Pages

Friday 6 July 2012

బిక్షపతి








బిక్షపతి

ఆటో డ్రైవరు బిక్షపతికి కొత్తగా పెళ్లి అయింది. పిల్ల కంట్లో నీళ్ళు రాకూడదూ,ఆటోరంగు మాయకూదడూ, అనే కండిషన్ మీద అత్తగారు ఆటోకోనిచ్చి పిల్లనిచ్చారు. ఆ రోజు బిక్షపతి కూరగాయల మార్కెట్ దగ్గర ఆటో పెట్టుకుని భార్యతో సెల్లులో సోల్లుతున్నాడు. సినిమాకు తీసుకెళ్తానన్నవాడివి ఎక్కడ చచ్చావు అంటూ క్లాసు పీకే ప్రాయోజిత కార్యక్రమం జరుగుతోంది ఫోనులో. త్వరగా ఇంటికెళ్ళడానికి ఇంటివైపు వెళ్ళే సవారీ దొరుకుతే బాగుంటుందని చూస్తున్నాడు బిక్షపతి. ఇంతలో భుజం మీద ఓ బలమైన చెయ్యి పడింది. "ఏయ్! గిది నీ అత్తగారిల్లా రా ఆటో గీడ పెట్టినవ్. తీ నీ యబ్బ బండి తీ " కరుకు ఖాకీ హూంకరించింది.


బిక్షపతి ఒక్క మాటకూడా మాట్లాడకుండా ఆటో స్టార్ట్ చేసి అటు, ఇటూ తిప్పి అక్కడే ఓ మూల నక్కిండు. అప్పుడే వచ్చింది, ఏమిటి "మూర్చ" అనుకుంటున్నారా? కాదు, ఆడ భీముడు లాంటి ఓ శాల్తి. ముగ్గరు పిల్లలూ, ఆరు లగేజీలతో, బిక్షపతి వంక కనీసం చూడకుండా సంచులనూ, పిల్లలనూ ఆటోలో వేసి తనూ ఎక్కి పోనీ అన్నది, ఆమెకు తెలుసు ఎక్కకుండా బైట నిల్చిని మర్యాదగా అడిగితే ఆటో వాళ్ళు ఎన్ని కండిషన్లు పెడతారో, "ఏడ బోవాలె" చిరాగ్గా అడిగాడు బిక్షపతి. 'కొంపల్లి" చెప్పింది ఆమె. అంతే ఆమె పక్కన కూర్చున్న 5 ఏళ్ళ కొడుకు ఒక్క సారిగా ముందుకు వంగి భిక్షపతి చొక్కా పట్టుకుని ఓ గుంజు గుంజి, ఆ .. ఆ .. నేను మా అమ్మమ్మ తానకే బోతా, అంటూ ఆరున్నొక్క రాగం శ్రుతి చేసాడు. భిక్షపతి వెనక్కి తిరిగి "ఏమి లొల్లి ఇదీ, ముందు డిసైడ్ జేసుకోవాలే ఏడికి బోవాల్నో" చిరాగ్గా అన్నాడు, "అరె నువ్వు బోనీ రాదన్నా పిల్లగాని ముచ్చటేందుకు నీకు. చూడ బోతే ఆడాళ్ళకు అత్తా మొగోళ్ళకు మామ లెక్కనున్నవు ". విసుక్కుంది ఆమె. గట్లనే, నాకేం చెసేడ్డుంది అంటూ ఆటో కదిలించాడు. "మీటరు మీన తీస్ రుపై ఐతది." అన్నాడు బిక్షపతి". అవ్ నువ్వు మోస్తున్నవ్లే లగీజీ మొత్తాన్ని నెత్తిమీద " వ్యంగంగా అన్నదామె.


