Pages

Thursday 2 January 2014

వలస

    



    వలస

     గంపెడు చీకటి  నెత్తినెత్తుకొని ,
     నగరంవైపు అడుగులేస్తూ.

     కట్టడి  బతుకుల నుండి,
     వత్తిడి బతుకుల వైపుకు తిరిగి.

     డొక్కలెండగట్టుకొని  పరుగులెత్తుతూ ,
     కాకినోట్లో కప్పపిల్లలా విలవిల్లాడుతూ .

     అనాగరికుడివనే  అపకీర్తి నీ,
     అసమర్దుడివనే  భుజకీర్తినీ  మోస్తూ,

     మురికివాడల్లో మునిగితేలుతూ ,
     సవతి ప్రేమ చూపించే  పట్టణాలలో,

     వలస  ఉగ్గ్గుపాలు తాగే  అమాయకుడా...


     ఎక్కడ చూసినా వ్యసనాల  పలకరింపులూ ,
     ఎంగిలి  మెతుకుల   విదిలింపులూ ,

     నేడు శ్మశానాలు  సైతం మతాల జెండాలెత్తాయి
     శవాలు  సైతం రాజకీయ  కవాతులు చేస్తున్నాయి.

     సరిహద్దుల యుద్దాలలో  నలుగుతూ ,
     సమైఖ్యతా  రద్దులలో  నానుతూ,

     దేశపటం  చెదలు పట్టింది,రహదారులన్నీ నెర్రిలిచ్చాయి.
     అందుకే అడుగు కదపకు, 
     ఉన్నఊరునూ, కన్నాతల్లినీ వదిలెళ్ళకు.  











11 comments:

  1. జానెడు పొట్టను పొషించుకోలేని పరిస్థితిలో...వలవలలూ , సలసలలూ , విలవిలలూ , మలమలలూ........దాటుకుంటూ ఒక్కొక్కసారి మృత్యువాత బారినా పడుతున్నారు "స్వతంత్రదేశంలో" చావు కూడా పెళ్ళిలాంటిదేగా మరి ...మీరజ్ కవిత చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. జీవితమే పోరాటం అయితే, ఇక చావు కూడా సులబంగా రాదు కదా,
      మీ స్పందనకు ధన్యవాదాలు దేవీ.

      Delete
  2. గంపెడు చీకటి నెత్తినెత్తుకొని, కట్టడి బతుకు డొక్కలెండగట్టుకొని పరుగులెత్తి, మురికివాడల్లో మునిగితేలి, వలస ఉగ్గ్గుపాలు తాగేందుకా .... అమాయకుడా?
    ఎక్కడ చూసినా .... వ్యసనాల పలకరింపులూ, ఎంగిలి మెతుకుల విదిలింపులూ, నేడు శ్మశానాలు సైతం మతాల జెండాలై శవాలు సైతం రాజకీయ కవాతులు చేస్తున్నాయి. దేశపటం చెదలు పట్టి, రహదారులన్నీ నెర్రిలిచ్చాయి ఇక్కడ. ఎందుకు ఏమి పాముకుందామని కదులుతున్నావు, ఉన్నఊరునూ, కన్నాతల్లినీ వదిలి .... వలస.

    వలసెళ్ళి నా బ్రతుకులేమీ మారవు అక్కడ పరిస్థితులు మరింత అధ్వాన్నమై బాధపడాల్సొస్తుందని సూచిస్తూ "వలస" కవిత బాగుంది.
    అభినందనలు మెరాజ్ గారు!

    ReplyDelete
    Replies
    1. వలసలు వల్లా, అబద్రతా భాఅవన పెరుగుతుంది, వలస వెళ్ళిన వారికీ, వారినుండి స్థానికులకూ,
      సర్ ధన్యవాదాలు.

      Delete
  3. వలస సహజమే కదా.
    పొట్ట చేత పట్టుకునో, బ్రతికి బాగుపడాలనో,
    చదివి పెద్దలకు పేరు తేవాలనో
    వలస వెళ్తూనే ఉంటారు.
    మరి మీరు కాదంటే ఎలా.
    కొంచెం గుండె ధైర్యం చెప్పొచ్చుకదా వాళ్ళకి.
    మరీ బెదరగొడుతున్నారేంటి?

    ReplyDelete
    Replies
    1. సర్, పొట్ట చేతబట్టుకొని వలస వెళ్ళి బాగుపడ్డ ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి,
      కానీ నేటి పరిస్తితులలో కాదు, బౌగోళిక ,సామాజిక పర్రిస్థితులు అనుకూలించటం అటుంచి,
      మనిషి ఎదుటి మనిషిని నమ్మలేని, గూడులేని వారికి రక్షణ లేని పరిస్థితులు కోకొల్లలు.
      వారికి కావలసింది గుండె దైర్యం కాదు సర్, ప్రభుత్వం నుంచి భరోసా కావాలి.
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Delete
  4. దూరపు కొండలు నునుపు అని భావించే పల్లె అమాయకునికి ఉన్న ఊర్లోనే సుఖంగా బ్రతికే రోజులు రావాలని కోరుకుందాం.

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారూ, నా బ్లాగ్ కి స్వాగతం.
      మంచి రోజులకోసం ఎదురుచూద్దాం.

      Delete
  5. unna uru kanna talli kudu pettaka pote savati tallini debirinchama

    ReplyDelete
    Replies
    1. ఆ దేబిరించటమే.... తరాలుగా జరుగుతుంది.

      Delete
  6. Good narration about the people being sandwitched .

    ReplyDelete