌర్జన్యా న్నీ గెలిపిస్తూ.
నేనన్న ఒకే పలుకు సఖీ..... "సె - లవ్".
ఇప్పుడు నాదో లోకం, భయంలేదు, బాధా లేదు, బాధ్యత లేదు, భావంలేదు, చీకూలేదు, చింతాలేదు, జ్ఞాపకంలేదు, జ్ఞానంలేదు, ఆధారంలేదు, ఆర్జనాలేదు, ఆశాలేదు,ఆవేశంలేదు, ఆకలీలేదు, తలపూలేదు, వలపూలేదు, అసలు నీవే లేవు.
మదికీ,మస్తిష్కానికి పొంతనలేదు, అసలు నిను పొందలేదే
అనే చింతనే లేదు.
ధన్యుణ్ణి అయ్యాను .....నీ ప్రేమను పొంది.
విముక్తుణ్ణి అయ్యాను ..... ఈ బంధాల నుండి.
చాలా చాలా బాగుంది ఫాతిమా గారు...కానీ "సె - లవ్" అన్నపదమే బాధించింది..
ReplyDeleteచదివినందుకు నేనూ ధన్యుణ్ణి అయ్యాను..
సాయి గారూ, నా కవిత ధన్యమైంది మీకు నచ్చినందుకు. ప్రేమ చాలా సార్లు తను ఓడిపోతూ కులాన్నీ, ధనానీ, మతాన్నీ, గెలిపిస్తూ ఉంటుంది. మరోమారు ధన్యవాదాలు మీకు.
ReplyDeleteఉండి ఉండి మీరు కూడా మనసు మీద మనసు పారేసుకున్నట్లుంది చూస్తే!
ReplyDeleteసర్, "మనసు గతి ఇంతే, మనసున్న మనిషికీ సుకం లేదంటే " అన్నారో కవి. ఏమి చేద్దాం అప్పుడప్పుడూ అలా పడేసుకుంటూ ఉంటాను. బ్లాగ్ దర్శించిన మీకు థాంక్స్.
Deleteప్రేమను అతని మనసు లో గెలిపించి వాస్తవంగా ఓడించారు.వేదనాభరితం.
ReplyDeleteసర్, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
Deleteఫాతిమ గారూ,
ReplyDeleteకళ్ళల్లో నీళ్ళు తెప్పించారు.
మరణంలోనూ తృప్తిగా అనుకోగల ఆఖరి మాటలు
"ధన్యుణ్ణి అయ్యాను.....నీ ప్రేమను పొంది"
చాలా కాలానికి ప్రేమపై రాసిన మీ కవిత అన్యాయానికి బలయిపోయిన ఓ హృదయ వేదనని వినిపించింది.
మీరు ఎంచుకున్న చిత్రమూ ఆ భావానికి అద్దం పట్టింది.
హృదయాన్ని పట్టి బంధించిన కర్కశం
తప్పదు ఆ ధాటికి దానికి మరణం
అయినా అది ఎన్నటికీ అమరం...
చాలా బాగా రాశారండీ!
చిన్ని ఆశా గారూ, కవిత లోని భావం విశ్లేషించిన మీకు ధన్యవాదాలు. ఇలా ఎన్ని ప్రేమలు సమాజానికి బయపడి సమాది అవుతున్నాయో.. చిత్రకారునికి నేను ఎన్నుకున్న చిత్రం నచ్చటం సంతోషదాయకం.
Deleteహృదయం పై దాడిని .. చాలా వేదనగా ఆవిష్కరించారు. బాగుంది అన లేను. పునరుక్తి తో కవితకి బలం చేకూర్చారు.
ReplyDeleteధన్యుణ్ణి అయ్యాను .....నీ ప్రేమను పొంది.
విముక్తుణ్ణి అయ్యాను ..... ఈ బంధాల నుండి.
చాలా బాగా చెప్పారు
వనజ గారూ, మీకు నచ్చితే బాగున్నట్లే. మీ విశ్లేషణ బాగుంటుంది, మీకు ధన్యవాదాలు.
Deleteఆకలి లేదు, భయంలేదు,
ReplyDeleteరాత్రో, పగలో, అర్ధం కావటం లేదు.
మదిలో అలజడి జ్ఞాపకాల ఒరవడి.
చాలా చక్కగా రాశారండి,అభినందనలు.
భాస్కర్ గారూ, కవిత నచ్చినందుకు థాంక్స్. నా ప్రతి పోస్ట్ వెనుకా మీ ప్రోత్సాహం ఉండటం అదృష్టం అనుకుంటున్నాను.
