Pages

Tuesday 17 July 2012

లాంగ్ ఫేసు






లాంగ్ ఫేసు

ఈమధ్య నా మీద ఓ గురుతర భాద్యత వచ్చిపడింది, అదేమిటంటే నేను టీచర్ ని కనుక మా కాలనీ ప్రసిడెంటు గారైన అరుంధతమ్మకు ఇంగ్లిష్ నేర్పాలి,, తప్పదు. అదీ ఎలాగంటే ఆమె అనర్గళంగా మాట్లాడగలిగేలా, అస్సలు ఆమెకి ఆమె పుట్టి ఇన్నాళ్ళ తర్వాత ఈ బుద్ది ఎందుకు పుట్టిందా అని ఆరా తీయగా నిన్న పక్కింటి వారిని న్యూస్ పేపర్ అడిగితే మా పేపర్ మీరు చదివేది కాదులే ఇంగ్లిష్ పేపర్ అన్నారట, అంతే అరుంధతమ్మకు అరికాలి మంట నెత్తికెక్కింది, ఏది ఏమైనా నా నెత్తికి చుట్టుకుంది.నేను వెళ్లేసరికి అసహనంగా అటూ,,ఇటూ తిరుగుతూ నన్ను చూసి ఆదరంగా ఆహ్వానించింది. పనివాళ్ళు అందరూ అమ్మగారి కొత్త అభ్యాసాన్ని ఆసక్తిగా తిలకించటానికి రడీగా ఉన్నారు. "ఇదిగో ఎలా నేర్పుతావో నాకు తెలీదు ఓ వారం లోగా నేను ఇంగ్లిష్ మాట్లాడాల, ముఖ్యంగా మా పక్కింటి ఎభ్రాసి దాన్ని ఇంగిలీషులో దులిపెయ్యాల" ఖంగుమన్నది అరుంధతమ్మగొంతు. మీకు త్వరగా నేర్పిస్తానండీ (నేర్పక చస్తానా!!) అన్నాను, ఏమో ఏమి చేస్తావో ఏమిటో ఇప్పటికే ఆలస్యం అయింది ప్రతి  వెదవ నాతో ఇంగ్లిష్ మాట్లాడుతున్నాడు అందరికీ బుద్ది చెప్పాలి ". అంటూ పనిమనిషి తెచ్చిన వేడి పాలు తీసుకోమన్నది "అబ్బే వద్దండీ " నేను నంగినంగిగా అన్నాను " పర్వాలేదు తాగు,, అవి మా గేదేపాలు, మీరు తాగే నీళ్ళ పాలు కావు, కోపమూ,, అసహనమూ, వెటకారమూ కలిపి గర్జించింది. మొదలుపెడదామా అన్నది, వచ్చిన పని మరచిపోయి పాలు తాగుతున్న నాతో, మేము మొదలుపెట్టే సమయానికి ఆమె పెనిమిటి అనుకుంటా, పొట్టిగా పొట్టతో ఉన్నాడు తాయిలం దొంగిలించిన కుర్రాడు అమ్మ చూడకుండా జారుకుంటున్నట్లు గోడవారగా నక్కుతూ,, నక్కుతూ,, వెళ్తున్నాడు. "ఏమిటా పాకుడు , ఎక్కడికి ఊరేగుతున్నారు?" గద్దించింది అరుంధతమ్మ. " ఆం.. ఏమీ లేదు.. అమ్మవారూ ..నసిగారాయన. "ఏమిటి అమ్మగారా మీ అమ్మగాని వస్తుందా, మొన్ననేగా వెళ్ళింది? "విసుగ్గా ఉందామె స్వరం. "అయ్యో లేదు ఆరూ అమ్మవారి దగ్గరికి ఈరోజు ఏదో ప్రోగ్రాము ఉందంటేనూ.. మళ్ళీ నసుగుడు, "ఏం వళ్ళు తిమ్మిరిగా ఉందా అక్కడకి వెళ్ళేప్పుడు నేను తీసుకెళ్తాను గానీ కాసేపు ఇంట్లో యాడవండి" ఒక్కసారి ఉరిమి చూసేసరికి ఆయనగారు ఇంట్లోకి వెళ్లారు బహుశా ఏడవటానికేమో.



