Pages

Wednesday 8 January 2014

రైతు బేజార్






రైతు బేజార్

మాదో చిన్న పల్లెటూరు, అందరమూ చిన్న కారు రైతులమే,వ్యవసాయం తప్ప మరేపనీ చేతకాదు.పిల్లగాళ్ళకి చదువుకోడానికి ఎలిమెంటరీ చదువుంది, ఆ పై పట్నం పంపలేక చదువులు ఆపించేసి మాతో పొలం పనులకు తీసుకె ళ్తాము.

మాఊర్లోఎప్పుడో ఓ జమిందారు ఉండే వాడంట, ఆయనెప్పుడో పట్నమ్లో సెటిల్ అయిపొయ్యాడు, ఆయన బిడ్డలు విదేశాల్లో ఉన్నారంట, గతేడాది ఆయన పోతూ మా ఊరిమీదున్న అభిమానంతో ఆయన బంగళాని మాఊరి మంచికొసం ఉపయోగించుకోమని, దానిమీద సర్వ హక్కులూ ఊరి పౌరులకు చెందుతాయనీ, ఏదైనా మంచి పని చేయాలంటే, అందరూ కలసి సంతకాలెట్టుకొని ఆ బంగళాని ఉపయోగించుకొవచ్చనీ, దీనివల్లా ఊరు ఎప్ప్పటికీ కలసి కట్టుగా ఉంటుందనీ, నమ్మి అలాంటి ఫిట్టింగ్ పెట్టాడు.

మా ఊరి సర్పంచ్ మమ్మల్ని ఊరిరచ్చరచ్చబండదగ్గరికిరమ్మని కబురెట్టాడు, అందరమూ వెళ్ళాము, మేం వెళ్ళేసరికి, సూటూ,బూటూ వేసుకున్న ఇద్దరు పెద్ద మనుషులు కుర్చీల్లో కూర్చుని ఉన్నారు,
మాకేమీ అర్దం కాలా, ఒకరిమొఖాలొకరం చూసుకుంటూ నిల్చున్నాం, మా సర్పంచ్ మా పక్కకి తిరిగి. అందరూ కూకోండి నిదానంగా ఆలోచించి నేను ఒక మంచి పని చేస్తుండా, మీరు కాదనరని ఇదిగో ఈ పెద్దమనుషులని తీసుకొచ్చినా,అన్నాడు


"మన బంగళా ఈళ్ళకి అప్పగిస్తే(?) రైతు బజార్ చేసి మనకు ఉపయోగపడేట్టు చేస్తారంట," మీ మేలు కొరే ఈపనికి ఒప్పించాను. మీరంతా ఈ కాగితాలమీద ఏలుముద్దర్లు ఏస్తే చాలు అన్నాడు,
ఊరి మంచికి ఉపయోగపడ్తే ఇంకేమి కావాల అనుకొని మూకుమ్మడిగా ఏలు ముద్దర్లు ఏసేశాం.

బూత్ బంగళా పెళ్ళికూతుర్లా, ముస్తాబయింది, మా ఊరి పిల్లగాళ్ళంతా అక్కడే పొద్దస్త మానమూ, అబ్బామనూర్లో రైతు బజారంట, మన పొలమ్లో పండినవన్నీ ఇక్కడే అమ్ముకోవచ్చంట, అందరమూ మురిసిపోయాం, ఆ మాటే మా పెద్ద పిల్లగాడు(మద్రాస్ లో చదువు కుంటున్నాడులే వాళ్ళ అమ్మమ్మ దగ్గర)తో అంటే అస్సలు రైతు బజారంటే ఏంటొతెలుసు కున్నారా? ఎందుకు సంతకాలు చేశారు ఊరు,ఊరూ... అని కేకలేశాడు, వాడంతే పట్నపు నీళ్ళు వంట బట్టి ఏదీ నమ్మడు.
                                             
                       ***


ప్రారంభోత్సవంరోజు మాపొలములో పండిన పిందా,పూతా దూసి బండ్లకెత్తుకొని, పిల్లగాళ్ళని తీసుకొని బంగళా దగ్గరికి బయలు దేరాం, మమ్మల్ని అల్లంత దూరానే ఆపేశారు,
మినిస్టర్ వచ్చాడంట, పోలీసు వచ్చారు, అప్పటికే రిబ్బను తెంపటం (కట్) జరిగిపోయింది, దూరంగా పెద్ద అరుగు దాని మీద మా సర్పంచ్ వెంకట్ రెడ్డీ మొన్నొచ్చిన పెద్ద మనుషులూ కనిపిస్తున్నారు,
మంత్రి హిందీలో ఎందో... చెప్తున్నాడు, మాకేమీ అర్దం కాలా.. మా ఊరి యువకులంతా కోపంతో మమ్మల్ని ఎందుకు రానీటం లేదని ముందుకు ఉరికినారు, అంతే....