Deleteధన్యుణ్ణి అయ్యాను .....నీ ప్రేమను పొంది.
ReplyDeleteవిముక్తుణ్ణి అయ్యాను ..... ఈ బంధాల నుండి.
చాలా బాగుంది మీ కవిత...చిత్రం
అబినందనలు మీకు..
"సె-లవ్" ...అని ఎన్ని కథలు జరిగినా...
"SAY-LOVE" అనేది మానలేము ఫాతిమా గారూ!...
THAT IS THE POWER OF LOVE...
@శ్రీ
శ్రీ గారూ, కవిత లోని " సే..లవ్" విశదీకరించారు. నిజమే ప్రేమకి అంత గొప్ప పవర్ ఉంది. మీ స్పందనకు థాంక్స్.
Deleteఈ కవిత చదివితే నాకు మీరు రాసిన మరో కవిత గుర్తుకొచ్చింది.
ReplyDeleteఏల ఈ భే(ఖే)ధం అని రాసారు. చక్కగా ఉన్న అమ్మాయి బొమ్మ కూడా వేసారు. అయితే అమ్మాయి పాపం దిగులుగా ఉంది.
ఈ కవిత లో ఉన్న ప్రేమికుడికి ఆ అమ్మాయిని ముడిపెడితే ఎలా ఉంటుందా అని ఆలోచన వచ్చింది.
కవిత బాగుంది. పదాల అమరిక పై మీకున్న అధికారం మరోసారి కనిపించింది.
సర్, నా కవితలు సమయం వెచ్చించి చదవటమే నాకు సంతోషదాయకం అనుకుంటాను నేను, కానీ మీరు నా పాత కవిత గుర్తుంచుకొని ఇప్పటి కవితతో పోల్చటం నిజంగా మీకున్న సాహితిఅభిలాషను తెలియజేస్తుంది. నన్ను ప్రోత్సహించి నేనికా రాయటానికి స్పూర్తినిచ్చిన మీకు ధన్యవాదాలు.
ReplyDeleteవేదనా భరితం గా రాసారండీ...:-(
ReplyDeleteప్రేమ నిజమయినదయితే ఎప్పటికీ ఓడీపోదు .:)
సీత గారూ, ఎక్కడికెళ్ళారు మీ వ్యాఖ్య కోసమే చూస్తున్నా, కవిత నచ్చినందుకు థాంక్స్. నిజమే ప్రేమ ఓడిపోదు.
ReplyDeleteఏమిటో లేండి...అబ్బా బిజీ బిజీ జీవితమండీ..!!
Deleteరావాలనిఉన్నా రాలేకపోయా ...అందుకే ఆలస్యం...!:)
ఎట్టకేలకు వచ్చేసాననుకోండీ :)
vastaaru naaku telusu meekunna saahityabhilasha
Delete"ధన్యుణ్ణి అయ్యాను ... నీ ప్రేమను పొంది
ReplyDeleteవిముక్తుణ్ణి అయ్యాను ...ఈ బంధాల నుండి"
మీరు ప్రేమ కవితలు కూడా చాలా చక్కగా రాస్తారండీ! అభినందనలు.
నాగేంద్ర గారూ, కవిత చదివి మీ స్పందన తెలియ జేసిన మీకు ధన్యవాదాలు.
Delete" ఇప్పుడు నాదో లోకం, భయంలేదు, బాధా లేదు, బాధ్యత లేదు, భావంలేదు, చీకూలేదు, చింతాలేదు, జ్ఞాపకంలేదు, జ్ఞానంలేదు, ఆధారంలేదు, ఆర్జనాలేదు, ఆశాలేదు,ఆవేశంలేదు, ఆకలీలేదు, తలపూలేదు, వలపూలేదు, అసలు నీవే లేవు" మీ ఈ ప్రేమలేఖ ఉద్విగ్నంగానూ ఉన్నతంగానూ ఉంది ఫాతిమాగారూ...చదివించారు. అభినందనలు
ReplyDeleteవాసుదేవ్ గారూ, చాలా కాలం తర్వాత బ్లాగ్ దర్శించారు, మీరు నేను రాసిన హాస్య కథలను చాలా ప్రశంసించేవారు. థాంక్స్ అండీ.
Deleteకవిత బాగుంది ఫాతిమా గారు.
ReplyDeletedhanyavaadaalu vennelagaroo
ReplyDelete