                                                                 * * *

నువ్వేంటి పాలు తాగిన పిల్లిలా కూర్చున్నావు అన్నట్లున్న ఆమె చూపుకి భయం వేసి "నేను A.B.C.D రాసిస్తాను మీరు ప్రాక్టీస్ చేయండి" అన్నాను. "అక్కర్లేదు అవన్నీ న్యూసు పేపర్లో ఉంటాయి, ముందు చదవటం నేర్పించు చాలు" కోపంగా అన్నది అరుంధతమ్మ . దిమ్మతిరిగిమైండు బ్లాక్ అయింది పండుగాడు కొట్టినట్లుగా నాకు. "అమ్మా! ఓ పని చేద్దాం ముందు మీరు మాట్లాడటం నేర్చుకోండి తర్వాత ఇంగ్లిష్ చదవటం వస్తుంది " అన్నాను ఎలాగో ఈ ప్రమాదం నుండి బైట పడాలి కదా అనుకుని. " అవును ఇదే బాగుంటుంది, వాళ్ళను ఇంగ్లీష్లో చడా , మడా దులిపేయవచ్చు అప్పటికి కానీ నా మనస్సు కుడట పడదు, ఆయాసపడుతూ నిప్పుల కుంపటి నెత్తికిఎత్తుకున్నట్లు తాండవం మొదలెట్టింది.

ఇక మా చదువుసాగింది ఎలా అనుకున్నరూ ఇదిగో ఇలా ...



"మీరు ఎలా ఉన్నారూ  అని ఆడగాలి  అనుకోండీ .."(నేను పూర్తి  చెయ్యనే లేదు.)
"నీవు నన్ను అడిగేది నాకెందుకు  నేను ఏమి చెప్పాలో  అది నేర్పు .(విసుగ్గ్గా అన్నారు)
"ఐయాం  ఫైన్ థాంక్యు , అంటే నేను బాగున్నాను అని అర్ధం " (చెప్పాను  నేను.)
"నువ్వు బాగుంటే నాకు ఏమి చేసేది ఉంది నేను ఏమి చెప్పాలో  అది నేర్పు" ( ఈసారి కోపం తారాస్తాయి లో ఉంది)
నాకెందుకో  కళ్ళ  ముందు  నక్షత్రాలు తిరుగుతున్నట్లు, చెవుల్లో ఏవో శాభ్దాలు వినిపిస్తున్నాయి  బహుసా  పిచ్చి పట్టేముందు  ఇలాగే ఉంటుంది అనుకుంటా.
"ఏమి పంతులమ్మా నోట మాట లేదు ఏమి  నేరిపిస్తావూ  అన్నారామె, లేని ఓపిక తెచ్చుకొని  మొదలెట్టాను.
"యువర్  శారీ  వెరీ  నైస్  మేడం ,  మీ చీర బాగుంది " అన్నాను ఏమి నేర్పాలో తెలీక.
"అది నువ్వు చెప్పేది ఏముంది  అందరికీ  ఎరుక  నేను ఖరీదైన చీరలే కడతానని." ( చిరాకుగా అన్నారామె)
"ఇదిగో  పంతులమ్మ నీకు  రావటం లేదుగానీ, నేను దర్జాగా ఉపన్యాసం  దంచటం  నేర్పు  ఇంగ్లీషులో, సాయంకాలం  మన కాలనీ  మీటింగ్లో  మాట్లాడుతాను, అన్నారు.
కానీ నేను చెప్పింది ఆమెకు నచ్చక  ఇదిగో ఇలా మాట్లాడారు.
"హల్లో  ఆలు  గుడ్డీవినింగూ  ఆలు కమింగు ఇయరూ .. మై యాపీ, మై వాటు స్పీకు ఆలు టేల్లు  యస్సు యస్సూ, యు టేకు కాపీ , బిస్కుటూ . ఐ యాపీసూ " ఆడంగులంతా  చప్పట్లు కొట్టారు.
నిలువు గుడ్లతో, నోరు ఎల్లబెట్టి  చూస్తున్న నాతో  ఎలాఉంది  నా  లాంగుఫేసు.అన్నారామె.  ఒక్కసారిగా  ఈలోకంలోకి  వచ్చిన నాకు మరో పజిల్  లాంగుఫేసు  అంటే ఏమిటి?
" మీకేమండీ  చక్కగా ఉంటారు అన్నాను నంగి నంగిగా (సిగ్గు పడుతూ  ముద్దు ముద్దుగా  పలకటం)
"నేను బాగానే ఉంటాలే అదిగాదు  నేను అడిగింది నా లాంగుఫేసు  ఎలా ఉందీ అని?"  అడిగారు మళ్ళీ
" మీ ముఖానికి  ముక్కెర అందాన్నిచ్చింది, అన్నాను  కొంచం దైర్యంగా,"
"ఏమిటో  మీకు కొంత  తింగరితనం  ఉన్నట్లుంది, నేను  నా ఇంగ్లిష్  లాంగుఫేసు  గురించి  అడుగుతుంటే   ఏమేమో చెప్తున్నావ్ "  జాలి పడుతూ నా వంక చూసారు.
ఒక్క సారిగా ఐసుదిమ్మ  నెత్తిమీద  పెట్టినట్లుగా  తల దిమ్మగా ఉంది నాకు.  బాప్ రే.. లాంగ్వేజ్ కి వచ్చిన తిప్పలా నేను  సైడు ఫేసు  అనుకున్నా.  " సరే  రోజూ  వచ్చేయండి  ఇద్దరం కలసి  పార్టీస్ (ప్రాక్టీస్) చేసుకుందాం. మీరు నాతో  కోపరైట్  ( కోపరేట్) చేయండి. జీతం ఇస్తాను  నా దగ్గరే  జాబ్  అనుకోండి  అని అభయం ఇచ్చిన అమ్మవారిలా ఫోజు పెట్టారు.


