Pages

Friday 8 June 2012

మె(మి)సేజ్




లంచ్  అవర్లో  నేను  సిగరెట్  కాలుస్తూ  కారిడార్లో  పచార్లు  చేస్తున్నా, మా సెక్షన్  నుండి చిన్నగా పాట వినిపిస్తుంది. "దేహమును ప్రేమించుమన్నా.. లంచ్ అన్నది లాగించుమన్నా" మా డిస్పాచ్ క్లర్కు గురుమూర్తి  గొంతులో సొంత బాణీ లో రూపుదిద్దు  కున్న  పాట అది.

మా సెక్షన్ లో పెళ్లి  కానిది గురుమూర్తి ఒక్కనికే, దేహాన్ని ఇష్టంగా పెంచుకుంటూ, ఆకలి లేకున్నా తింటూ, అమిరికా  ప్రసిడెంటు  బుష్  లాంటి వారి కళ్ళలో  పడి దేశానికీ  చెడ్డపేరు తేవటం  ఇష్టం లేక  ఒక్కడే  రూమ్  లో కూర్చుని  లాగించేస్తూ ఉంటాడు.


అసలు చీకూ చింతా  ఈ గురుడికి ఉండవా అనుకుంటారు  అందరూ.  కానీ  ఇతన్ని కూడా ఓ చింత  చింపి వేస్తూ ఉందట ఈ మద్య, అదేమిటంటే పెళ్లి చేసుకుందామంటే  పిల్ల దొరక్క  పోవటం. పెళ్లి చూపుల్లో ఇతగాడు  లాగించే  పలహారాల    ఖర్చు   పెళ్లి     ఖర్చుని    మించి    పోతుందని    ఆడపిల్లల  తండ్రుల  గుండెలు  లబ్బో  డబ్బో   అంటున్నాయట.   ఇతను   తింటున్న  పలహారాల   పళ్ళెం   లాగేసుకుని  ఇతన్ని   ఇంటిబైటకి   తోసేస్తున్నారట అదీ  ఇతన్ని చింపేసే  సమస్య.

*   *   *

ఈ మద్య మా గురుమూర్తి  ముసి ముసిగా నవ్వుకుంటూ  మరుగుదొడ్ల  పక్కనా, డస్ట్ బిన్నుల  వెనుకా  నక్కి  సెల్లు లోకి చూసుకుంటూ  దర్శనం  ఇస్తున్నాడు.  ఇంతకీ కథ  ఏమిటని  నిలదీస్తే  మెలికలు  తిరిగాడు . 

చక్కగా సాగదీసి  నిగ్గదీసి అడిగితే  "మిస్సేజి "  అన్నాడు సిగ్గుపడిపోతూ.  అదీ ఓ అమ్మాయి  నుండి వచ్చిందట. ఇంకేముందీ  గురుడు ఇక్కడ నిల్లు  సెల్లులో  ఫిల్లు. గురుమూర్తి  అన్ని పనులూ మానేశాడు .ఎప్పుడు చూసినా  సెల్లు లోకి   సొల్లు కారుస్తూ  ఏ  మూలనో  నక్కి ఉంటున్నాడు.
                             
*   *    *

ఓ  రోజు  మా ఆఫీసు  క్యాంటీన్లో  కాఫీ  తాగుదామని  వెళ్లి కూర్చున్నాను.  కాసేపటికి  కొందరు ఆడవాళ్ళు హోం గార్డ్స్    అనుకుంటా బిల బిల  మంటూ వచ్చి నావెనుక  కుర్చీలలో  కూర్చున్నారు. వీరంతానాతో ఏదో సందర్భంలో ఎప్పుడో ఓ సారి  మాట్లాడిన వారే. వారిలో  సన్నగా ఉన్నావిడ గట్టిగా  నవ్వుతూ  "ఓయ్  గజనీ ఇక ఆపవే  తల్లీ   ఆ సెల్లు గోల  ముందు కాఫీ తాగు  అన్నది.  సెల్లు పట్టుకున్న  గజినీ   టేబుల్ మీద గట్టిగా బాదుతూ గలగలా  నవ్వింది. నవ్వులా..అవి కావు ..ఇనుపగోళాలు  అన్నట్లుగా  ఇనుపగోళాలను  తలపై దొర్లించినట్లుగా  ఉంది ఆ నవ్వు.   సభ్యత  కాకున్నా వెనక్కి తిరిగి చూసాను,  ఖాకీ పాంటు, ఖాకిషర్టు  టక్చేసుకుని నడుముకి  ఓ చున్ని  కట్టుకుని,  చేతికి సిల్వర్ కడియం, టోపికింద  చిన్న ముడి, ఏ  యాంగిల్లో  చూసినా  ఆడలక్షణాలే  కనిపించటం లేదు.