పోలీసుల లాటీలు మా మీదకి లేశాయి, గొడ్లు బెదిరి పోయాయి,పిల్ల జెల్లా పరుగు లెట్టారు, అందరమూ పరుగెట్ట్టటం లో.. ఒకరి నొకరం తొక్కు కున్నాం ,తిట్టుకున్నాం.మాలో ఓ పెద్దాయన ఎనక్కి పదండి, అని మందలించి మమ్మల్ని బైలదేర దీశాడు,

మాకు ఇప్పుడు సర్పంచ్ మాటలు వినిపిస్తున్నాయి." మా ఊర్లో అందరమూ అన్నదమ్ముల్లా ఒక్క మాటమీదే ఉంటాము. మా ఊరి రైతులకు అవసరమైన పనిముట్లు, ఎరువులూ, వగైరా కావాలంటే ఎక్కడికో ఎళ్ళాలి, అందుకే వాళ్ళ కోరిక మీద ఇక్కడ ఈ బంగళాలో సరుకులు పెట్టి అమ్మటానికి  ఈ పెద్ద మనుషులు అంగీకరించారు, వీరి పుణ్యమా అని" ..... ... ఇంకేమీ వినిపించ లేదు మాకు.


అనాలోచితమూ, అవిద్యా,నమ్మకమూ, ఇవన్నీ కలిపి మమ్మల్ని కలసి కట్టుగా మోసపోయేలా చేశాయి.

ఈ పరిస్థితి నుండి బైట పడటానికి  ఏ విద్యావంతుణ్ణో ఆశ్రయించాలి.  ఆ విద్యే 
మా పిల్లలకీ మాకూ  ఉంటే ..... 







21 comments:

  1. నిరక్షరాస్యత పర్యవసానం....గూర్చి బాగా వివరించారు మీరజ్ ...ఇంకా ఇప్పటికి కూడా అక్షరాస్యత ఆవశ్యకతను అర్ధంచేసుకోని వారు కనిపిస్తూనే ఉన్నారు . దేశ ప్రగతికి మూలం అక్షరాశ్యతే ....అన్నది మారు మూల కుగ్రామాలకు కూడా చేరుకోవాలి .ఆనాడే ప్రజలు బేజారు నుండి బయట పడతారు .

    ReplyDelete
    Replies
    1. శ్రీదేవీ మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  2. అనాలోచితమూ, అవిద్యా, నమ్మకమూ, ఇవన్నీ కలిపి మమ్మల్ని కలసి కట్టుగా మోసపోయేలా చేశాయి. ఈ పరిస్థితి నుండి బైట పడటానికి ఏ విద్యావంతుణ్ణో ఆశ్రయించాలి. ఆ విద్యే మా పిల్లలకీ మాకూ ఉంటే .....
    కదా!?
    సర్పంచి ఊరి ప్రజల నమ్మకాన్ని దళారులకు తాకట్టుపెట్టగలడా?
    ఆలోచనాత్మక పోస్టింగ్
    చాలా బాగుంది
    అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. నమ్మితేనే కదా సర్, మోసగించగలరు .
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  3. ఆ విద్యే మా పిల్లలకీ మాకూ ఉంటే ..... మనసుకి హత్తుకొనేలా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. వర్మ గారూ, ధన్యవాదాలు

      Delete
  4. కవిత రాసినా కవనమైనా బహుకమనీయం......ఎంతైనా గురువు అనిపించుకున్నారుగా :-)

    ReplyDelete
    Replies
    1. కదా... ప్రియ శిష్యురాలిని మెప్పించటం అంటే మామూలు విషయమా..:-))

      Delete
  5. Illiterates are being cheated time and again by literates.