                                                            * * *


అదిగో  ఆరోజునుండీ  ఇలా ఫిక్స్ అయిపోయీ   ఉద్యోగం ఊడగొట్టుకుని ,ఫుల్ టైం  ఈ ఇంగ్లిష్ చానల్ ఈదుతున్నా .. నిఘంటువు  లో  కొత్త పదాలను  చేరుస్తూ  నా లాంగుఫేసు తో  మిమ్మల్ని  త్వరలో  కలుస్తాను.











39 comments:

  1. ఎంత కష్టం వచ్చిందండి మీకు..మీ ఇంగ్లీష్ క్లాస్ కి నేను కూడా రావచ్చా..?

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ, మీకు నేర్పితే మీరు విదేశీయులకి నేర్పరని గ్యారంటీ ఏమిటి, మీరు ఇండియా వచ్చినప్పుడు చూద్దాం లెండి.

      Delete
  2. Ha ha ha :))
    Nenoo vastaaa coaching ki :)

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ పెరటి చెట్టు మందుకు పనికిరాదు అక్క నేర్పితే అస్సలు రాదు.

      Delete
  3. అయ్యయ్యో.. మీకు చాలా కష్టం వచ్చిపడింది అండీ..ప్చ్..
    A B C D లు పేపర్లో ఉంటాయి అనగానే నవ్వొచ్చింది అండీ.
    అన్నట్లు నాకు అసలు ఇంగ్లీషు రాదు అండీ... నాకూ నేర్పిస్తారా? కానీ నాకు ఆ లాంగ్ ఫేసు ఇంగ్లీష్ వద్దు..డిక్షనరీలో already ఉండే పదాలతో నేర్పిస్తే చాలు... నేనూ రావచ్చా ?

    ReplyDelete
    Replies
    1. సాయి బాబూ, డిక్షనరీ లో ఉంటాయి అన్ని అక్షరాలు కొత్తగా నేర్చుకోనేది ఏమిటి. అయినా చూద్దాం ఫీ.. కొంచం ఎక్కువ అవుతుంది.

      Delete
  4. ఏమిటోనమ్మా? ఎంత మీకు ఎంగిలీసు (ఇంగ్లీష్) వస్తే మాత్రం మాలా రాని వాళ్ళంటే ఎకసెక్కాలా? పనిలో పనిగా నాకూ కాస్తో కూస్తో నేర్పిద్దిరూ :):)

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారూ, మీకు నేర్పటం కష్టమే, అందంగా ఉండేవారికి చదువు రాదట. అస్సలు మీకు ముందు తెలుగు నేర్పాలి. ఏమిటో మిమ్మలి ఎలా బాగు చెయ్యాలో ఏమో.

      Delete
  5. హ హా... టీచరమ్మయితే ఇన్ని కష్టాలా?
    ఇంగ్లి పీసు లాంగు ఫేసు లో ఇక రేపట్నుంచి కాలనీ అంతా భలే సందడే అయితే.
    మీరు జాగ్రత్తండోయ్, మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మర్చిపోయి "లాంగు ఫేసు" లో పడి బ్లాగ్ పోస్ట్ లూ అందులో రాసేరు. అర్ధం చేసుకోటానికి మేమూ మీదగ్గర టూసన్ కి రావాలేమో ;)
    బాగుందండీ మీ ఎక్స్పీరిఎన్స్!