మళ్ళి  సేల్లులోకి  చూసి  గట్టిగా  నవ్వుతూ.. " ఏయ్  గోమతీ  నీ వెయిట్  ఎంతని అడిగాడే మెసేజిలో" అన్నది.  " ఊ .. ఓ నలబై  అని ఇచ్చెయ్యి  అని సలహా  ఇచ్చింది  గోమతి" మరీ  సగానికంటే   తక్కువ  చెప్తే బాగుండదేమో    సందేహం వెలిబుచ్చింది గజనీ. " పోనిద్దూ  తనివ్వలేదా  సిక్సుపాక్  గాడిననీ ".. చురక  అంటించింది  గోమతి.

మళ్ళీ  అందరూ  గొల్లున  నవ్వారు. సిక్సు  ప్యాక్  అట   ఈ మద్య   ప్రతిఒక్కడికీ  అలా చెప్పుకోవటం  ప్యాషను  అయిపొయింది.  ప్యామిలీ ప్యాక్ లా  ఉంటాడు. అన్నది గోమతి  మళ్ళి  అందరూ  గొల్లున  నవ్వారు.

"ఏయ్   మీకు తెలుసా  ఇది  దీని పేరు గజనీ అని చెప్పకుండా  ఘజల్  అని చెప్పింది,  ఇక గురుడు  గురుమూర్తి అని చెప్పకుండా  గౌరవ్  అని చెప్పాడట" వారిలో ఒకావిడ  నవ్వుతూ  చెప్పింది. వింటున్న  నాకు ఒక్కసారిగా  షాక్  తగిలినట్లు   అనిపించింది. అయితే  వీళ్ళు  ఇప్పటివరకూ  మాట్లాడుకున్నది  మా గురుమూర్తి  గురించా, పాపం  ఎంత మురిసి  పోతున్నాడో  ఆ మెసేజీలు  చూసుకుని.

"పోనీ  నిజం   చెప్పేద్దామా".. జాలిగా  అన్నది గోమతి.  నాకూ  అదే  మంచిది అనిపించింది.  " నోర్ముయ్యి  వంద  మేస్సేజిలు   అబద్దమైనవైనా  సృష్టించి  ఓ  జంటను  కలపాలి"  గద్దించింది  మరో ఆవిడ.  "ఏయ్  ఎలాగో మమ్మలని  కలపండే  మా పెళ్ళిలో  మీ అందరికీ  సెల్లు ఫోనులు  కానుకగా ఇస్తాము." ప్రాదేయపడింది   ఘజల్. "లేకుంటే  జీవితాంతం  ఇలా  మేస్సేజులు  ఇచ్చుకుంటూ  పోతే   జీవితాన్నేమిస్సయి  పోతానే తల్లీ "మళ్ళీప్రాదేయ పడింది   ఘజల్, గురుమూర్తి  ఊహించే ఘజల్ కి    ఈ    గజానికీ  పోలికే  లేదు.  ఇకపోతే  వాడూ  కొంత అబద్దం చెప్పాడు  కనుక  దేవుడు  వీళ్ళ ఇద్దరినీ  మన్నించి  వీడి మేస్సేజులు  మిస్ యూజు   కాకుండా, ఈ మిస్ గారు మిస్  కాకుండా  శుభమే  జరగాలని  ఆశిద్దాం.

                                         * * *
        

26 comments:

  1. >>>దేహమును ప్రేమించుమన్నా.. లంచ్ అన్నది లాగించుమన్నా<<<
    గురు మూర్తి జిందాబాద్... :)))

    పాపం గురుమూర్తి, గజల్ ని ఎలా భరిస్తాడో? నిజం చెప్పేస్తా నేను.... :))

    ReplyDelete
    Replies
    1. Thank you Harshaa. నిజం చెప్పి పెళ్లి ఆపకయ్యా బాబూ, వంద మెసేజీలు ఇచ్చి అయినా ఒక పెళ్లి చేయమన్నారు. ఘజని గురుమూర్తి జంట దీవనలు తీసుకో, నీ పెళ్లి కూడా త్వరగా అవుతుంది. :D

      Delete
  2. శుభం...దొందూ దొందే అన్నమాట.. నేను ఆశీర్వదించేసాను జంటని. మీరు భలే రాసారండి ఈ టపా ఫాతిమ గారు.

