Pages

Saturday 11 January 2014

ఆడాళ్ళూ....మీకు జోహార్లూ....



         ఆడాళ్ళూ....మీకు   జోహార్లూ....


       గతంలో  తానుపడ్డ  వెతల్ని,

       తిప్పి,తిప్పి చెప్పి తిప్పలు పెడుతుందో  "తలోదరి."

       అయినవాళ్ళ ముందు  అలుసయ్యానని,

       అలుకలు  పోతుందో   "ఇల్లాలు".

       అత్తింటివాళ్ళు ఎంత  అనాగరికులో చెప్పి ,

       అల్లరి  పెడుతుందో "లలన".

       తనను  పుట్టింటికి  పంపలేదని,

       పెచీ  పెడుతుందో  "పడతి".

       కారూ,నగలూ తనకు  తేలేదని,

       కయ్యానికి దిగుతుందో  "కలికి".

       ఆలస్యంగా  ఇల్లు చేరిన భర్తని,

       ఆరడిపెడుతుందో  "ఇంతి".

        ఆఫీసు  స్టెనో తో  మాట్లాడాడని,

        కట్టడి చేస్తుందో "సుదతి".


అమ్మలూ ,తల్లులూ, మీరు చేయాల్సిన  పనులు చాలా ఉన్నాయి ,

భర్తకు చేదోడు వాదోడుగా ఉండండి, మీ వ్యక్తిత్వాన్ని  కాపాడుకోండి. 
అత్తా,మామలను ఆదరించండి,కొడుకులను ఉత్తములుగా తీర్చిదిద్ద్దండి ,
కుమార్తెను ఆదర్శ నారిగా తయారుచేయండి. 
అమ్మగా, ఆలిగా, కోడలిగా,కూతురుగా మీ పాత్ర  చాలా గొప్పది
ఒక  బిడ్డకు జన్మనివ్వటంలో  తన ప్రాణాన్నే పణంగా పెట్టే  స్త్రీ మూర్తికి 
ఈ  అసూయా, ద్వేషాలనువిడనాడటం ,పెద్ద కష్టమేమీ కాదు 
స్త్రీ ఎప్పటికీ పురుషునికి సమానం కాదు...కాదు కానే కాదు.. ఎక్కువే             
చాలా ఎక్కువే.


            (సంక్రాంతి  పర్వదిన సందర్బంగా  బ్లాగ్ మిత్రులందరికీ  నా శుభాకాంక్షలు) 
     
నా సోదరీమణులు  అన్యదా భావించరనే  ఆశతో... మేరాజ్



12 comments:

  1. అబ్బ.. ఏం బలమిచ్చారు , సందేశమిచ్చారు మీరజ్ .
    స్త్రీ ఎప్పటికీ పురుషునికి సమానం కాదు...కాదు కానే కాదు.. ఎక్కువే
    చాలా ఎక్కువే. ఎప్పుడూ అంటే మీరు చెప్పినవన్నీ తప్పకుండా పాటించినప్పుడు....

    ReplyDelete
  2. సకల గుణ సంపద అని స్త్రీ ని అందుకే అన్నారు కదా దీదీ.
    ఒక జీవితంలో ఎన్నో రకాల పాత్రలూ పొశిస్థూ సహిస్తూ తమ మానసిక సమ తుల్యతను అపుడపుడు సరిచేస్కునే క్రమంలోనే తమ గతాన్నీ వర్తమానాన్నీ ఏకరువు పెట్టుకుంటూ ఒకరకంగా ప్రక్షాళన చేస్తున్దనుకోవచ్చు.
    మళ్ళీ తిరిగి సగటు గ్రుహిణిగా తన స్వార్ధమూ చూసుకోవచ్చు చిన్ని చిన్ని కోరికలకోసం మారామూ చెయ్యొచ్చు.
    కాని అదే సమయంలో ఎన్నో సర్దుబాట్లు త్యాగాలు కూడా చేసి తనవారి కోసం అందులోనే తన సంతోషాన్నీ చూసుకుని తృప్తి పడుతుంది.
    ఇక్కడ సమానత్వం అనే ప్రశ్నే ఉద్భవించదు.
    సంసారంలో ఒక మెట్టు కిందకి దిగినట్లుగా భౌతికంగా అనిపించినా తానిచ్చే ఆనందం తనని ఎంతో ఎత్తులో ఉంచుతుంది.
    బాధల్ని వడబోసి సుఖాల్ని పంచుతూ ఆనందించే ఆడది ఎప్పటికీ ఉన్నతురాలే.

    ReplyDelete
  3. నిజం చెప్పారండీ....