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారూ, ఇది నిజంగా జరిగిందే, ఆమె గారు బ్లాగ్ చూడరనే దైర్యంతో రాసాను. ఆమె లాంగుఫేసు అన్నప్పుడు నేను పడ్డ తిప్పలు అంటా ఇంతా కాదు. టీచర్స్ అంటే ఏమనుకున్నారు ? మా స్కూల్ లో కొంత మంది స్లేట్ నిండా బొమ్మలు వేస్తుంటారు ఈ మద్య వదిలేస్తున్నా వాళ్ళు కుడా మీలా మంచి ఆర్టిస్ట్ అవుతారేమో చూద్దాం.

      Delete
  6. అయితే ఓ వారం తరువాత అరుంధతమ్మ గారితో ఉపన్యాసం ఇప్పిస్తారన్నమాట. :)

    ReplyDelete
    Replies
    1. జ్యోతి గారూ, అరుంధతమ్మ తప్పకుండా ఉపన్యాసం దంచుతారు ఇంగ్లిష్ "లాంగుఫేసు " లో.( నా బ్లాగ్ మీద సీత కన్ను వేసిన జోతమ్మా ఇప్పుడు వచ్చినందుకు ధన్యవాదాలు.)

      Delete
  7. ఇంగిలీసు లాంగ్ ఫేసు అరుంధతమ్మ గారికి మాత్రమేనా?
    మాక్కూడా నేర్పిస్తారా మేడం??...:-)))....:-)))
    ఏమిటో గొప్ప కష్టం వచ్చి పడింది మీకు...
    తొందరలో ఆవిడ భాష మీకు వచ్చేస్తుందని ఆశిస్తూ...:-))...:-))
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ, మీకు నేర్పడానికి ఓ కండిషన్ ఉంది. ఏమిటో తెలుసా మీకు డౌట్స్ ఎక్కువ తెలివిగల విద్యార్డులంటే నాకు కొంచం చిరాకు. ( కథ చదివిన మీకు థాంక్స్ )

      Delete
  8. మీ ఇంగ్లీష్ క్లాస్ లో నన్నూ చేర్చుకోండీ! నేనూ ఇంగ్లీష్లో దంచెయ్యాల్ని ఉంది....అమ్మమ్మ...అమ్మకదూ!.

    ReplyDelete
    Replies
    1. నేను ఆల్రెడీ చెప్పాను క్లవర్ స్టూడెంట్స్ అంటే నాకు నచ్చరు మీరూ ఆ కోవకి చెందినా వారే, అది మీ బ్లాగ్ చూస్తె తెలుస్తుంది, ఓకే ,ఓకే మాటాడటం పార్టీస్ చేయండి( అబ్బబ్బ చస్తున్నాను మీ అందరితో.)( కథ చదివిన మీకు ధన్యవాదాలు)

      Delete
  9. అరుంధతమ్మగారితో మీ ఇంగ్లీష్ క్లాస్ కబుర్లు చాలా బాగున్నాయండి.

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారూ, అవి మీకు కబుర్ల లా ఉన్నాయా, ఆ కాస్త సేపు నేను పడ్డ బాద చూడాలి. బతక లేక బడిపంతులు కదండీ.

      Delete
  10. హ,హ బాగా రాసారండి, జాగ్రత్తగా నేర్పండి, ఇంకా చాలా మంది సిద్దంగా వున్నట్టున్నారు.
    best of luck, keep writing.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారూ, మేమందరమూ లాంగుఫేసు నేర్చుకొని కొత్త పోస్ట్స్ పెడతాము, మీరు మాత్రం ఇలాగే స్పందించాలి సరేనా ? (కథ చదివిన మీకు ధన్యవాదాలు)

      Delete
  11. హా..హా...
    అయ్యబాబోయ్...!!
    భలే రాసారు..!!ఫాతిమా గారు...
    మమ్మల్నిలాగే నవ్విస్తూ ఉండండి...:)
    మీకు సాధ్యం అవ్వని పనా అండీ మీరు నేర్పేయగలరు లేండి...
    ప్రయత్నే ఫలి :))
    all the best...!

    ReplyDelete
    Replies
    1. సీతమ్మా, నా మీద ఆ నమ్మకం ఉన్నందుకు ధన్యవాదాలు. త్వరలో వస్తా ఇంకో ఫేసుతో.

