Pages

Saturday 28 April 2012

నవ జీవనం



నవ జీవనం

అసహనాల సెగలు ఇంటిలోనే మొలకెత్తుతున్నాయి,
అనుమానాల పొగలు కంటికిందే మొదలౌతున్నాయి.

నేనే గొప్ప అనే అహాన్ని నెత్తికెత్తుకుంటూ,
బింకంగా వంటరితనాన్ని గుండెకు హత్తుకుంటూ.

నన్నెవరూ గుర్తించడం లేదని, నేనే ఎక్కువ శ్రమిస్తున్నాననీ, 
ఏకపాత్రాభినయం చేసుకుంటూ.

పోటీ ప్రపంచంలో పరుగులెత్తుతూ బోర్లాపడుతూ,
విలువలు వలువలు విడిచేస్తూ ఉన్నాయి.

అర్ధరాత్రిని అక్కున చేర్చుకుని నిదుర కళ్ళకి, 
రూపాయి బొమ్మను ఆశగా చూపిస్తూ.

కొలువుల కొలమానంలో జీతం దాగుడుమూతలు,
పనుల కాలమానంలో జీవితం దోబూచులాటలు.

ఒకప్పుడు చిన్ని చిన్ని పలుకులు కళ్ళలో పలికేస్తూ ....
ఇప్పుడు చిన్ని చిన్ని మేస్సేజులు సెల్లులో తుడిపేస్తూ.

ఎవరి లెక్కలు వారివి, ఎవరి పక్కలు వారివి,
ఎవరి పరుగులు వారివి, ఎవరి పాట్లు వారివి.

స్వేచ్చా సంద్రంలో తేలియాడే పిల్లలూ,
నాగరికత మత్తులో జోగుతూ చెరిపేసే ఎల్లలూ.

జీతాలను పెంచుకుంటూ ... జీవితాలను తెంచుకుంటూ,
నాగరికతను వెతుక్కుంటూ ... నెట్లో చిక్కుకుంటూ.

శూన్యం లోకి, సుషుప్తిలోకి  ... జీవితం జారిపోక ముందే,
అంధకారం అలుముకోకముందే, అవివేకాన్ని అణిచివేద్దాం,
వెలుగు వివేకాన్ని ఆహ్వానిద్దాం.



                     



16 comments:

  1. ఇప్పుడు జరుగుతన్న ప్రజల జీవితాన్ని బలే చెప్పారు అండి చాలా బాగుంది...

    ReplyDelete
  2. Thank you Prince. ఆ వొక్క క్షణం ఆలోచించే వాళ్ళల్లో మీరూ ఉన్నందుకు.

    ReplyDelete
  3. నవ జీవానాన్ని అద్దంలో చూపించారు.

    వార్డ్ వెరిఫికేషన్ తీసేయ్యరూ వ్యాఖ్య పెట్టడానికి సులువుగా ఉంటుంది.

    ReplyDelete
  4. చాలా బాగా చెప్పారండీ..!!

    ReplyDelete
    Replies
    1. Thank you very much. మీరు చేస్తానన్న మెయిల్ అందలేదు.

      Delete
  5. జ్యోతిర్మయి గారూ, కృతఙ్ఞతలు. మీ బ్లాగులు చూసాను, చాలా బాగున్నాయి. word verification తీసేసాను.

    ReplyDelete
  6. బాగుందండి ఫాతిమా గారు.

    ReplyDelete
  7. స్వేచ్చా సంద్రంలో తేలియాడే పిల్లలూ,
    నాగరికత మత్తులో జోగుతూ చెరిపేసే ఎల్లలూ.

    జీతాలను పెంచుకుంటూ ... జీవితాలను తెంచుకుంటూ,
    నాగరికతను వెతుక్కుంటూ ... నెట్లో చిక్కుకుంటూ.

    ఫాతిమా గారు !
    పై నాల్గు వాక్యములు చాలా బాగున్నాయండి,contemporary trend ను గుర్తు చేస్తూ.
    ఈ విషయము పై -వేషధారణ మరియు ...ఏమి కావాలని , అనే నా టపాలను మనము ఏమీ చేయలేమా...?
    అనే నా బ్లాగ్ లో చదివి మీ అభిప్రాయాలను తెలుప గలరని ఆశిస్తూ...

    ReplyDelete
  8. హరి గారు , మనం కోరుకోవాల్సింది మునుపటిలా మాట్లాడుకొనేందుకు మంచి భాష . టి.వి ల ముందు సెల్లు లోను చూస్తూ ఒంటరిగా ఉండిపోతూ , కొద్ది రోజులకు మాట్లాడటం మరచి పోతాం.. పాటశాల దశలో కూడా భాష భోదనకు ప్రాముక్యత తగ్గింది . సెల్లు పుణ్యమా అని జాబు రాయటం కూడా పిల్లలకి రావటం లేదు . ఎందుకు లెండి కడుపు చించు కుంటే మాథ్స్, ఫిజిక్స్, పడుతుంది గాని అ ,ఆ లు kaadu.

    "వేషధారణ " ఇది ఓ రకంగా మనిషి యొక్క మూర్తిమత్వాన్ని బహిర్గతం చేస్తుంది మంచి దుస్తులు ఎన్నుకోవటం ఓ కళ , అయెతే నాగరికత అంటే తక్కువ బట్ట కట్టటం అనుకోవటం సమాజం లో చాలా మంది అనుకోవటం మన దౌర్భాగ్యం , పిల్లలకి మంచి దుస్తులు అలవాటు చేయటం తల్లి భాద్యత . ఆమె దుస్తులు కూడా పిల్లలకి మార్గదర్స్యం కావాలి . పసి వయసు నుండి హుందాగా దుస్తులు ధరించిన వారు యుక్త వయస్సులో అశ్లీల దుస్తులు దరించలేరు. కనుక తల్లిదండ్రులు కొంత కారణం అనుకోవచ్చు.

    ReplyDelete
    Replies
    1. fatima gaaru,

      పిల్లలకి మంచి దుస్తులు అలవాటు చేయటం తల్లి భాద్యత . ఆమె దుస్తులు కూడా పిల్లలకి మార్గదర్స్యం కావాలి . పసి వయసు నుండి హుందాగా దుస్తులు ధరించిన వారు యుక్త వయస్సులో అశ్లీల దుస్తులు దరించలేరు. కనుక తల్లిదండ్రులు కొంత కారణం అనుకోవచ్చు.

      పైన వెల్లబుచ్చిన మీ అభిప్రాయము ఎంతో హుందాగా ఉండండి .చాలా పెర్ఫెక్ట్ అందిం మీరు చెప్పింది

      Delete
  9. chala baga rasaru madam.

    ReplyDelete
  10. meraj fatima,

    oka muslim mahilaku intha alochinchagalige swatantramaa?

    manushulanu musugulato,, manasulanu sharia latoo bandhinchesinaa .....

    inkaa ilaa alochinchagalugutunnavante.....

    you are a rare piece ...

    andaru muslim mahilalu neelaa rationalga alochinchagalige rojuste .. enta bavundu.

    any way good work!

    JAIHIND!

    ReplyDelete