    ReplyDelete
  4. శ్రీదేవీ,అనూ, తమ్ముడు జానీ లకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. డైలీ సీరియల్స్ లో మీరు చెప్పిన ఈ క్యారెక్టర్లని కనిపిస్తున్నాయి. దురదృష్టవశాత్తు వాటిని అనుకరించే ఆడవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. నిజానికి ఇగో, అమెచ్యూర్ వల్లే అలాంటి సమస్యలు వస్తాయనుకుంటా. అతివల గురించి కామెంట్ చేయాలంటే
    ఎందుకో చేతులు రావడం లేదు.. మీరాజ్ గారు. ఏది ఏమైనా... మాంగల్య బంధంలో అర్ధం చేసుకునే మనసులు.. సర్దుకుపోయే గుణం.. రెండూ చాలా అవసరమని మీ భావన చెప్తోంది. అందులో చాలా వాస్తవముంది. బాగుందండి...

    ReplyDelete
  6. మరో విషయం కూడా చెప్పాలనుంది మేరాజ్ గారు... భర్త భార్యకి తగిన గౌరవం ఇచ్చినపుడు... ఇలాంటి సమస్యలు కనిపించవు.
    మీరన్నది నిజమే...మా కన్నా అతివలు ఎప్పుడూ ఎక్కువే. బ్రహ్మ తర్వాత, పునఃసృష్టి చేసే భగవత్ స్వరూపిణి స్త్రీ మాత్రమే.
    యత్రనార్యంత పూజ్యంతే... రమంతే తత్ర దేవత. అంతటి స్త్రీలు.. ఇలాంటి చిన్నచిన్న విషయాలను అధిగమిస్తే... నిజంగా వారు దేవతలే...

    ReplyDelete
  7. మహిళ పాత్ర గురించి చక్కగా వివరించారు ఫాతిమా గారు. మంచి పోస్ట్!

    ReplyDelete
  8. నాణానికి రెండు వైపుల్లా... బాధలు పెట్టేది ... బాధలు భరించేది స్త్రీయే కదండీ ! అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ బాధలన్నీ ఆడవారికే ఉంటాయెందుకని !
    భూలోక భారం మోసేది 'భూదేవి' స్త్రీయే కదా !
    లేని నిందల మోసి అడవుల పాలైన ' సీత' స్త్రీయే కదా !
    భర్త ప్రాణాలకై అష్ట కష్టాలు పడ్డ సావిత్రి స్త్రీయే కదా !
    నవమాసాలు మోసి ఓ బిడ్డకు జన్మనిస్తూ పునర్జన్మను నింపుకున్నది స్త్రీయే కదా !

    సృష్టికర్తే ' స్త్రీ' అయినప్పుడు మీరు చెప్పిన ....తలొదరి, ఇల్లాలు , లాలన, పడతి ,కలికి. ఇంతి , సుదతిలు కల్గించే చిలిపి ఇక్కట్లు చిన్నవే కదా

    ఇలా ఎన్నో విభిన్న మైన బాధలు ......
    అయితే మీరు వ్యక్త పరచిన తీరు చాలా బావుంది ఫాతిమా జీ.
    శ్రీపాద

    ReplyDelete
  9. సతీష్ ,నాగేంద్ర గార్లకు ధన్యవాదాలు.

    ReplyDelete
  10. అత్తలు కోడళ్ళు ఆడబడుచులు పర
    స్పరము సహకరించి బ్రతుకు రోజు
    ఇరుగింటి పొరుగింటి ఇల్లాళ్ళ కష్టాలు
    ఇంతుల కానంద మిడని రోజు
    పక్కింటి తగవులు పడతికి టిక్కెట్టు
    లేని వినోదమ్ము కాని రోజు
    మనకెందు కంటూనె మాట పొల్లులు వోక
    పలు ప్రచారాల పాల్పడని రోజు

    చెలగి ఈర్ష్య లసూయలు స్త్రీకి సహజ
    మని జగమ్మున భావింప బడని రోజు
    స్త్రీకి స్త్రీ సత్రువను పేరు చెరగు రోజు
    మహిళ మహిమాన్వితా మూర్తి , మాన్య చరిత .

    ReplyDelete
  11. ఆడాళ్ళూ....మీకు జోహార్లూ....!
    అత్తా, మామలు ఒక అమ్మానాన్నలే .... ఆదరించండి. అమ్మగా, ఆలిగా, కోడలిగా, కూతురుగా మీ పాత్ర అనితర సాద్యం. ఈ అసూయా, ద్వేషాలు విడనాడటం, కష్టమే అయినా స్త్రీగా మీకు కాదు. స్త్రీగా మీరు ఎప్పటికీ పురుషునికి సమానం కాదు .... కాదు కానే కాదు .... ఎక్కువే అనుకుంటున్నాను. చాలా ఎక్కువే అనుకుంటున్నాను.
    కవయిత్రి గారికి జోహార్లు! ఒక స్త్రీ గా పరిపూర్ణతను సాదించడానికి అవసరమైన భావనలను కవితా రూపం లో చక్కగా వివరిస్తూ
    అభినందనలు మెరాజ్ గారు! శుభోదయం!!

    ReplyDelete
  12. This comment has been removed by a blog administrator.

    ReplyDelete