ఆమె పిల్లల్లో పెద్దవాడు బాబు, తర్వాతది పాప 3 ఏళ్ళు, మూడోది పాప చంటిది ఒల్లో ఉంది. పెద్ద పాప సంచీలో ఉన్న కొత్త పుస్తకాల్లోనుంచి ఒకటి తీసి చదవటానికి ప్రయత్నించింది, ఆటో స్పీడుకి గాలి తోడై బుక్కును ఎగరేసుకెల్లింది, అంతే పాప ఏడుపు లంకించుకుంది. "వామ్మో నా బుక్కు ఎగిరిపోయిందే" తల్లి ఆటో ఆపమని ఆర్డరు వేసింది. "ఏమైందీ దిగి పోతారా?" ఆశగా అడిగాడు భిక్షపతి. "దిగిపోవుడేమిటి ? పిల్ల బుక్కు ఎగిగి పోయింది, నువ్వూ నీ దిక్కుమాలిన ఆటో, ఉరుకు తీసుకురాపో" హడావిడి పెట్టిందామె. "మనం మస్తు దూరమచ్చినాం, అది ఇప్పటికే బండ్ల కింద బడి తుక్కులెక్క అయిపోయి ఉంటాది" నీరో చక్రవర్తి లా నింపాదిగా ఉన్నాడు భిక్షపతి. పిల్లాడు ఆటోలో నుండి ఒక్క గెంతుగెంతి , బాల హనుమాన్ లా వాయువేగంతో వెళ్ళాడు. * * *

ఇరవై నిమిషాలైంది పిల్లాడు రాలేదు, తల్లి కంగారు పడుతూ పెద్ద పిల్లని నాలుగు అంటించింది. ఆపిల్ల ఆరు రాగాలు, చిన్న పిల్ల అర రాగంతో కోరస్ అందుకోగా , ఇద్దర్నీ తీసుకుని పిల్లాడిని వెతికేందుకు ఆటో దిగి వెళ్ళింది. ఇంతలో రాంగు ప్లేసులో ఆటో ఆపినందుకు ట్రాపిక్ పోలీసు తెలుగులో ఉన్న బూతులన్నీ లంకించుకున్నాడు. భిక్షపతి అస్సలు తనకు పంచేంద్రియాలలో చెవులే లేనట్లు ఉండిపోయాడు. కాసేపటికి ఆమె పిల్లాడిని తన్నుకుంటూ వచ్చి ఆటో ఎక్కింది. ఇంతకీ కుర్రాడు ఏం చేసాడనుకున్నారు. బండిమీద పడి ఫ్రీగా అరటి పళ్ళు తింటున్న ట్రాఫిక్ పోలీసు విజిల్ కొట్టేయటంలో బిజీగా ఉన్నాడన్నమాట. ఆటో బయలు దేరింది కొంచం దూరం వెళ్ళగానే పీ..... మంటూ పోలీస్ విజిల్ వినిపించింది. ఆటో షడన్ గా ఆపాడు భిక్షపతి, పిల్లాడు చప్పట్లు కొడుతూ "అయ్ అంకులు మస్తు భయపడిండులే.. బలే బలే " పక, పకా నవ్వాడు." అరె! గిదేం పరేశానమ్మా, గీడికెళ్ళి తొవ్వ మంచిగ లేదు, మీరు దిగిపొండ్రి. " అంటూ వారిని దిగిపొమ్మని గోల చేసి దింపేసాడు. ఆ నిర్మానుష్య ప్రాంతంలో బిడ్డలతో దిక్కుతోచక నిల్చుంది పోయిందా ఇల్లాలు.

సవారీ కోసం చూడకుండా ఇంటి ముఖం పట్టాడు భిక్షపతి. వర్షం మొదలై పెద్దగా మారుతుంది, కరంటు పోయింది నగరమంతా చీకటి ఇద్దరు యువకులు ముఖానికి రుమాలు కట్టుకుని ఉన్నారు ఆటో ఆపారు. ఆటో ఆపిన భిక్షపతి" లేదన్నా పనిమీద పోతున్న రాను " అన్నాడు. "అవ్ బే మేముకుడా పనిమీదనే ఉన్నాం" అంటూ ఆటోలో జొరబడ్డారు. భిక్షపతి వాళ్ళను మిర్రర్లో చూసాడు హర్రర్ సినిమాలో భూతాల లెక్కన ఉన్నారు అనుకున్నాడు. కొంచం దూరం పోయిన తర్వాత " అరె ఇక్కడ ఆపు
అన్నారు ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది.

