Pages

Monday 15 October 2012

అడగకు చిరునామా





   నా గుండె  గుడిని  నీకోసం  వదలి  వెళ్తున్నా.

   వసంతాన్ని నీకైవదలి  శిశిరాన్నై  సాగిపోతున్నా.

   నీ చల్లని  చూపులని కన్నుల్లో దాచుకొని వెళ్తున్నా.

   నీ పాద ముద్రలను ముద్దాడి  వెళ్తున్నా.

   రాలిన పారిజాతాలతో నీ పేరు రాసి వెళ్తున్నా.

  తపననీ, తాపాన్నీ ఇంటిగుమ్మానికి తోరణంగా కట్టి వెళ్తున్నా.

  మదురమైన నీ మాటలను మనస్సులో  నింపుకొని వెళ్తున్నా.

  నా ప్రేమలేఖలను  వాకిటి పరదాలుగా కట్టి వెళ్తున్నా.

  నీవిచ్చిన చిరుకానుక  నీకే అర్పించి వెళ్తున్నా.

  నీ అరచేతిలో ఆరుద్రను  చూసి, మినుగురునై ఎగిరి వెళ్తున్నా.

  నీ నీడను నీకే వదలి నా జాడనే  దాచి వెళ్తున్నా.

  నేనుభవించిన శిక్షను  ప్రతి అక్షరాన అద్ది  నీకంకితమిస్తున్నా. 

 నా చిరునామా నీకిచ్చి,ఇకముందు ఏ  ఉత్త్తరానికై  ఎదురుచూడక   వెళ్తున్నా.



37 comments:

  1. వావ్ బాగుంది...
    చిరునామా తెలిసిందిగా
    ఇంక వేట మొదలుపెడతానుగా:-)

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ, కవిత నచ్చినందుకు సంతోషం.
      మీరు వేట మొదలు పెట్టాల్సిన అక్కరలేదు, మీ అభిమానం వెనక్కి పిలుస్తుంది.
      మీ స్పందనకి ధన్యవాదాలు.

      Delete
  2. నా చిరునామా నీకిచ్చి,తిరిగిరాని ఉత్తరాన్నై వెళ్తున్నా.

    నిజంగా బెదిరింపే! :)

    ReplyDelete
    Replies
    1. సర్, బెదిరింపే అంటారా? ఏమో మరి.
      కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete
  3. నీ నీడను నీకే వదలి నా జాడనే దాచి వెళ్తున్నా.

    నేనుభవించిన శిక్షను ప్రతి అక్షరాన అద్ది నీకంకితమిస్తున్నా.

    నా చిరునామా నీకిచ్చి,తిరిగిరాని ఉత్తరాన్నై వెళ్తున్నా.
    చాలా బాగుంది...

    అభినందనలు...చక్కని విరహ గీతికలా ఉంది మెరాజ్ గారూ!...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు, కవిత విరహగీతికలా ఉంది అన్నారు మెచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  4. ఎంత ప్రేమ, ఎంత అలక,
    మీ కవీతానాయిక ఎవరికైనా నచ్చుతుంది.
    కానీ చిరునామా అడగొద్దని ముందరి కాళ్ళకు
    వేసారు బంధం.
    ఏది ఏమైనా ఏనాటి ఉత్తరాలు, ఏనాటి కార్డులు,
    మా ఇంట్లో ఒక ఊచకు పాత ఉత్తరాలు గుచ్చి ఉండేవి
    అప్పుడప్పుడు వాటిని తీసి చదువుతుంటే ఎంత బాగుండెదో!
    కవిత చదివితే బోలెడు స్మృతులు.
    చాలా బాగా రాసారు.

    ReplyDelete
  5. సర్, నా కవితా నాయిక నచ్చుతుంది అన్నారు సంతోషం.
    కానీ అలక, కోపం, అనేవి ఆడవారి ఆయుదాలు.అవి పనిచేయనప్పుడు బెదిరింపులు.
    కానీ ఇవన్నీ భరించే సహచారుడైతే చెల్లుతాయి. నా కవిత మీ స్మృతులను వేలికితీసినందుకు సంతోషం

    ReplyDelete
    Replies
    1. Sir,నిజమే మీరన్నది ఏనాటి ఉత్తరాలో ఇప్పుడు మచ్చుకైనా కనిపించటం లేదు,
      ఒకవేళ ఎవరైనా రాసిన చదివేవారికి తమ సమయం వృదా అనే భావన.