      Delete
  12. మీ అరుంధతమ్మ గారి ఫేస్ మాకు కనబడక అది లాంగ్ ఫేసా కాదా అని తెలియలేదు మాకు.
    ఇంగ్లీష్ 'ఛానెల్ ' ఈదడం కూడా చక్కటి పద ప్రయోగం.
    ఇంత కడుపుబ్బ నవ్వించేటట్లు రాయడం నిజంగా ఒక వరం.
    చాలా బాగా రాసారు. ఇంకా రాయండి.
    ఇదికూడా సమాజసేవే నమ్మండి.

    ReplyDelete
    Replies
    1. సర్, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రస్తుతం ఆమెకు నేను ఇంగీషు త్వరగా నేర్పటం లేదని కోపంగా ఉన్నారు, అందుకే ముఖం చూపటం లేదు. నా శైలి నచ్చినందుకు కృతజ్ఞతలు.

      Delete
  13. హలో ఫాతిమా గారూ,
    మీ రచనా శైలి చాలా బాగుంది."పొట్టిగా పొట్టతో ఉన్నాడు"- లాంటివి గమ్మత్తుగా ఉంటున్నాయి. త్రివిక్రం సినిమా డైలాగుల్లా కామెడీ కూడా బాగా పండిస్తున్నారు. Keep going.

    ReplyDelete
    Replies
    1. చీకటి గారూ, కథ నచ్చినందుకు, నా బ్లాగ్ దర్శించినందుకు ధన్యవాదాలు. అయితే నేను కూడా సినిమాకు డైలాగులు రాయొచ్చు అంటారు. ఏ లాంగుఫేసు లో రాయమంటారు ?

      Delete
  14. ఐ థింక్ వాటో వాట్ దిస్ లాంగ్ ఫెస్ వారి సుటబుల్ టు అరుంధతి అమ్మ.....అవిడ కి క్లాసు నేర్పితే నెర్పారు. .. కాని ఇంటర్నెట్ అని ఒకటి వుంది దానిలో ఇలా బ్లాగ్ లు రాస్తారు అని చెప్పకండే....అవిడ అడిగిన కాని మీరు ఇంటర్నేట్ గురుంచి మీకు ఎమి తెలియదు అని చెప్పండి ...

    ReplyDelete
  15. సందీప్ గారూ, అస్సలు చెప్పను ఎందుకో తెలుసా,
    రేపటి నుండి కంప్యూటర్ క్లాసులు తీసుకోమంటారు.
    కథ చదివిన మీకు థాంక్స్.

    ReplyDelete
  16. హ ..హా...బాగుంది టీచర్ గారూ

    ReplyDelete
  17. ఈ పాటి కి మీ అరుంధతమ్మగారి తో స్పీచ్ ఇప్పించేసారా:) బెస్ట్ ఆఫ్ లక్ :)

    ReplyDelete
  18. Inkaa nighantuvulalo kotta padaalu cherande ela saadyam.:) katha chadivina meeku thanks maalaa kumar garu.

    ReplyDelete
  19. శ్రీ ఫాతిమాగారికి,నమస్కారములు.

    మీ బ్లాగ్ పరిచయం ఇదే మొదలు. మీదీ తెనాలి, మాదీ తెనాలీ అన్నట్లు ( మాది గుంటూరు అనుకోండి ), మీదీ సికింద్రాబాదే మాదీ సికింద్రాబాదే!! ( ప్రస్తుతం పర్మెనెంట్ చిరునామా ). తెలుగులో మీరు మాస్టర్స్ చేయటం నాకు ఆశ్చర్యాన్ని, సంతోషాన్నీ కలిగించింది. ఇకపోతే, చిన్న కథ, చాలా హాస్యంగా చెప్పారు.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  20. సర్, నమస్తే. నా బ్లాగ్ కి స్వాగతం మీ అభిమానానికి కృతజ్ఞతలు.
    కథ నచ్చినందుకు ధన్యవాదాలు.
    నా మిగతా కవితలు కూడా చదివి మీ అమూల్య అభిప్రాయం చెప్పగలరని ఆశిస్తున్నాను.
    మీ సమయం వెచ్చించి కథ చదివినందుకు చాలా సంతోషిస్తున్నాను.

    ReplyDelete
  21. This comment has been removed by the author.

    ReplyDelete
  22. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. prameela gaaroo, mee comment choodatam aalayam ayindi. meeru inglish nerpamannaaru thappakundaa kaanee chinna savarana idi long face..:-)

      Delete
  23. language ki లాంగుఫేసు,
    practice ki పార్టీస్,
    co-operate ki కోపరైట్


    nice coining andi

    chaalaa funny gaa undi.
    keep it up .ilaage chaalaa kamedeelu raayaalani kaankshistunnaanu.

    ReplyDelete