Pages

Friday 30 November 2012

ఏల ఈ తిరస్కారం ?




ఏల ఈ తిరస్కారం ?

నీ హృదయం నవనీతం కదా..మరి ఎందుకు,
నా కాలిన  గుండెగాయాన్ని  మాన్పదు ?

నీ మనస్సు అమృతం కదా మరి ఎందుకు,
నా మది బాధను  ఎమార్చదు ?

నీ అడుగులు ప్రతి పదం వైపే కదా మరిఎందుకు,
నా నడకలకు గమ్యం చూపవు?

నీ స్నేహం సాగరం కదా మరిఎందుకు,
నా బ్రతుకునకు  ఎదురీత నేర్పదు ?

నీ జ్ఞానం దీపం లాంటిది కదా,మరిఎందుకు,
నా తలపులకు దారి చూపదు?

నీ బంధం ఆదర్శమైనది కదా మరిఎందుకు,
నా సాన్నిహిత్యాన్ని ఏమారుస్తుంది ?

నీ భోదన ఓదార్పు కదా మరిఎందుకు ,
నా వేదన ఎన్నటికీ  తీరదు?

నీ ప్రేమ సెలయేరు కదా మరిఎందుకు,
నా అనురాగార్తిని  తీర్చదు ?

నీ కరుణ మేఘం కదా మరిఎందుకు,
నా మీద దయా వర్షం కురిపించదు?

నీ శాంతం ఓ కపోతం కదా మరి ఎందుకు
నా ఆవేశాన్ని  సమర్దించదు ?

నిన్ను వరించటం నేను చేసిన దోషమా?
నిన్ను ప్రేమించటం నేను చేసిన నేరమా?

ఎందుకీ మౌనం ,ఏల  ఈ తిరస్కారం?
ఎందుకీ దైన్యం, ఏది పరిష్కారం?

అపరిచితురాలిలా..అపరాదిలా ..అనామికలా ..
ఎన్నాళ్ళిలా..తెరువరిలా..సాగిపోవాలా.......




















8 comments:

  1. మీ పద విన్యాసం మరెక్కడా చూడలేము.
    అలాగే మీరు ఎంచుకునే వస్తువు కూడా అపురూపంగా ఉంటుంది.

    ReplyDelete
  2. సర్, మీ ప్రశంసకు కృతజ్ఞతలు.
    తిరస్కారాన్ని ఎన్నివిదాలుగా అంగీకరించ గలదు చిన్ని గుండె,
    ఆ భావాలను పలకటానికే ఈ పద విన్యాసం.

    ReplyDelete
  3. "ఎందుకీ మౌనం ,ఏల ఈ తిరస్కారం?
    ఎందుకీ దైన్యం, ఏది పరిష్కారం?"

    తిరస్కారానికి గురయిన హృదయవేదనను చక్కగా చెప్పారండీ..

    ReplyDelete
    Replies

    1. రాజీ డియర్, తిరస్కారానికి గురైన మనస్సు ఉంటుందో, ఎంత వేదన పడుతుందో ఇంకా అక్షరాలు పూర్తిగా పుట్టలేదు.
      ప్రతి కవీ తనదైన శైలిలో రాస్తూనే ఉన్నాడు. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  4. ఎప్పటిలా పదాలలా విన్యాసం చేశాయి.
    మీ ప్రతి కవితలో అర్ధం తెలియని పదం ఒకటన్నా వినిపిస్తుంది.
    'తెరువరి' అర్ధం తెలుపగలరా మెరాజ్ గారూ!

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశగారూ, కవిత నచ్చినందుకు చాలా సంతోషం.
      "తెరువరి " అంటే బాటసారి.

      Delete
  5. Replies
    1. Prenana gaaroo, naa kavita nachhinanduku santosham.

      Delete