      Delete
  6. వెళ్ళలేక వెళ్ళలేక వేళుతున్నట్లుగా వుంది. చూస్తూ ఊరుకోక కాస్త ఆపితే బావుంటుందిగా....

    ReplyDelete
    Replies
    1. జ్యోతి గారు, నా నాయికను ఎంతబాగా అర్ధం చేసుకున్నారో తెలుస్తుంది.
      ఆపే మనసు ఆమెతో ఉంటె వెళ్ళే ప్రసక్తే రాదు కదా.:-)
      ధన్యవాదాలు కవిత చదివిన మీకు.

      Delete
  7. "నా చిరునామా నీకిచ్చి,తిరిగిరాని ఉత్తరాన్నై వెళ్తున్నా"

    చిరునామా తెలిసింది కదా వెళ్ళిపోతే వదులుతామా :)

    ReplyDelete
    Replies
    1. రాజీ గారు, ఎక్కడికి వెళ్తారు ఎవరినా మీ లాంటి మంచి మిత్రులను వదులుకొని.:-)
      కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete
  8. అబ్బా! ఎంత బాగుందండి.
    ప్రతి వాక్యము అక్షర ముత్యమే.భావాల సంపదే.

    ReplyDelete
    Replies
    1. జయ గారూ,నా బ్లాగ్ కి స్వాగతం.
      నా భావాలు నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  9. 'అడుగకు చిరునామా ' యని 'అడ్ర సిచ్చి'
    వెళ్ళు 'గడుసరి' నాయికా ! చెల్లు నేమి ?
    ఎందు బోగల వారుద్ర పొందు వీడి ?
    'మిణుగురు'ను పట్టి తెత్తుము మింటి కెగసి .
    -----సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. సర్, మీ వ్యాఖలో ప్రతి అక్షరానా మీ అభిమానం కనిపిస్తుంది.
      నా కవితలో ఈ సారి నేను ఎన్నుకున్న భావం సునిసిత పరిశీలనా శక్తిగల మీకు అర్ధం అవుతుంది .
      నిస్సహాయురాలైన ఓ ప్రేమిక పడే వేదన అది. ఇక్కడ ఆడమనస్సును ఆవిష్కరించే ప్రయత్నం చేసాను,
      కాని సపలీకృతం కాలేకపోయానేమో అనిపించింది. చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete
  10. అందంగా అడ్రస్ చెపితే ఇంకేం అడగం:)

    ReplyDelete
    Replies
    1. సృజన గారూ, అడ్రస్సు చెప్తాను వచ్చేయండి.:-)

      Delete
  11. కవిత చాలా బాగుందండీ.మీ నాయిక తిరిగి రాని ఉత్తరాన్నై వెళ్తున్నా అంటే మా నాయకుడు "నన్ను వదలి నీవు పో లేవులే అదీ నిజము లే" అంటాడు. అంతగా ప్రేమించిన వ్యక్తి అతణ్ణి వదిలి ఎక్కడకు పోతుంది?ఎక్కడకూ పోలేదు. మీరన్నట్లు అది ఒక బెదిరింపే.ఆ విషయం నాయకుడికీ తెలుసు.అది అంతే.

    ReplyDelete
    Replies
    1. గోపాల కృష్ణ గారూ, ఎంత నమ్మకం మీ నాయకుడి మీద.
      నిజమే మీరన్నది అంతగా ప్రేమించిన వ్యక్తిని వదిలి వెళ్ళటం ఆడమనసుకు సాద్యం కాదు, ఒకవేళ వెళితే అది ప్రేమ కాదోమో.(స్వార్దమో,ఆకర్షనో )
      సర్, మీ అభిమానానికి , కవిత మెచ్చిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

      Delete
  12. చాలా బాగుందండి. ఓ ప్రేమిక విరహవేదన చక్కగా అక్షరీకరించారు. అబినందనలు మెరాజ్ గారు.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, కవితకి స్పందించిన మీకు ధన్యవాదాలు.