    ReplyDelete
    Replies
    1. Madam, మా జంట తరపున మీ ఆశీర్వాదానికి ధన్యవాదాలు. నా బ్లాగ్ ఫాలో చేసినందుకు కృతఙ్ఞతలు.

      Delete
  3. అహహ దొందూ దొందే!!!అటువంటి పరిచయాలలాగే ఉంటాయి కదా!!!

    ReplyDelete
  4. గురుమూర్తి ఉరఫ్ గౌరవ్, గజనీ ఉరఫ్ ఘజల్ మేస్సేజులు మిస్ కాకుండా ఒక్కటవ్వాలని ఆశిస్తూ...రాసిన టపా చాలా ఫన్నీగా ఉంది. చదువుతుంటే మండు వేసవిలో తోలకరిజల్లులు కురిసినట్టుంది పాతిమ గారు!

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారూ, మీ స్పందనకు, ఘజని గురుమూర్తి జంటకు మీ ఆశీర్వాదానికి కృతఙ్ఞతలు. Thank you.

      Delete
  5. saradaga unna chaala nijalunnai andi, mee kathalo.
    nice.

    ReplyDelete
  6. హాస్యాన్ని పండించేందుకు మీరెంచుకున్న భాష, సెల్లుచుట్టూ తిరుగుతున్న నేటి సామాజిక పరిస్థితి అలరించింది. చిన్న టపాలవల్ల ఓ ఎడ్వాంటేజీ-- రీడబిలిటీ.ఆపకుండా చదివేయడం.అభినందనలు ఫాతిమాజీ

    ReplyDelete
  7. ధరణికి భారము తగదని ,
    గురుమూర్తికి మల్లె తినుట కూడదటంచున్ ,
    'సరదాలో సందేశం '
    విరియించెను 'ఫాతిమాజి' విఙ్ఞత తోడన్ .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. Sir, అరుదెంచిరి గురువర్యులు మా బ్లాగు ఇంటన్
      అభినందించిరి కవిత చూడగన్ ,
      సంతసమొందేన్ తన భాగ్యమునకున్ ,
      ఫాతిమా ,, రోజంతయున్ ,
      సార్, తప్పులుంటే మన్నించాలి , మీలా రాయలేకున్నా, అలా రాయాలనే ఇష్టాన్ని వ్యక్త పరిచాను అంతే . మీ ప్రశంసకు ధన్యవాదాలు.

      Delete
  8. వాసుదేవ్ జీ , మీ ప్రశంసకు ధన్యవాదాలు . నా బ్లాగ్ చూసి ప్రోత్సాహాన్ని ఇస్తున్న మీకు నా కృతజ్ఞతలు .

    ReplyDelete
  9. హాస్యాన్ని పండించడంలోను మీ దారి అద్భుతం అని నిరూపించారు. మీ నుంచి మరిన్ని ఆహ్లాదకరమైన కథానికలు రావాలని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. సార్, మీ స్పందనకు ధన్యవాదాలు. మరింత మెరుగ్గా రాసేందుకు ప్రయత్నిస్తాను .

      Delete
  10. హహహ్హ.. బాగుందండీ.. ;)

    ReplyDelete
    Replies
    1. రాజ్ కుమార్ గారూ, కథ నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  11. ఫాతిమా గారూ
    మీ వర్ణన చాలా చాలా బాగుంది.......
    హాస్యం గా ,ఆలోచింపచేసేలా ఉంది అండీ....!!

    ReplyDelete
  12. సీత గారూ, మీకు నా కథ నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లాగ్ మీద సీత కన్ను వేసినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  13. వనజగారూ, ధన్యవాదాలు, మీ కామెంట్ కోసం ఎదురుచూస్తున్నాను , కథ నచ్చినందుకు సంతోషం

    ReplyDelete
  14. హహ..... భలే..
    చాలా చక్కగా ఉంది పాతిమా గారు....

    ReplyDelete
  15. సాయి గారూ, ధన్యవాదాలు. బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  16. కరకు కత్తుల,వాడి బాకుల పదాల పరదాలనుంచి...
    జాలువారిన నవ్వుల జల్లు...
    బాగుందండీ!...:-)...:-)
    @శ్రీ

    ReplyDelete
  17. శ్రీ గారూ, చాల కాలం తర్వాత మీ ప్రశంస అందుకున్నాను. ఏమన్నరూ..?కరకు కత్తులూ , వాడి భాకులా ? యుద్దనికీ, పంటకోయడామికీ, వాడేది కత్తులే కదండీ, ఏది ఎలా ఉన్నా మీ ప్రశంసకు ధన్యవాదాలు.

    ReplyDelete