"ఏందన్న గీడ ఆపిండ్రు " అన్నాడు భిక్షపతి, పని ఉందిలే దిగు అంటూ కాలరు పట్ట్టుకుని దింపి, జేబులో డబ్బు లాక్కున్నారు, లబో దిబో మంటున్న భిక్షపతిని రోడ్డు మీద పడేసి ఆటోలో వెళ్తూ. " ఒరే భేవకూఫ్ ఆటో ఇదే రోడ్లో వదిలేస్తాం. రేపు తీసుకెళ్ళు లేకుంటే పోలీసు మామలు అది కూడా మిగల్చరు " అనేసి వెళ్ళిపోయారు. చీకట్లో నడుస్తున్న బిక్షపతి కి ఓ గంట క్రితం తను దింపేసిన మహిళ గుర్తొచ్చింది. నిస్సహాయత ఎంత దయనీయమో అర్ధమైంది.



















27 comments:

  1. కుఱాడు మధ్యలో ఏం చేసాడో చెప్పినట్టు లేరు..అయినా బాగుంది కథనం..ఆటో వాళ్ళ విసుగు, నిర్లక్ష్యం బాగా చెప్పారు ఫాతిమాజీ...అభినందనలు..

    ReplyDelete
    Replies
    1. వర్మ గారూ, కథ నచ్చినందుకు ధన్యవాదాలు, ఇకపోతే కుర్రాడి గూర్చి కొంచం వివరంగా రాయొచ్చు కానీ కథ పెద్దగా అయిపోయి చదివేందుకు ఇబ్బంది అవుతుందని అనుకున్నాను,

      Delete
  2. బాగుంది ఫాతిమా గారు....
    బాగా చిత్రీకరించారు...:)

    ReplyDelete
    Replies
    1. సీత గారూ, కథ చదివి మెచ్చుకున్న మీకు చాలా థాంక్స్.

      Delete
  3. నిజంగా జరిగినట్లుందే!

    ReplyDelete
    Replies
    1. సర్, ధన్యవాదాలు. కథ చదివిన మీకు. నా బ్లాగ్ దర్శించిన మీకు మరో మారు కృతజ్ఞతలు.

      Delete
  4. ఎవరో ఆటో డ్రైవర్ చెప్పినట్టుగా ఉంది . ఎక్కువగా అటో డ్రైవర్ లా దురుసు ప్రవర్తన గురించే రచనలు , పత్రికల్లో వార్తలు వస్తాయి కానీ , వారికీ సమస్యలు ఉంటాయి, మనసు ఉంటుందనే రచనలు చాలా తక్కువ . వారి గురించి ఓ సారి పాజిటివ్ గా రాస్తే దానికి ఒకరిద్దరు నెగిటివ్ గానే కామెంట్ చేశారు

    ఆటో వాడికీ మనసుంటుంది ....
    http://www.amruthamathanam.blogspot.in/2011/05/2.html

    ReplyDelete
  5. మురళి గారూ, ఇక్కడ సమస్య మనసుది కాదు, మీరన్నట్లు విసుగు మనిషికి సహజమే, కానీ ఆటో డ్రైవర్ల ప్రవర్తన ముఖ్యంగా ఆడవారితో వారి మాట తీరూ మారాలి, అయితే ఆడవారు కుడా కొంత విసిగించటం సహజమే, ఇద్దరి మద్యా సహకారం ఉండాలి అన్నదే నేను చెప్పదలచుకున్న విషయం. కథ చదివినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  6. పాపం బిక్షపతి,
    బాగా రాసారు అక్కా :)

    ReplyDelete
  7. హర్షా, థాంక్స్ కథ చదివి ప్రశంస పంపినందుకు.

    ReplyDelete
  8. కథ బాగుంది పాతిమ గారు! కథ చదివిన తర్వాత "చెడపుకురా... చెడెదవు" సూక్తి గుర్తుకొచ్చింది.

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారూ, కథ చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete
  9. Replies
    1. bhaaskar gaaroo, thanks opiggaa naa prthi post chuse meeku maro maaru thanks.