      Delete
  13. ప్రేమలో వదలి వెళ్ళలేక వెళుతూ హృదయం లో మెదిలే భావాలన్నీ కవిత లో పొందుపరచారు....
    చివరికి...
    నా చిరునామా నీకిచ్చి,తిరిగిరాని ఉత్తరాన్నై వెళ్తున్నా...అంటూ చిరునామా అక్కడే వదలి జవాబు రాని ఉత్తరమై వెళ్ళే మనసు...వాహ్ .... చాలా బాగుంది మెరాజ్ గారూ!

    ReplyDelete
    Replies
    1. చిన్నిఆశ గారూ, మీ వ్యాఖ కోసం చూస్తున్న్నాను.
      నా కవితను మెచ్చిన మీకు ధన్యవాదాలు.

      Delete
  14. కొంపతీసి ఉత్తరం అంటే పోస్ట్ కాదు కదా!?
    ' నా చిరునామా నీకిచ్చి, తిరిగిరాని ఉత్తరాన్నై వెళ్తున్నా.' అనే
    వాక్యం చూస్తే దిగులేస్తుంది.
    మళ్ళీ పోస్ట్ ఉండదా?
    పొరపాటున కూడా అలా చేయకండి.
    ప్లీఈఈఈజ్.

    ReplyDelete
    Replies
    1. సర్, కొంత వరకూ మీ సందేహం నిజమే,
      కానీ మీ అభిమానానికి కృతజ్ఞతలు.

      Delete
  15. అద్భుతం...అడగక్కర్లేదు మీచిరునామా అది మీఅక్షరాల్లో అగుపిస్తోందండి.

    ReplyDelete
    Replies
    1. parimala gaaru, dhanyavaadaalu mee abhimaanaaniki.

      Delete
  16. ఇన్ని మధుర స్మృతులను దాటుకొని వెళ్ళలేరనుకుంటా...చాలా బాగుంది మీ విరహ గీతిక ఫాతిమాజీ...

    ReplyDelete
    Replies
    1. వర్మ గారూ, ఏదైనా భరించగలిగేంత వరకే ,
      విరక్తి అనేది ఆఖరి మజిలీ అది కూడా దాటేసిన స్థితి ప్రసాంతతని ఇస్తుంది.
      అదే నేను ఈ కవితలో చెప్పింది. నచ్చిన మీకు కృతజ్ఞతలు.

      Delete
  17. YemiTO..ilaaTi kavitvamE ekkuvagaa vraastunnaaru!?

    digulEstundi. :(

    ReplyDelete
    Replies
    1. వనజా , మీకు తెలుసు నా కలం చాలా వరకు వేదనను,చింతను, చికాకును చిమ్ముతూ ఉంటుంది.
      "కృష్ణ శాస్త్రి బాద అందరిదీ అయితే, అందరి బాదా శ్రీ.శ్రీ, గారిది " అన్నారు పెద్దలు.
      అన్ని బాధలూ నేను పడుతుంటే, నా బాద చూడలేదు మా వనజ :-)
      థాంక్స్ మీకు.

      Delete
  18. ఫాతిమా గారూ, ఇక్కడ నమ్మకమన్నది నాకు మా నాయకుడి మీద కాదు. నాయకుడికి నాయిక మీద, అమెకు తన పైనున్న ప్రేమ మీద.అందుకే ఆ పాట.ఒకరి పై ఒకరికి నమ్మకం లేని చోట ప్రేమ నిలువదుకదా?

    ReplyDelete
  19. సర్, మీ మాటలో నిజం ఉంది. కానీ ప్రేమ నిలవటానికి నమ్మకమే కాదు, ఇతర పరిస్తితులుకూడా అనుకూలించాలి.
    భార్య మీద నమ్మకము, ప్రేమ ఉండి కూడా ఇతర ఆకర్షణకు లోనై ఆమెను వదులుకొనే సందర్బాలు కో కొల్లలు.(ఇదిప్పుడు మనకు అప్రస్తుతమే సమయం వచ్చిన్దికనుక చెప్పాను ) నేను ఎన్నుకున్న చిన్ని కవితైనా సరే దానివెనుక సమాజ పోకడ ఉంటుందని తెలిసిన వివేకవంతులు మీరు. మరోమారు ధన్యవాదాలు

    ReplyDelete