Pages

Monday 16 April 2012

గురువు





చిట్టి వేళ్ళకు అక్షరం నేర్పే అయ్యవారివి,
చిన్నారులకు బంగారు బాట వేసే గురువుగారివి.


అక్షర కిరణ సంస్కారివి.
అజ్ఞాన తిమిర సంహారివి.


                                   క్రమశిక్షణ నేర్పే శిక్షకుడివి,
                                   విచక్షణ చెప్పే దీక్షకుడివి,


                                   మేధస్సుని పెంచే పెన్నిధివి,
                                   తేజస్సుని పంచె  సన్నిధివి.


విద్య నేర్చిన విశ్వామిత్రుడివి,
వివేకం నేర్పిన   సరస్వతీ పుత్రుడివి,


 బొమ్మను చేసిన పరబ్రహ్మకే అభయం ఇచ్చిన   గురుబ్రహ్మవు,
 నీతిని నేర్పిన శాస్త్రానివి... జాతిని నడిపిన సూత్రానివి.


                                  వెతలు పోయే బుజ్జాయికి  రాతలు నేర్పిన ఒజ్జవి,
                                  పుస్తక పుటల మీద అక్షర దుక్కి దున్నిన కర్షకుడివి


                                  నీవే సాక్షాత్ పరబ్రహ్మవి, నీవే సర్వదా పూజార్హుడివి,
                                  అవనిపై అలవోకగా జాలువారి జగతిని జాగ్రుతిచేసి,
                                  నరుల నాలుకపై నర్తించిన "అక్షరశ్రీ" వి.




12 comments:

  1. గురుదేవో నమః.

    చాలా బాగా వ్యక్తీకరించారు.
    అవనిపై అలవోకగా జాలువారి జగతిని జాగ్రుతిచేసి,
    నరుల నాలుకపై నర్తించిన "అక్షరశ్రీ" వి.
    Excellent say..అభినందనలు.

    ReplyDelete
  2. మీ బ్లాగ్ లో చాలా కవితలు ఉన్నయండి. వీలు చూసుకుని అన్ని చదువుతాను. "గురువు" చాలా బాగుందండి.

    ReplyDelete
  3. excellent
    "
    Pusthaka putala meda akshra dukkini dunnina karshakudini"
    Woh...superb

    ReplyDelete
  4. కైత బాగుంది. కానీ చిన్న సందేహం...'బొమ్మను చేసిన పరబ్రహ్మకే అభయం ఇచ్చిన గురుబ్రహ్మవు', ఎప్పుడు అభయాన్ని ఇచ్చాడో తెలపగలరు? మీరే తెలిపితే బాగుంటుంది.

    ReplyDelete
  5. మీ వ్యాఖ్యకు కృతఙ్ఞతలు. పరాశక్తి ధరించిన ఐదు రూపాలలో సరస్వతి ఒకటి. ఆ మాత చదువునే కాదు సర్వశక్తి సామర్థ్యాన్నీ భక్తులకు ప్రసాదిస్తుంది. సనత్కుమారుడు జ్ఞానం గూర్చి బ్రహ్మను అడగగా, బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. "గురువు" అన్న పదానికి లింగరూపేణా మనం విభజించుకున్నా గురువు, చదువు అంటే సరస్వతి మాతయే బొమ్మను చేసిన బ్రహ్మకే అభయం ఒసగి జ్ఞానాన్ని ఇచ్చి ఆయనచే బ్రహ్మ జ్ఞాన సిద్ధాంతాన్ని సృష్టింప చేసిన గురుబ్రహ్మ సరస్వతి.

    ReplyDelete
  6. మీరిచ్చిన అంశానికి ఆధారం(reference) ఎక్కడ చెప్పారు కూడా ఇస్తే అక్కడకి పరిపూర్ణమౌతుంది.

    ReplyDelete
  7. Sir, నా వివరణకు ఆధారం: దేవీ భాగవతం. ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.

    పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. నాకున్న పరిజ్ఞానంతో ఈ వివరణ ఇస్తున్నాను. ఇందులో ఏదైనా సవరణ, వివరణ కానీ సలహా కానీ ఉంటె ఇవ్వగలరు.

    ReplyDelete