      Delete
  10. నిజమేనండీ ఎక్కువగా ఆటో వాళ్ళు ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తుంటారు కానీ..
    ఆటో వాళ్ళు కొందరు మంచి వాళ్ళు కూడా వుంటారండీ...
    హెల్పింగ్ నేచర్ కూడా వుంటుంది కొందరికి.

    ReplyDelete
    Replies
    1. రాజీ గారూ, నా బ్లాగ్ దర్శించిన మీకు ధన్యవాదాలు. నిజమే మంచి ఆటో వారు కుడా ఉన్నారు. స్కూల్ పిల్లల్ని ప్రేమగా జాగ్రతగా చూసే ఆటో డ్రైవర్లు లేకపోలేదు.

      Delete
  11. కధా, కధనం, మాటలూ...అన్నీ భలే రాశారండీ...చదువుతున్నంతసేపూ చివరికి ఏదో ట్విస్ట్ ఉంటుంది అనుకుంటూనే ఉన్నాము. ప్రతి సీనూ హైదరాబాదు ని కళ్ళకి కట్టి చూపింది.
    ముగింపు కొంచెం త్వరగా ముగించేశారు, కాస్తంత నాటకీయం కలిపి ఉంటే మరింత రక్తి కట్టేదేమో...అలాగే ఆవిడనీ పిల్లలనీ ఆటోలోంచి దింపేసినప్పుడూ కాసిన్ని మాటలు పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది.
    ఏదేమైనా మీలో చాలా మంది రచయితలూ, రచయిత్రులూ ఉన్నారు.

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశగారూ, కథ నచ్చినందుకు సంతోషం. మొదట కథ పెద్దగానే రాసాను, ఎక్కువ హాస్యంతో కానీ పెద్దగా అయిపోతే చదవాలంటే కష్టమని తగ్గించేసాను, ఆమెను దిమ్పెసినప్పుడు ఆమె తిట్టే తిట్లువగైరా,. ఓపిగ్గా చదివిన మీకు ధన్యవాదాలు . ప్రశంసించిన మీకు కృతజ్ఞతలు.

      Delete
  12. హహ.. బాగుంది ఫాతిమా గారు...

    ReplyDelete
    Replies
    1. సాయి గారూ, మీ వ్యాఖ కోసం చూసాను, మీరు నా ప్రతి పోస్ట్ చదవుతున్నందుకు , థాంక్స్ అండీ మీకు.

      Delete
  13. ఫాతిమా గారూ!
    మీ కథల్లో హాస్యం బాగుంటుంది...
    మొత్తమ్మీద హైదరాబాద్ లోని అన్ని విషయాల్లో హాస్యాన్ని చూపించేస్తున్నారు...
    అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ, నా హాస్య కథ నచ్చినందుకు సంతోషం. హైదరాబాదీయులు హాస్యప్రియులండీ. సర్ నా ప్రతి పోస్ట్ చదివి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు.

      Delete
  14. ఓపెన్ ఎండింగ్ తో కథ బాగా కుదిరింది.
    ఎడిటింగ్ కూడా మీరే చేసినట్లున్నారు.
    కథ చదివాక టైటిల్ గా ' నిస్సహాయత ' అయితే
    అన్న ఆలోచన మెదిలింది.
    ఆలోచింప చేసారు.
    శాభాష్! ఇంకా ఇంకా రాయాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  15. సర్, కథ చదివిన మీకు ధన్యవాదాలు. నాకూ పశ్చాతాపం అనే పేరు సరైనది అనిపించింది, కానీ ఎందుకో అది మరీ నీతి కథలా ఉంటుందని పెట్టలేదు. సర్ చూసారా నా ఎడిటింగ్ అర్ధమైపోయింది మీకు. ఇప్పుడు మా వారి సహకారం లేకుండానే పోస్ట్ పెడుతున్నాను.

    ReplyDelete
  16. మీరా గారు కథ మరియు కథనము బాగుంది. పోలీసులకు సంబందించిన సున్నిత విషయాలను బాగా రాశారు.నేను పోలీసు అధికారిని అయిన ఏది నాకు అనుభవము అవుతున్న విషయముగా వుంది

    ReplyDelete