    ReplyDelete
    Replies
    1. సర్, ధన్యవాదాలు, మీ పున:ఆగమనం సంతోషాన్నిస్తుంది.

      Delete
  6. రైతు బజార్..కాస్తా ... 'రైతు బేజార్' అయింది .
    నూటికి నూరు పాళ్ళు అక్షరాలా నిజం .
    చెబుతున్న దొకటి - జరుగుతున్నది మరోటి. ఇది పరిపాటే అని మనసుని ఎంత ఒదార్చుకున్నా... ఉద్వేగం ఎక్కడో అంచులు దాటేస్తుంది .ఎదో చేయాలనే తపన, ఏమీ చేయలేని నిస్వస్తత .
    దారుణం కదా ఫాతిమా గారు . ఎక్కడో నే రాసుకున్న రెండు వాక్యాలు అనాలోచితంగా కాళ్ళ ముందు కదిలాయ్ ...

    "సగటు మనిషి ఓ విగత జీవిలా
    నియంత్రణ కొల్పోవడమేనా ,,,,,
    ఈ రాగాద్వేషాలకు ఎప్పుడు స్వస్తి ".

    మీ ఆవేదనను అర్ధం చేసుకున్నా

    ReplyDelete
    Replies
    1. మనం ఏమి చేయగలం, పాలకుల చేతిలో ఉంది రైతు భవిత.
      మీ కవిత బాగుంది, ధన్యవాదాలు శ్రీపాద గారూ,

      Delete
  7. భారతదేశంలో ఇప్పుడు లెక్కల్లో చూపిస్తున్న అక్షరాస్యతా శాతం కూడా తప్పే మీరాజ్ గారు. 64 శాతం కాదు కదా.. కనీసం గ్రామాల్లో 50 శాతం కూడా లేదని మా పరిశీలనలు తేల్చాయెప్పుడో. ప్రజలు విద్యావంతులు కావడం మన ప్రభుత్వాలకు ఇష్టం లేదు. ఎందుకంటే మీ కథలో చెప్పినట్టు ప్రశ్నిస్తే మోసం చేయడం కుదరదు కదా. ప్రజలు మోసపోకపోతే... మాటలు చెప్పే నేతలు గెలవలేరు కదా. అద్భుతంగా రాశారు కథ. కానీ.. ఏదో ఒక రోజు సంపూర్ణ అక్షరాస్యతని ఎవరూ ఆపలేదు. ఆ రోజు ఎప్పుడో గానీ... అవినీతి శిధిలాలు అగాధం అంచులోకి కుప్పకూలడం ఖాయం. ఏమనుకోకండి... మరీ ఎక్కువైనట్టుంది... నేను కొంచెం ఎక్కువే మాటాడుతాను.. ఇష్టమైన అంశం మీద...

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. సతీష్ గారూ, నా బ్లాగ్ కి స్వాగతం.
      మీరన్నట్లు అక్షరాస్యత పెరగాలి. మీ వంటి విలేఖరులు ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్ట్టాలి.
      దన్యవాదాలు మీ స్పందనకు

      Delete
  8. నచ్చింది ఈ పోస్ట్ కుడా :)

    ReplyDelete
  9. అక్షరాస్యత అందని ద్రాక్షగా అనాదిగా వూరి పటేల్లు పట్వారీలు అదేదో తమకోసమే అన్నట్లుగా ఆనవాయితీ చెలాయించారు.
    ఊరిని ఎలిమెంటరీ పొలిమేర దాటకుండా కట్టడి చేసి ఊరంతటినీ గుప్పెట్లో పెట్టుకుని ఇలాంటి మోసాలు సునాయాసంగా చేస్తున్నారు దీదీ.
    ఎలిమెంటరీ చదువుతో అక్షరాస్యత వస్తుందంతే.
    ఇలాంటి మోసాలను అరికట్టాలంటే ఉన్నత విద్యే ఉన్నతం.
    ఎది ఏమైనా విద్యా విప్లవమే సాధికారతకు మార్గం.

    ReplyDelete
    Replies
    1. పల్లెలూ ఏమీ మారలేదు. చదువుల కోసం పిల్లల్ని దూరతీరాలకు పంపుతున్నారు, ఆ పిల్లలు పల్లెలకు దూరంగానే ఉంటున్నారు,
      ధన్యవాదాలు తమ్ముడూ నీ స్పందనకు.

      Delete