Pages

Monday 20 January 2014

కంటివెలుగువై... మింటిదీపమై






    కంటివెలుగువై... మింటిదీపమై... 


     తొలి కిరణమై,వెలుగు దారమై... 
     నులివచ్చని  స్పర్శవై..,

     ఆత్మీయ బంధానివై, సుమ గంధానివై... 
     కలల కౌముదివై...,

     అనురాగ అతిథివై,రంగుల ఆమనివై..,
     ఎడారిలో నీటి చలమవై..,

     ఒంటరి జీవితానికి  కొండంత ఓదార్పువై..,
     మదుర జ్ఞాపకానివై..,

     ఎద మీటిన  భవిత వీణియవై.., 
     నుదుట రాసిన  వెన్నెల  సంతకమై..,

     అవును 

     చూపులేని  ఆ  కనుపాపలకు,
     వెలుగునిచ్చే మింటిదీపానివై..,

     దృశ్య ప్రవాహమై... తనతో ..,
     ఏడడుగులు  నడిచిన  నీవు 

     మరో మహానీయుడివే....మానవత్వానికి మరో మాటవే.     




22 comments:

  1. తొలి కిరణం, వెలుగు దారం, నులివచ్చని స్పర్శ, ఆత్మ బంధం, సుమ గంధం .... నీవు
    కలల కౌముదివై ..., రంగుల ఆమనివై .., ఎడారి నీటి చలమవై ...., కొండంత ఓదార్పువై ...., మదుర జ్ఞాపకానివై ...., నుదుట రాసిన వెన్నెల సంతకం రాతవై ....,
    అవును
    చూడలేని కనులకు, వెలుగునిచ్చిన దృశ్య ప్రవాహానివై .... ఏడడుగులు నడిచిన మహానీయుడివై .... నీవు మానవత్వానికి మరో రూపానివి.

    చక్కని చిక్కని భావన
    నిండు మనసుతో రాసుకున్న మధుర జ్ఞాపకాల అక్షర రూపం ఈ కవిత
    చాలా చాలా బాగుంది.
    అభినందనలు మెరాజ్ గారు!

    ReplyDelete
    Replies
    1. నా భావాలను విష్లేషించి ఉన్నత వాఖ్యల్లో ఆవిష్కరించే మీకు ధన్యవాదాలు చంద్రా సర్.
      నా కవిత నిండుమనస్సుతో రాసుకున్నదని ప్రశంసించిన మీకు మరోమారు నా ధన్యవాదాలు

      Delete
  2. చూపులేని ఆ కనుపాపలకు,
    వెలుగునిచ్చే మింటిదీపానివై..,
    మరో మహానీయుడివే....మానవత్వానికి మరో మాటవే.
    అద్భుతంగా ఉన్నాయి మీరజ్ ఆ లైన్లు .

    ReplyDelete
    Replies
    1. దేవీ, మీ ప్రశంసా, అభిమానం కలకాలం నా ఆత్మీయ అక్షరాలలో పెనవేసుకుపోయింది.
      ధన్యవాదాలు మీకు.

      Delete
  3. "కంటివెలుగువై... మింటిదీపమై," అనే మనోజ్ఞమైన భావన దివికి భువికి మధ్య వెలుగు వంతెన. మల్లెపూల పొట్లం వంటి మనస్సు పరిమళం గుబాళింపులో మానవత మేల్కొలుపు,మధురోహల పెంపు.

    ReplyDelete
    Replies
    1. రాం ప్రసాద్ గారూ, నా బ్లాగ్ కి స్వాగతం ,
      నా కవితపై మీ ప్రశంసా సమీక్ష అనితర సాద్యం.
      ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  4. చుపుకున్న రూపాన్ని చూపుల దీపాన్నీ చూపులనిచ్చిన చల్లని గోరువెచ్చని తడి హృదయాల్నీ మాకు తగిలేలా మా కళ్ళకీ కనిపించని ద్రుశ్యాల్నీ చూపారు దీదీ.
    ఏడడుగుల బంధంలోని అడుగడుగునీ అందంగా పొందు పరచారు.
    అందుకోండి నా అరమోడ్పు కన్నుల అభివాదనాభినందనలు.

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ,
      మీ సున్నిత హృదయానికి మీరిచ్చిన వ్యాఖ్యానమే తార్కాణం.
      మీ స్పందనకు మరోమారు ధన్యవాదాలు.

      Delete
  5. Replies
    1. "వావ్"... ఈ స్పందన మీ నుంచి, చాలా సంతొషంగా ఉంది. సర్.

      Delete
  6. అభినందనలు మెరాజ్

    ReplyDelete
    Replies
    1. అమ్మయ్య.... రాం సర్ అభినందించారు.
      ఇలాంటి ప్రశంస కొసమైనా ఇంకా బాగా రాయటానికి ప్రయత్నిస్తాను.

      Delete
  7. Replies
    1. మీ స్పందన నాకెంతో స్పూర్తినిస్తుంది సర్.

      Delete
  8. వెలుగు దారలు అంటే కిరణాలేనా?
    మింటి దీపం అంటే సూర్యుడా?
    మీరు రాసే collocations బాగుంటాయి

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పిన ఉపమానాలు రెండూ కరక్టే వర్మాజి ,
      మీ ప్రశంసకు ధన్యవాదాలు.

      Delete
  9. మెరాజ్ గారు... చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ధన్యవాదాలు సతీష్ గారు.

      Delete
    3. ంధన్యవాదాలు సతీష్ గారూ

      Delete

  10. " తొలి కిరణమై,వెలుగు దారమై...
    నులివచ్చని స్పర్శవై..,

    ఆత్మీయ బంధానివై, సుమ గంధానివై...
    కలల కౌముదివై...,"

    ఎంత మృదువైన పదజాలం . కమ్మదనం, తీయదనం అన్నీ సమపాళ్ళలో అందించారు . చాలా బావుందండీ ఫాతిమా గారు
    - శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. సున్నిత మనస్కులకు చక్కని పదజాలమని అర్దమయింది.
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Delete